రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. రాధికా శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో రక్షిత్ తండ్రి వెంకట సత్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మాస్‌కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు.‘ఈ చదరంగంలో కపటత్వం, అసత్యం, అతి తెలివితేటలు ఒక్క సెగ్మెట్‌తో ముగిసిపోతాయి. ఆ దేవుడి ఆట ముగిస్తే అన్ని ఒక్క చోటుకి చేరిపోతాయి..’ అని ఓ గంభీరమైన గొంతుతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.
సిటీలో వరుస హత్యలు జరగడం.. ఆ సీరియల్ కిల్లర్ పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం.. హీరో ఛేజింగ్.. రాధికా శరత్‌కుమార్ డిఫరెంట్ లుక్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? దారుణ హత్యల వెనుక ఉన్న కారణం ఏంటి? అనేది తెలియాలంటే ‘ఆపరేషన్ రావణ్’ మూవీ చూడాల్సిందే. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 2న తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment