
ఆ వార్తలు నిజం కాదు
కోహ్లితో పెళ్లి విషయాన్ని ఖండించిన అనుష్క
ముంబై: భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లితో త్వరలో తన వివాహం జరగనుందన్న వార్తల్ని బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఖండించారు. ఆ వార్తలు వాస్తవం కాదని పేర్కొంటూ అనుష్క తరపు ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అనుష్క శర్మ పెళ్లి చేసుకోబోతోందంటూ పలు పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ, అందులో ఏమాత్రం నిజంలేదు. అవి పూర్తిగా నిరాధారమైన వార్తలు’ అని ప్రకటనలో పేర్కొన్నారు.