చిన్నవాడిని పెళ్లాడిన పుతిన్ మాజీ భార్య | Putin's ex-wife marries man 21 years her junior, report says | Sakshi
Sakshi News home page

చిన్నవాడిని పెళ్లాడిన పుతిన్ మాజీ భార్య

Published Sun, Jan 31 2016 12:45 PM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

చిన్నవాడిని పెళ్లాడిన పుతిన్ మాజీ భార్య

చిన్నవాడిని పెళ్లాడిన పుతిన్ మాజీ భార్య

మాస్కో: రష్యాలో ఇప్పుడు ఒకే అంశాన్ని అక్కడి మీడియా కోడై కూస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మాజీ భార్య ప్రేమ వ్యవహారం గురించి ఆ మీడియా బయటకు చెప్పడంతో అక్కడి జనాలు ఔరా అని చెవులు కొరుక్కుంటున్నారు. పుతిన్ మాజీ భార్య లిద్మిలా పుతినా(58) ఎవరికీ తెలియకుండా రహస్యంగా మరోసారి వివాహం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఆమెకంటే 21 ఏళ్లు చిన్నవాడిని పెళ్లాడిందని తెలుస్తోంది. రష్యాకు చెందిన ఓ న్యూస్ మేగజిన్ 'సోబెసిడ్నిక్' స్వతంత్ర పరిశీలన ప్రకారం పుతిన్ మాజీ భార్య ఆమె పేరును లిద్మిలా ఓకెరెత్నాయా అని మార్చుకుంది.

దీంతో ఆ మేగజిన్ 'లిద్మిలా ఈజ్ నో లాంగర్ పుతిన్' అనే శీర్షికతో కథనాన్ని వెలువరించింది. ఇందులో ఆమె అర్తుర్ ఓకెరెత్నీ 37 ఏళ్ల వ్యాపారవేత్తతో కలిసి ఉంటోందని, అతడిని వివాహం చేసుకున్నట్లుందని పేర్కొంది. అయితే, ఆమె మరో వివాహం చేసుకున్నట్లు ఎక్కడా సర్టిఫికెట్ మాత్రం కనిపించడంలేదని కూడా తెలిపింది. కాగా, దీనిపై స్పందించేందుకు పుతిన్ అధికారప్రతినిధి క్రెమ్లిన్ నిరాకరించారు. పుతిన్కు ఆమెకు ఇప్పటికే విడాకులు అయ్యాయని, వారి వ్యక్తిగత జీవితం గురించి తానేది మాట్లాడదలుచుకోలేదని చెప్పారు. 2013 జులై నెలలో పుతిన్, లిద్మిలా విడాకులు తీసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు వారి వైవాహిక జీవితం కొనసాగింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement