విశ్వక్ సేన్
‘‘ఆపరేషన్ రావణ్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. వెంకట సత్యగారు వాళ్ల అబ్బాయి రక్షిత్ కోసమే ‘పలాస 1978’ మూవీ చేసి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ‘ఆపరేషన్ రావణ్’తో మరోసారి రిస్క్ చేశారు... ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు హీరో విశ్వక్ సేన్. రక్షిత్ అట్లూరి, సంగీర్తనా విపిన్ జంటగా వెంకట సత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో అతిథి విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రక్షిత్‌కు నేను చెప్పే సలహా ఒక్కటే. ఇండస్ట్రీలో చివరి చాన్స్ అనేది ఏమీ ఉండదు.
ఇంకో చాన్స్ ఉంటుంది. మనం నమ్మకం వదిలేసినప్పుడే అనుకోని ఫలితాలు వస్తుంటాయి. నమ్మకంతో ప్రయత్నిస్తుంటే తప్పకుండా విజయం వస్తుంది’’ అన్నారు. ‘‘మీ ఆలోచనల ప్రభావం వల్లే మీరు మంచివాళ్లా? చెడ్డ వాళ్లా? అనేది నిర్ణయిస్తారు. మీరు ఎలా ఉండాలో మీ ఆలోచనలే నిర్ణయిస్తాయి. ఆ ΄ాయింట్‌తోనే ‘ఆపరేషన్ రావణ్’ రూ΄÷ందించా’’ అన్నారు వెంకట సత్య. రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘సెట్‌లోకి వెళితే నేను యాక్టర్... నాన్న డైరెక్టర్ అంతే. ‘ఆపరేషన్ రావణ్’ ప్రేక్షకులను అల రిస్తుంది. ‘పలాస 2’ సినిమాకు చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment