Operation Raavan Movie
-
ఓటీటీలో సైకో థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ఈ ఏడాది జులై 26న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో హీరో రక్షిత్ తండ్రి వెంకట సత్య దర్శకుడిగా పరిచయం అయ్యారు.తెలుగు క్రైమ్ థ్రిల్లర్‌గా విడుదలైన ఈ చిత్రం సుమారు నాలుగు నెలలకు ఓటీటీలో విడుదల కానుంది. ఈ మూవీలో పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించడంతో కాస్త ఆసక్తి కలిగించింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. నవంబర్ 2నుంచి ‘ఆపరేషన్ రావణ్’ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా తెలుగు ప్రకటించింది. ఈమేరకు తాజాగా ఒక ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది.కథేంటంటే.. ఆమని(సంగీర్తన విపిన్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. స్థానిక మంత్రి(రఘు కుంచె) చేసే అవినీతిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఓ స్టోరీ రెడీ చేస్తుంది. అయితే ఆ స్టోరీని టీవీ చానెల్ సీఈఓ(మూర్తి) టెలికాస్ట్ చేయకుండా జాప్యం చేస్తుంటాడు. అంతేకాకుండా అది పక్కకి పెట్టి ఓ సీరియల్ కిల్లర్ కేసుని కవర్ చేయమని ఆమనికి ఆదేశిస్తాడు. ఆమెకు అసిస్టెంట్‌గా అప్పుడే ఉద్యోగంలో చేరిన రామ్(రక్షిత్ అట్లూరి)ని పంపిస్తాడు. రామ్ ఓ నిజాన్ని దాచి ఆమని కోసం ఆ చానెల్లో ఉద్యోగిగా చేరతాడు. ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు నగరంలో ఆ సీరియల్ కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటాడు.ఇలాంటి సమయంలో తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది సుజాత(రాధికా శరత్ కుమార్). పోలీసులతో పాటు ఆమని, రామ్‌లు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరుపుతుంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఆ సీరియల్ కిల్లర్ ఆమనిని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను హత్య చేస్తున్నాడు? పెళ్లికి రెడీ అయిన సుజాత కూతుర్ని కిడ్నాప్ చేసిందెవరు? సీరియల్ కిల్లర్ నుంచి తన ప్రియురాలు ఆమనిని రామ్ ఎలా రక్షించుకున్నాడు? సుజాతకు ఆ సీరియల్ కిల్లర్‌తో ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘ఆపరేషన్ రావణ్’ మూవీ రివ్యూ
టైటిల్: ఆపరేషన్ రావణ్నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్ తదితరులునిర్మాత: ధ్యాన్ అట్లూరిరచన-దర్శకత్వం: వెంకట సత్యసంగీతం: శరవణ వాసుదేవన్సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టివిడుదల తేది: జులై 26, 2024పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి. తాజాగా ఆయన నటించిన చిత్రం ఆపరేషన్ రావణ్. రక్షిత్ తండ్రి వెంకట సత్య ఈ మూవీలో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘ఆపరేషన్ రావణ్’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(జులై 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకో థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఆమని(సంగీర్తన విపిన్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. స్థానిక మంత్రి(రఘు కుంచె) చేసే అవినీతిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఓ స్టోరీ రెడీ చేస్తుంది. అయితే ఆ స్టోరీని టీవీ చానెల్ సీఈఓ(మూర్తి) టెలికాస్ట్ చేయకుండా జాప్యం చేస్తుంటాడు. అంతేకాకుండా అది పక్కకి పెట్టి ఓ సీరియల్ కిల్లర్ కేసుని కవర్ చేయమని ఆమనికి ఆదేశిస్తాడు. ఆమెకు అసిస్టెంట్‌గా అప్పుడే ఉద్యోగంలో చేరిన రామ్(రక్షిత్ అట్లూరి)ని పంపిస్తాడు. రామ్ ఓ నిజాన్ని దాచి ఆమని కోసం ఆ చానెల్లో ఉద్యోగిగా చేరతాడు. ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు నగరంలో ఆ సీరియల్ కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటాడు. తన కూతురు కూడా కనిపించడం లేదని తమ్ముడి వర్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది సుజాత(రాధికా శరత్ కుమార్). పోలీసులతో పాటు ఆమని, రామ్‌లు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరుపుతుంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఆ సీరియల్ కిల్లర్ ఆమనిని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను హత్య చేస్తున్నాడు? పెళ్లికి రెడీ అయిన సుజాత కూతుర్ని కిడ్నాప్ చేసిందెవరు? సీరియల్ కిల్లర్ నుంచి తన ప్రియురాలు ఆమనిని రామ్ ఎలా రక్షించుకున్నాడు? సుజాతకు ఆ సీరియల్ కిల్లర్‌తో ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. సాధారణంగా సైకో థ్రిల్లర్ సినిమాల్లో ఎవరు ఎవరిని, ఎందుకు చంపుతున్నారు? దాని వెనక మిస్టరీని తెలుసుకోవడంలోనే కథనం సాగిపోతూ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో నేరం జరిగిన తీరు..వాటి చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్..దాన్ని హీరో ఎంత తెలివిగా ఛేదించాడన్న అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. బిగిసడలని స్క్రీన్‌ప్లే ఉండాలి. అప్పుడే రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను థియేటర్స్‌లో కూర్చొబెట్టగలుగుతాం. ఆపరేషన్ రావణ్ సినిమా విషయంలో ఆ ప్రయత్నం కొంతవరకు మాత్రమే సఫలం అయింది. సైకో థ్రిల్లర్ చేసే హత్యలు.. దాన్ని చూపించిన తీరు ఉత్కంఠబరితంగా ఉన్నా.. దాని చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్ మాత్రం సాదా సీదా అనిపిస్తుంది. సైకో కిల్లర్‌ని కనిపెట్టేందుకు పోలీసులతో పాటు హీరోహీరోయిన్లు చేసే ఇన్వెస్టిగేషన్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే సైకో కిల్లర్ ఎవరని తెలిసిన తర్వాత షాక్‌కి గురవుతాం. అలాగే అతను అలా మారడానికి గల కారణం కూడా వాస్తవికంగా ఉంటుంది. సైకో ఎవరనేది చివరివరకు తెలియకుండా దర్శకుడు జాగ్రత్తగా కథనాన్ని నడిపాడు. తొలి సినిమానే అయినా..కొన్ని సీన్లను అనుభవం ఉన్న డైరెక్టర్లా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభంలోనే సైకో కిల్లర్ హత్య సీన్ పెట్టి కథపై ఆస్తకి కలిగించాడు. ఆ తర్వాత హీరో ఎంట్రీ, హీరోయిన్‌తో లవ్ అంతా సాదా సీదాగా సాగిపోతుంది. కొన్ని అనవసరపు సన్నివేశాలను పెట్టి కథను సాగదీశాడు. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరై ఉంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మరింత పెరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. సైకో కిల్లర్ ఫేస్ రివీల్ చేసే సీన్, ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఆపరేషన్ రావణ్ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. గత సినిమాలతో పోలిస్తే రక్షిత్ అట్లూరి నటన మరింత మెరుగు పడింది. జర్నలిస్ట్ రామ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. ముఖ్యంగా సైకో కిల్లర్‌ని ఛేజింగ్ చేసే సీన్ సినిమాకే హైలెట్. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆమనిగా సంగీర్తన విపిన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సైకో కిల్లర్‌గా నటించిన వ్యక్తి కూడా క్లైమాక్స్‌లో తన నటనతో బయపెడతాడు. రాధికా శరత్ కుమార్ పాత్ర నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా ఆకట్టుకుంది. చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. శరవణ వాసుదేవన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సినిమా చూసి విలన్ని కనిపెడితే వెండి కాయిన్ గిఫ్ట్
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ రావణ్'. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. వెంకట సత్య దర్శకుడు. తెలుగు తమిళ జూలై 26న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే సినిమా చూడాలనుకుంటున్న ప్రేక్షకుల కోసం చిన్న కంటెస్ట్ పెట్టారు. గెలిస్తే వెండి నాణెల్ని బహుమతిగా ఇస్తామని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)ఈ సినిమాలో మాస్క్ మ్యాన్ సైకో క్యారెక్టర్ కీలకంగా ఉండనుంది. సినిమా ప్రారంభమైన గంటలోపు ఆ సైకో పాత్రధారి ఎవరనేది కనిపెడితే ఆ ప్రేక్షకుడికి సిల్వర్ కాయిన్ ఇస్తామని చిత్రబృందం ప్రకటించింది. అలా 1000 మందికి ఈ బహుమతిని ఇవ్వబోతున్నారు. "ఆపరేషన్ రావణ్" సినిమా చూస్తున్న ప్రేక్షకులు థియేటర్ లో నుంచి తమ ఫొటో, టికెట్, ఎవరు సైకో అనే సమాధానాన్ని 9573812831 నంబర్‌కు వాట్సాప్ చేయాలి. ఇలా పంపిన వారిలో వెయ్యి మంది ప్రేక్షకులకు ఒక్కొక్కరికి ఒక్కో సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు.(ఇదీ చదవండి: Kill Movie Review: 'కిల్' సినిమా రివ్యూ) -
మా నాన్నే నాకు అవకాశం ఇచ్చారు: హీరో రక్షిత్ అట్లూరి
తండ్రి దర్శకత్వంలో నటించే అవకాశం చాలా మంది హీరోలకు రాదు. కానీ నాకు ఆ అదృష్టం దక్కింది. నాన్నాగారి( వెంకట సత్య) డైరెక్షన్లో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయనే నాకు అన్నారు హీరో రక్షిత్ అంట్లూరి. వెంకట సత్య దర్శకత్వంలో రక్షిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 26న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రక్షిత్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.కోవిడ్ టైమ్ లో “ఆపరేషన్ రావణ్” మూవీ ఆలోచన మొదలైంది. "పలాస" సినిమా తర్వాత మా సుధాస్ మీడియాలో ఎలాంటి సినిమా చేయాలనే చర్చ మొదలైనప్పుడు ఇప్పుడు యంగ్ జనరేషన్ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా థ్రిల్లర్ మూవీ నిర్మిస్తే బాగుంటుందని అనిపించింది.నాన్నగారికి సినిమాల మీద ఉన్న ప్యాషన్ నాకు తెలుసు. పలాస టైమ్ నుంచి ఆయన కథా చర్చల్లో పాల్గొనేవారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఈ మూవీ చేయాలనుకున్నాం. కథ అనుకున్న తర్వాత సెట్స్ మీదకు వెళ్లేందుకు కావాల్సినంత టైమ్ దొరికింది. అప్పుడు నేను నరకాసుర, శశివదనే రెండు సినిమాలు చేస్తున్నా. ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసేప్పటికి “ఆపరేషన్ రావణ్” కథను బాగా డెవలప్ చేసేంత టైమ్ దొరికింది. పర్పెక్ట్ స్క్రిప్ట్ అయ్యాక సెట్స్ మీదకు వెళ్లాం.షూటింగ్ టైమ్ లో నాన్నగారి డైరెక్షన్ పట్ల నాతో పాటు రాధిక, చరణ్ రాజ్ లాంటి వాళ్లంతా హ్యాపీగా ఫీలయ్యారు. వాళ్లందరినీ సంతృప్తిపరచడం అంత సులువు కాదు. దర్శకుడిగా ప్రతిభ చూపిస్తేనే అది సాధ్యమవుతుంది. రాధిక గారు కూడా మా మూవీకి బాగా సపోర్ట్ చేశారు. సినిమా షూటింగ్ టైమ్ లో నాన్న గారే నన్ను గైడ్ చేసేవారు. నేను ఆయనకు చెప్పేంత అవకాశం ఉండదు. ఆయన అన్నీ తెలుసుకునే దర్శకత్వంలోకి వచ్చారు.ఈ సినిమా ఎక్కువ మంది ఆడియెన్స్ కు రీచ్ చేసేందుకు సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇస్తున్నామని ప్రకటించాం. సినిమా చూసి ఫస్టాఫ్ లోగా సైకో ఎవరన్నది కనిపెట్టి మేము ఇచ్చిన నెంబర్ కు వాట్సాప్ పంపిస్తే వారికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం. విజయవాడ, వైజాగ్ వంటి నగరాల్లో నా చేతుల మీదుగా ఈ కాయిన్ ఇస్తాను. కొందరు చెప్పినట్లు ఊరికే చెప్పడం కాదు. వెయ్యి సిల్వర్ కాయిన్స్ చేయించి పెట్టాం.ఇందులో సందేశం ఏమీ ఉండదు. ఈ సినిమాలో సైకో చిన్నప్పటినుంచి అలా ఉండడు. కొన్ని పరిస్థితుల వల్ల అలా అవుతాడు. మనలో ఆలోచనల అంతర్యుద్ధాన్ని ఇప్పటిదాకా ఎవరూ స్క్రీన్ మీద చూపించలేదు. మా సినిమాలో అలాంటి ప్రయత్నం చేశాం. ఆ సీన్ థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది.ఆపరేషన్ రావణ్ లాంటి థ్రిల్లర్ సినిమాను థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుంది. మంచి సౌండ్ ను ఎంజాయ్ చేయగలరు. ఈ సినిమా థియేటర్ ఎక్సీపిరియన్స్ కోసం చేసిందే. ఈ సినిమాలో నటించేందుకు బాగా కష్టపడ్డానని చెప్పలేను గానీ యాక్షన్ సీక్వెన్సులకు మాత్రం శ్రమించాల్సి వచ్చింది. “ఆపరేషన్ రావణ్” లో ఒక యూనిక్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది.రాధిక గారితో నటించడం మర్చిపోలేని ఎక్సీపిరియన్స్. ఆమె సింగిల్ షాట్ లో ఏ సీనైనా చేసేవారు. అలా చేయలేకపోయినప్పుడు తనే బాధపడేవారు. అప్పుడు ఫిల్మ్ ఉన్నప్పటి నుంచి నటించిన డిసిప్లిన్ ఆమెలో ఇప్పటికీ ఉంది. సింగిల్ టేక్ లో చేయలేకపోతే బాధపడేవారు. ధనుష్ చాలా మంచి మూవీస్ చేస్తున్నాడని నాతో చెప్పేవారు. సలహాలు, టిప్స్ ఇవ్వడం కాదు గానీ ఆమెతో మాట్లాడటమే ఇన్స్ పైరింగ్ గా ఉండేది. చాలా తక్కువ మాట్లాడుతుంటారు రాధిక గారు.“ఆపరేషన్ రావణ్” సినిమాకు బీజీఎం చాలా ఇంపార్టెంట్. వసంత్ గారు బీజీఎం ఇచ్చారు. మంచి అట్మాస్ థియేటర్ లో మా మూవీ చూస్తే బాగా కనెక్ట్ అవుతారు. పలాస 2 వర్క్ జరుగుతోంది. తప్పకుండా పలాస 2 ఉంటుంది. -
అందుకే ఆపరేషన్ రావణ్ టైటిల్ పెట్టాం: వెంకట సత్య
‘‘రామాయణం’లోని కొన్ని రిఫరెన్్సలను తీసుకుని మా సినిమా కథను రెడీ చేసుకున్నాం. అందుకే మా చిత్రానికి ‘ఆపరేషన్ రావణ్’ అనే టైటిల్ పెట్టాం. అయితే ‘రామాయణం’లో రావణుడు మారువేషం వేసుకుని వచ్చాడు. మా మూవీలో మాస్క్ పెట్టుకుని వస్తాడు’’ అని డైరెక్టర్ వెంకట సత్య అన్నారు. రక్షిత్ అట్లూరి, సంగీర్తనా విపిన్ జోడీగా రాధికా శరత్‌కుమార్, చరణ్‌రాజ్ కీలక పాత్రల్లో నటించిన న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకట సత్య మాట్లాడుతూ– ‘‘కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, రాజమౌళి, స్టీవెన్ స్పిల్బర్గ్గార్లు నా ఫేవరేట్ డైరెక్టర్స్. రాజమౌళిగారిలాంటి దర్శకుడు ధైర్యంగా ముందడుగు వేసి ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లాంటి సినిమాలు చేయకపోతే తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లి ఆస్కార్ అందుకునేది కాదు.ఇక ‘ఆపరేషన్ రావణ్’ విషయానికొస్తే.. ఓ మనిషి సైకోగా ఎందుకు మారతాడు? అనే అంశాన్ని చూపిస్తున్నాం. అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్‌తో షూటింగ్ పూర్తి చేశాం. అయితే సినిమా తీసినంత సులభంగా రిలీజ్ చేసుకోలేమని తెలుసుకున్నాను. నా కొడుకు రక్షిత్ అట్లూరి పాత్ర, నటన బాగుంటాయి. ‘పలాస 2’ సినిమా ఆలోచనలో ఉన్నాం. మా బ్యానర్ నుంచి ఏడాదికో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
రిస్క్ చేశారు.. సక్సెస్ కావాలి
‘‘ఆపరేషన్ రావణ్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. వెంకట సత్యగారు వాళ్ల అబ్బాయి రక్షిత్ కోసమే ‘పలాస 1978’ మూవీ చేసి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ‘ఆపరేషన్ రావణ్’తో మరోసారి రిస్క్ చేశారు... ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు హీరో విశ్వక్ సేన్. రక్షిత్ అట్లూరి, సంగీర్తనా విపిన్ జంటగా వెంకట సత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో అతిథి విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రక్షిత్‌కు నేను చెప్పే సలహా ఒక్కటే. ఇండస్ట్రీలో చివరి చాన్స్ అనేది ఏమీ ఉండదు. ఇంకో చాన్స్ ఉంటుంది. మనం నమ్మకం వదిలేసినప్పుడే అనుకోని ఫలితాలు వస్తుంటాయి. నమ్మకంతో ప్రయత్నిస్తుంటే తప్పకుండా విజయం వస్తుంది’’ అన్నారు. ‘‘మీ ఆలోచనల ప్రభావం వల్లే మీరు మంచివాళ్లా? చెడ్డ వాళ్లా? అనేది నిర్ణయిస్తారు. మీరు ఎలా ఉండాలో మీ ఆలోచనలే నిర్ణయిస్తాయి. ఆ ΄ాయింట్తోనే ‘ఆపరేషన్ రావణ్’ రూ΄÷ందించా’’ అన్నారు వెంకట సత్య. రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘సెట్లోకి వెళితే నేను యాక్టర్... నాన్న డైరెక్టర్ అంతే. ‘ఆపరేషన్ రావణ్’ ప్రేక్షకులను అల రిస్తుంది. ‘పలాస 2’ సినిమాకు చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
ఆ హంతకుడు ఎవడు.. ఆసక్తికరంగా ‘ఆపరేషన్ రావణ్’
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. రాధికా శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో రక్షిత్ తండ్రి వెంకట సత్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మాస్కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు.‘ఈ చదరంగంలో కపటత్వం, అసత్యం, అతి తెలివితేటలు ఒక్క సెగ్మెట్తో ముగిసిపోతాయి. ఆ దేవుడి ఆట ముగిస్తే అన్ని ఒక్క చోటుకి చేరిపోతాయి..’ అని ఓ గంభీరమైన గొంతుతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. సిటీలో వరుస హత్యలు జరగడం.. ఆ సీరియల్ కిల్లర్ పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం.. హీరో ఛేజింగ్.. రాధికా శరత్‌కుమార్ డిఫరెంట్ లుక్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? దారుణ హత్యల వెనుక ఉన్న కారణం ఏంటి? అనేది తెలియాలంటే ‘ఆపరేషన్ రావణ్’ మూవీ చూడాల్సిందే. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 2న తెలుగుతో పాటు తమిళ్లో కూడా విడుదల కానుంది. -
రక్షిత్ అట్లూరి ‘ఆపరేషన్ రావణ్’ వచ్చేస్తోంది!
రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. వెంకట సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్” సినిమా రిలీజ్ డేట్ ను ఈరోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు వారు వెల్లడించారు.“ఆపరేషన్ రావణ్” రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పై ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ పెట్టారు. యాక్షన్ సీక్వెన్సులోని హీరో రక్షిత్ అట్లూరి స్టిల్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విజయంపై మూవీ టీమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.#OperationRaavan RELEASE DATE IS HERE 🥁Earning all your attention,IN THEATRES - AUG 2nd 🥁🔥Get ready to be captivated by 'A Psycho Story" like never before 😈@RakshitAtluri @sangeerthanaluv @lakshmilohith @SripalCholleti @GskMedia_PR @sarva_vasudevan @sudhasmedia pic.twitter.com/TST5ukBg5u— GSK Media (@GskMedia_PR) July 3, 2024