- చివరి నిజాం కాలం నాటి నాణేలుగా గుర్తింపు
- బంగారు నాణేలూ లభించాయని పుకార్లు
- నాణేల సేకరణకు రంగలోకి దిగిన అధికారులు
భువనగిరి: భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో వెండి నాణేలు బుధవారం బయటపడ్డాయి. అవి నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్‌జా బహద్దూర్ 7వ రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ కాలానికి సంబంధించిన నాణేలుగా భావిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సంబరాలు జరుగుతున్న రోజున యాదృచ్ఛికంగా నిజాం చివరి నవాబు కాలానికి చెందిన నాణేలు లభించడం విశేషం. వివరాలు.. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మాయ స్వామి తన పాత ఇంటిని రెండు సంవత్సరాల క్రితం కుర్మ సంఘానికి విక్రయించాడు.యాదగిరిగుట్ట మండలం మూటకొండూరులో కాపురం ఉంటున్నాడు. కాగా స్వామి వద్ద ఇంటిని కొనుగోలు చేసిన సంఘం ప్రతిని ధులు పాత భవనాన్ని 15 రోజుల క్రితం జేసీబీతో కూల్చివేశారు.
ఇల్లు కూలగొట్టిన చోట చిన్న పిల్లలు ఆడుకుంటుండగా ఒక బాలుడికి కొన్ని నాణేలు దొరికాయి. వాటిని జేబులో వేసుకుని వెళ్తుండగా చూసిన గ్రామానికి చెం దిన రాములు అనే వ్యక్తి పిల్లవాడిని పిలిచి అడగడంతో అతను సమాధానం చెప్పకుండా పరు గు తీశాడు. దీంతో అనుమానం వచ్చి ఆరా తీశాడు.ఈలోగా ఈ నోటా ఆనో టా ఊరంతా పాకింది. కొన్ని నాణేలను పరిశీలించి చూడగా వెండి నాణేలు అని తేలడంతో వెంటనే ఎవరికి వారే మంగళవారం రాత్రి నుంచి ఆ స్థలంలో మట్టిని తొలగిస్తూ నాణేల కోసం వెతకడం ప్రారంభించారు. కొం దరికి నాణేలు లభించాయి. అయితే ఇల్లు కూల్చిన సమయం లో తొలగిం చిన గోడల మట్టిలో కూడా నాణేలు ఉండవచ్చునని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే రెండు రోజులుగా ఎవరికి వారే మట్టిని తవ్వి నాణేలు తీసుకుపోయారని తెలుస్తోంది. అయితే ఇందు లో బంగారం, వెండి నాణాలు లభించి ఉండవచ్చునన్న అనుమానం వ్యక్తమౌతోంది. కాగా విషయం తెలియగానే రెవెన్యూ,పోలీస్ అధికారులు గ్రామాన్ని సందర్శించి నాణాలను అప్పగించాలని గ్రామస్తులను కోరారు. దీంతో రాత్రి వరకు 21 వెండినాణేలను చిన్న పిల్లల తెచ్చి అధికారులకు అప్పగించారు. మరో మూడు నాణేలు గ్రామానికి చెందిన మ రో వ్యక్తి వద్ద ఉన్నాయని అధికారులకు సమాచారం అం దింది. అతను ప్రస్తుతం యాదగిరిగుట్టకు కుటుంబసమేతంగా వెళ్లిన ట్లు గ్రామస్తులు తెలిపారు. శిథిలాల్లో పెద్దఎత్తున బంగా రం, వెండినాణేలు బయటపడ్డాయనిప్రచారం జరుగుతోంది.
ఇవి నిజాం చివరి రాజు కాలానికి చెందనవి
చందుపట్ల గ్రామంలో బయటపడిన నాణేలు నిజాం ఉల్ ముల్క్‌అసఫ్‌జాహి బహుద్దూర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం కాలానికి చెందినవిగా గుర్తించారు. ఒక్కో తులం బరువుకలిగిన ఒక్కో నాణెంపై ఎక్‌రుపియా(హోలిసి క్కా) అని ఉర్దులో ఉంది. నాణేం మధ్యన ఉన్న చార్మినార్ చిహ్నంలో గల ఐన్ అనే ఉర్దు అక్ష రం అలాగే 7వ నిజాం పరిపాలన కాలం 37 సంవత్సరాల కాలం(18.09,1911 నుంచి 17.09.1948)లో ముద్రించిన నాణేలు ఇవి. నాణేలపై ఉన్న కాలం ఇస్లామిక్ క్యాలెండర్ 1342 సంవత్సరంలో ముద్రించారు. ఆ ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న కాలం 1435 సంవత్సరం. దీని ప్రకారం నాణేలు క్రీస్తు శకం 1921 సంవత్సరంలో ముద్రించబడ్డాయి.
అధికారులకు నాణేలు అందించిన గ్రామస్తులు
నాణేలు బయటపడ్డ విషయం తెలియగానే తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ భిక్షపతి తమ సిబ్బందితో కలిసి సాయంత్రం గ్రామాన్ని సందర్శించారు. నాణేలు దొరికిన వారు ప్రభుత్వానికి ఆప్పగించాలని కోరడంతో 21 నాణేలను పలువురు అప్పగించారు.
నాణేలు అప్పగించిన వారి వివరాలు
ఇప్పటి వరకు 21 గా గుర్తించారు. మొదటగా పూసల రాములు 3, చిన్న నర్సయ్య 1, పన్నీరు గంగయ్య 1, నిలిగొండ మనోజ్ 2, దంతూరి రాజయ్య 2, జూపెల్లి మత్సగిరి 4, సుబ్బురు స్పందన 2, సుబ్బురు శ్రీశైలం 2, దంతూరి లక్ష్మీ వద్ద 4 నాణేలను సేకరించినట్లు గ్రామానికి చెందిన నిలిగొండ బాల్‌రాజు వద్ద 3 నాణేలు రవాల్సి ఉన్నట్లు గ్రామ వీఆర్‌వో భద్రయ్య తెలిపారు.
చందుపట్లలో వెండి నాణేలు లభ్యం
Published Thu, Sep 18 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
Advertisement
Advertisement