
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ రావణ్'. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. వెంకట సత్య దర్శకుడు. తెలుగు తమిళ జూలై 26న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే సినిమా చూడాలనుకుంటున్న ప్రేక్షకుల కోసం చిన్న కంటెస్ట్ పెట్టారు. గెలిస్తే వెండి నాణెల్ని బహుమతిగా ఇస్తామని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)
ఈ సినిమాలో మాస్క్ మ్యాన్ సైకో క్యారెక్టర్ కీలకంగా ఉండనుంది. సినిమా ప్రారంభమైన గంటలోపు ఆ సైకో పాత్రధారి ఎవరనేది కనిపెడితే ఆ ప్రేక్షకుడికి సిల్వర్ కాయిన్ ఇస్తామని చిత్రబృందం ప్రకటించింది. అలా 1000 మందికి ఈ బహుమతిని ఇవ్వబోతున్నారు.
"ఆపరేషన్ రావణ్" సినిమా చూస్తున్న ప్రేక్షకులు థియేటర్ లో నుంచి తమ ఫొటో, టికెట్, ఎవరు సైకో అనే సమాధానాన్ని 9573812831 నంబర్‌కు వాట్సాప్ చేయాలి. ఇలా పంపిన వారిలో వెయ్యి మంది ప్రేక్షకులకు ఒక్కొక్కరికి ఒక్కో సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు.
(ఇదీ చదవండి: Kill Movie Review: 'కిల్' సినిమా రివ్యూ)

Comments
Please login to add a commentAdd a comment