‘‘అందరూ ఫోన్ చేసి పండగ సినిమా అని అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన పాత్రను మనం బాగా చేయడం వరకే మన చేతుల్లో ఉంటుంది. సినిమా ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఊహించలేం’’ అని అనుపమ అన్నారు. రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ చిత్రం గురువారం విడుదలైన సందర్భంగా అనుపమ పలు విశేషాలు పంచుకున్నారు.
♦ నేను చేసిన గత చిత్రాలు ‘కృష్ణార్జున యుద్ధం, తేజ్’ సరిగ్గా ఆడలేదు. ఈ ఫ్లాప్స్ వల్ల భవిష్యత్తులో స్క్రిప్ట్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని నేర్చుకున్నాను. స్క్రిప్ట్స్ ఎంపిక విషయంలో తొందరపడకుండా ఉండాలి.
♦సినిమాలో ఎంత సేపు ఉన్నాం అన్నదానికంటే కూడా నా పాత్ర ఎంత బావుంది అన్నదే ముఖ్యం. అలాగే నా పాత్ర సినిమాకు ఎంత మేరకు సహాయపడుతుందో ఆలోచిస్తుంటాను.
♦‘హలో గురు..’ టీజర్, ట్రైలర్ చూసి లావయ్యాను అని కొందరు అన్నారు. నాకు మాత్రం లావు అయినట్టుగా ఏం అనిపించలేదు.
♦ ప్రకాశ్‌రాజన్ గారు, రామ్ పాత్రలు ఈ సినిమాకు చాలా కీలకం. ప్రకాశ్‌రాజ్‌గారి దగ్గర నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. షూటింగ్ సమయంలో మా మధ్య మనస్పర్థలు వచ్చాయి అని రాశారు. కానీ మా మధ్య అలాంటివి ఏం జరగలేదు. రామ్‌తో రెండోసారి పని చేయడం చాలా కంఫర్ట్‌బుల్‌గా అనిపించింది.
♦నాకెప్పుడూ వేధింపులు ఎదురవ్వలేదు. బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ల వల్ల మిగతా వారికి అవగాహన వస్తుంది. అది మంచి పరిణామం.
♦ ప్రస్తుతం కన్నడంలో ‘నట సార్వభౌమ’ అనే సినిమా చేస్తున్నాను. కన్నడం సరిగ్గా రాకపోయినా పునీత్ రాజ్‌కుమార్ బాగా సహాయంగా ఉంటున్నారు. పక్కింటి అమ్మాయి ఇమేజ్ నాకేం ఇబ్బంది లేదు. అలాగే వైవిధ్యమైన పాత్రలు చేయాలనుంది.
లావయ్యానా? లేదే!
Published Sun, Oct 21 2018 12:27 AM | Last Updated on Sun, Oct 21 2018 12:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment