Russian President Putin
-
Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ
బోర్గో ఎగ్నాజియా(ఇటలీ): సరిగ్గా జీ7 శిఖరాగ్ర భేటీ మొదలైన రోజే షరతులు ఒప్పుకుంటే ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ తక్షణం అమలుచేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనను ప్రచార ఎత్తుగడగా అని ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ అభివరి్ణంచారు. ఇటలీ సారథ్యంలో ఈ ఏడాది జీ7 భేటీ జరిగాక శనివారం విలేకరుల సమావేశంలో మెలోనీ మాట్లాడారు. ‘‘ కుదిరితే జపాన్, లేదంటే అమెరికా, బ్రిటన్, కెనడాలు సంయుక్తంగా ఉక్రెయిన్‌కు 50 బిలియన్ డాలర్లమేర రుణాలు ఈ ఏడాది చివరికల్లా అందిస్తాయి. యూరప్‌లో స్తంభింపజేసిన రష్యా ఆస్తులను వాడుకుని తద్వారా ఈ రుణాలను చెల్లిస్తాయి. యురోపియన్ యూనియన్ సభ్య దేశాలకు ఈ రుణాలతో ఎలాంటి సంబంధం లేదు. అమెరికా, బ్రిటన్ వంటి జీ7 దేశాలే ఈ రుణ అంశాలను చూసుకుంటాయి’ అని స్పష్టంచేశారు. గాజా స్ట్రిప్‌పై భీకర దాడులతో వేలాది మంది అమాయక పాలస్తీనియన్ల మరణాలకు కారణమైన ఇజ్రాయెల్‌ను జీ7 దేశాలు ఎందుకు శిఖరాగ్ర సదస్సులో తీవ్రంగా మందలించలేదు? అని మీడియా ప్రశ్నించింది. ‘‘ అసలు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు అనేది మీరొకసారి గుర్తుచేసుకోండి. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మందిని పొట్టనపెట్టుకున్నారు. హమాస్ పన్నిన ఉచ్చులో ఇజ్రాయెల్ పడింది’ అని మెలోనీ వ్యాఖ్యానించారు. ‘‘ అక్రమ వలసలకు వ్యతిరేకంగా జీ7 కూటమి స్పందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆఫ్రికా దేశాలకు నిధుల మంజూరు, పెట్టుబడులు పెంచడం ద్వారా ఆయా దేశాల నుంచి ఐరోపాకు వలసలను తగ్గించవచ్చు’ అని చెప్పారు. ఐరోపా దేశాలకు వలస వస్తున్న ఆఫ్రికా పేదలకు ఇటలీ ముఖద్వారంగా ఉన్న విషయం విదితమే. -
Russia-Ukraine War: పుతిన్ ‘తప్పు’టడుగులు
ఉక్రెయిన్‌పై దండయాత్ర రష్యా అధ్యక్షుడు పుతిన్ చారిత్రక తప్పిదమా ? ముందు వెనుక ఆలోచించకుండా యుద్ధానికి దిగి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారా? రష్యా సైన్యానికి వరస ఎదురు దెబ్బలు దేనికి సంకేతం ? 200 రోజులు దాటినా ఉక్రెయిన్‌పై పట్టు కోసం ఇంకా ఆపసోపాలు పడటానికి కారణాలేంటి ? ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టి ఏడు నెలలు కావస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఉక్రెయిన్ తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం మరింత పట్టుదలగా ముందుకు సాగుతూ ఉంటే, అపారమైన నష్టాన్ని చవి చూసిన రష్యా ఒకరకమైన గందరగోళంలో ఉంది. ఇటీవల ఖర్కీవ్‌లో ఉక్రెయిన్ సేన చేతిలో రష్యా ఓటమి ఆ దేశానికి గట్టి ఎదురు దెబ్బగా మారింది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నా రష్యా ఇప్పట్లో యుద్ధానికి ముగింపు పలుకుందని భావించలేం. ఉక్రెయిన్‌లో మిలటరీ ఆపరేషన్ కొనసాగుతుందని పుతిన్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రి పెస్కోవ్ ఇటీవలే స్పష్టం చేశారు. తూర్పు డోన్బాస్ స్వాధీనమే తమ ముందున్న లక్ష్యమని, దాని సాధనకు తొందరేమీ లేదని తాజాగా షాంఘై సహకార సదస్సు సందర్భంగా పుతిన్ కూడా అన్నారు. యుద్ధం మరిన్ని రోజులు కొనసాగుతుందన్న సంకేతాలు ఇచ్చారు. కానీ యుద్ధంలో రష్యా ఆత్మరక్షణలో పడిపోవడానికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్‌కు పశ్చిమదేశాల అండ అమెరికా సహా నాటో దేశాలన్నీ కలసికట్టుగా ఉక్రెయిన్‌కు ఇంతగా అండగా ఉంటాయని పుతిన్ ఊహించలేకపోయారు. యుద్ధం ఎన్నాళ్లు సాగినా సాయం కొనసాగించేందుకు అవి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తోంది. హిమార్స్ రాకెట్ వ్యవస్థతోనే ఉక్రెయిన్ సేనలు వందలాది రష్యన్ స్థావరాలను ధ్వంసం చేశారు. హౌటైజర్స్, స్విచ్‌బ్లేడ్ డ్రోన్లు, రాకెట్ లాంచర్లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ ఆర్మర్ సిస్టమ్స్ ఉక్రెయిన్ దగ్గర ఉన్నాయి. అమెరికా తాజాగా 1500 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం చేస్తానని హామీ ఇచ్చింది. దీంతో రష్యా పరోక్షంగా పశ్చిమ దేశాలతోనే యుద్ధం చేయాల్సి వస్తోంది. ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి ఉక్రెయిన్‌పై దాడులకి దిగితే అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించినా చమురు, గ్యాస్ కోసం తమపై ఆధారపడతాయని త్వరలోనే ఆంక్షలకి ముగింపు పలుకుతాయని పుతిన్ తప్పుగా అంచనా వేశారు. ఫిబ్రవరి నుంచి రష్యాపై 9,200కిపైగా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వెయ్యికి పైగా మల్టీ నేషనల్ కంపెనీలు రష్యాను వీడాయి. ఆయుధాల ఉత్పత్తీ మందగించింది. దాంతో ఉత్తర కొరియా నుంచి కూడా ఆయుధాలు కొనుగోలుకు సిద్ధపడాల్సి వచ్చింది! రష్యాను ఆర్థికంగా చమురు, గ్యాస్ ఎగుమతులు మాత్రమే ఆదుకుంటున్నాయి. పుతిన్ మితిమీరిన ఆత్మవిశ్వాసం యుద్ధం చిటికెలో ముగుస్తుందనే భావనతో రంగంలోకి దిగిన పుతిన్‌కు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోవడం లేదు. యుద్ధాన్ని ముగిస్తే మంచిదన్న భావన రష్యాలో వివిధ వర్గాల్లో పెరుగుతోంది. ఆత్మవిశ్వాసం, అసహనం ఒకే నాణేనికి చెరోవైపు ఉంటాయన్న వాస్తవాన్ని పుతిన్ గ్రహించుకోలేకపోయారని బ్లూమ్‌బర్గ్ కాలమిస్ట్ లియోనిడ్ బెర్షిడ్స్కీ అన్నారు. కదనరంగంలో కిరాయి సైనికులు ఉక్రెయిన్‌లో కిరాయి సైనికుల్ని దింపడం పుతిన్ చేసిన మరో పెద్ద తప్పిదమంటున్నారు. వాగ్నర్ సంస్థతో పాటు పశ్చిమాసియా దేశాలకు చెందిన వారిని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌పై నియమించుకున్నారు. రష్యా ఇలాంటివారిపై ఆధారపడగా, ఉక్రెయిన్ సైనికులు మాత్రం తమ దేశాన్ని కాపాడుకోవాలన్న తపనతో స్వచ్ఛందంగా యుద్ధరంగంలోకి దిగారు. కాంట్రాక్ట్ సైనికులకి తక్కువ జీతాలు ఇస్తూ ఉండడంతో వారు పూర్తి స్థాయిలో పోరాటపటిమను ప్రదర్శించడం లేదు. తమకు పరిచయం లేని భూభాగంలోకి వచ్చి పోరాడుతున్న రష్యా సైనికులు త్వరగా నిస్సత్తువకి లోనవుతూ ఉంటే, సొంతగడ్డపై స్థానికబలంతో పోరాడే ఉక్రెయిన్ సేనలు నిత్యం ఉత్సాహంగా ఉంటున్నాయి. దీంతో రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి వెనక్కి తీసుకుంది. వ్యూహాత్మక తప్పిదాలు యుద్ధంలో రష్యా పలు వ్యూహాత్మక తప్పిదాలు కూడా చేసింది. ఏప్రిల్‌లో కీవ్, ఉత్తర ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రతిఘటన ధాటికి రష్యా సేనలు వెనుదిరిగాయి. ఆ సమయంలో బలగాలను డోన్బాస్పైకి పంపడం వ్యూహాత్మక తప్పిదమనే అభిప్రాయం వినబడుతోంది. ఇలా చేయడం వల్ల చిత్తశుద్ధితో రష్యా తరఫున పోరాడే సైనికుల్ని త్వరితగతిన దేశం కోల్పోయింది. ప్రస్తుతం కదనరంగంలో ఉన్న రష్యా సైనికుల్లో అంకితభావం కనిపించడం లేదు. ఎంత త్వరగా వెనక్కి వెళ్లి కుటుంబాలతో కలిసి గడుపుతామని వారు ఎదురు చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా అణు సత్తాను పెంచాలి
అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ట్వీట్ వాషింగ్టన్/మాస్కో: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధ ముప్పును ప్రపంచం గుర్తించే వరకు తమ దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. అమెరికా వైమానిక దళ లెఫ్ట్‌నెంట్ జనరల్ జాక్ వైన్స్టెయిన్ తదితర ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమైన తర్వాతి రోజే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన∙ట్రంప్.. అమెరికాలో పెనుమార్పునకు సంబంధించిన అంశంపై 140 అక్షరాల్లో వ్యాఖ్యలు చేయడం ప్రమాదకర విషయం. అణ్వాయుధ విధానం అనేది చాలా క్లిష్టమైన విషయం. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి మీద అది ప్రభావం చూపుతుంది’ అని ఆయుధ నియంత్రణ, అణ్వాయుధ వ్యాప్తి నిరోధక (నాన్–ప్రోలిఫరేషన్) కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కాంగ్రెస్ మాజీ సభ్యుడు జాన్ టైర్నే హెచ్చరించారు. కాగా, మొత్తం 7 వేలకుపైగా అణ్వాయుధాలతో అమెరికా తొలి స్థానంలో ఉండగా.. తర్వాత స్థానాల్లో రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా దేశాలున్నాయి. కొత్త విషయమేం కాదు: రష్యా అమెరికా అణు సామర్థ్యాన్ని పెంచాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ‘అసాధారణ విషయం ఏమీ లేదు’ అని పేర్కొన్నారు. ‘ట్రంప్ వ్యాఖ్యలు కొత్తవేం కాదు. అమెరికా అణు సత్తా పెంచాలంటూ ఎన్నికల ప్రచారంలోనే ఆయన చెప్పాడు. తాజా వ్యాఖ్యల్లో అసాధారణ విషయం ఏం లేదు’ అని అన్నారు. -
శ్రీకారం..
సాక్షి, చెన్నై :కూడంకులం అణు విద్యుత్ కేంద్రం ఆవరణలో మూడు, నాలుగు యూనిట్ల పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. గోవా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ పనుల్ని ప్రారంభించారు. ఇక, రెండో యూనిట్లో ఉత్పత్తి వేగం పెరగడం విశేషం. తిరునల్వేలి జిల్లా కూడంకులంలో భారత్, రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేసిన అణు విద్యుత్ కేంద్రంలో తొలి యూనిట్ ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుతున్న విషయం తెలిసిందే. రెండో యూనిట్లో ఉత్పత్తికి శ్రీకారం చుట్టినా, కొన్ని సాంకేతిక కారణాలతో తరచూ ఉత్పత్తిని నిలుపుదల చేసి, మరలా కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ కేంద్రం ఆవరణలో రూ. 39 వేల కోట్లతో మూడు, నాలుగో యూనిట్ల ఏర్పాటుకు రెండు దేశాల మధ్య గతంలో ఒప్పందాలు కుదిరాయి. ఆ మేరకు ఆ యూనిట్ల పనులకు తగ్గ చర్యల్ని అణు విద్యుత్ శక్తి బోర్డు వర్గాలు తీసుకున్నాయి. ఈ పనులకు శ్రీకారం చుట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. ఎక్కడ అణు వ్యతిరేకుల నుంచి నిరసనలు బయలు దేరుతాయోనన్న ముందస్తు సమాచారంతో ఆ పరిసరాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం గోవా నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పనుల్ని ప్రారంభించారు. ఈ సమయంలో మూడు, నాలుగు యూనిట్ల పనులకు శ్రీకారం చుడుతూ అణు విద్యుత్ కేంద్రం వర్గాలు ముందుకు సాగాయి. ఈసందర్భంగా భారత్, రష్యా శాస్త్ర వేత్తలు, ఇంజనీర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుతిన్, మోదీలతో మాట్లాడారు. అదే సమయంలో గత కొద్ది రోజులుగా ఆగి ఉన్న రెండో యూనిట్ ద్వారా ఉత్పత్తి వేగాన్ని పెంచుతూ ముందుకు సాగారు. ఈ విషయంగా కూడంకులం అణు విద్యుత్ కేంద్రం డెరైక్టర్ సుందర్ మీడియాతో మాట్లాడుతూ, ఒకటో యూనిట్ ద్వారా వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సాగుతున్నదన్నారు. రెండో యూనిట్ ద్వారా తమకు అణు శక్తి కమిషన్ యాభై శాతం మేరకు మాత్రమే ఉత్పత్తికి తగ్గ అనుమతి ఇచ్చి ఉన్నట్టు పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో ఆ శాతాన్ని పెంచనున్నారని, ఆ మేరకు పూర్తి స్థాయిలో కొన్ని నెలల వ్యవధిలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఆ యూనిట్ ద్వారా దక్కుతుందన్నారు. ప్రస్తుతం, మూడు, నాలుగు యూనిట్ల పనులకు చర్యలు తీసుకున్నామని, పనుల వేగం పెంచనున్నామని వివరించారు. ఈ పనుల్ని 2022 నాటికి ముగించేవిధంగా ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు. -
అండగా ఉంటాం !
ప్రగతిపథంలో పయనిస్తున్న తమిళనాడు వంటి రాష్ట్రాలకు అణువిద్యుత్ కేంద్రం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. నాలుగు కనెక్షన్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షులు పుతిన్, ముఖ్యమంత్రి జయలలిత కూడంకుళంలోని అణువిద్యుత్ కేంద్రాన్ని భారత జాతికి బుధవారం అంకితం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: కూడంకుళం పరిసర గ్రామాల ప్రజలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి జయలలిత హామీ ఇచ్చారు. అణువిద్యుత్‌పై ప్రజల్లో నెలకొన్న అనవసర భయాందోళనలను రూపుమాపాల్సి ఉందని చెప్పారు. రెండో యూనిట్లో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం అవసరమని అన్నారు. అణువిద్యుత్ కేంద్రాన్ని అందించిన రష్యా అధ్యక్షులు పుతిన్‌కు, రష్యా ప్రజలకు జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్-రష్యా మైత్రిలో ఇది ఒక మైలురాయని అభివర్ణించారు. వాతావరణ, పర్యావరణ సమస్యలకు తావులేకుండా దేశాభివృద్ధికి దోహదం చేయగలదని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్-రష్యా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం శాశ్వతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు రష్యా భాషలో మోదీ చెప్పారు. అణువిద్యుత్ కేంద్రం రూపుదిద్దుకున్నది ఇలా.. భారత్-రష్యా సంయుక్తంగా తిరునెల్వేలి జిల్లా కూడంకుళంలో రూ.22 వేల కోట్లతో రెండు యూనిట్లతో అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు 1998లో ఒప్పందం జరిగింది. అణువిద్యుత్ కేంద్రం వల్ల ప్రజలకు పెనుముప్పు తప్పదంటూ ఉదయకుమార్ అనే సామాజిక కార్యకర్త నేతృత్వంలో 2011 ఆగస్టు నుంచి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. కూడంకుళం పరిసర గ్రామాల్లోని ప్రజలను ఉద్యమకారులు భయంకపితులను చేశారు. అణువిద్యుత్ కేంద్రం వల్ల వాతావరణ కాలుష్యం, ప్రాణాపాయం తప్పదని మత్స్యకార గ్రామాల్లోని వారిని రెచ్చగొట్టి ఉద్యమానికి పురిగొల్పారు. ఆందోళనలతో సుమారు ఆరు నెలలపాటు కూడంకుళంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగి నిర్మాణ పనులు స్తంభించిపోయాయి. పోలీసులు అరెస్ట్‌లకు దిగడంతో ఆందోళనకారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అణువిద్యుత్ కేంద్రం వల్ల ఎటువంటి ముప్పులేదని సుప్రీంకోర్టు 2013 మే 6న తీర్పు చెప్పింది. అంతేగాక అణువిద్యుత్ నిపుణులు నచ్చజెప్పడంతో క్రమేణా ఆందోళనలు సద్దుమణిగి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. 2012 సెప్టెంబర్ 19న విద్యుత్ ప్లాంట్లలో ఇంధనం నింపడం ప్రారంభమై అక్టోబర్ 2తో ముగిసింది. 2013 అక్టోబర్ 22వ తేదీ తెల్లవారుజాము 2.45 గంటలకు కూడంకుళంలో 160 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమై 2014 జూన్ 7వ తేదీ నాటికి వెయ్యిమెగావాట్ల ఉత్పత్తికి చేరుకుంది. ఒక్కో యూనిట్ సామర్థ్యం వెయ్యియూనిట్లు కాగా మొత్తం రెండువేల యూనిట్ల ఉత్పత్తికి సిద్ధమైంది. తొలి యూనిట్ పనులు 2013లో పూర్తికాగా అదే ఏడాది జులై 13న విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. తొలి యూనిట్ సక్రమంగా పనిచేస్తున్న దశలో రెండో యూనిట్ కూడా పూర్తిచేసుకుని విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. -
‘కూడంకుళం’ జాతికి అంకితం
♦ అణు విద్యుత్ ప్లాంట్‌లోని తొలి యూనిట్‌ను ♦ అంకితం చేసిన మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, జయ ♦ భారత్-రష్యా సంబంధాల్లో మైలురాయిగా అభివర్ణన ♦ వెయ్యి మెగావాట్ల యూనిట్ గర్వకారణం: మోదీ సాక్షి ప్రతినిధి, చెన్నై : భారత్.. రష్యా సాంకేతిక సహకారంతో తమిళనాడులో నిర్మించిన ప్రతిష్టాత్మక కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం(కేఎన్‌పీపీ) జాతికి అంకితమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, తమిళనాడు సీఎం జయలలితలు సంయుక్తంగా బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్లాంటులోని మొదటి యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. మోదీ ఢిల్లీ నుంచి, పుతిన్ మాస్కో నుంచి, జయ చెన్నైలోని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యూనిట్ భారత్, రష్యాల సంబంధాల్లో మైలురాయి అని మోదీ, పుతిన్‌లు పేర్కొన్నారు. ఇదుదేశాల వ్యూహాత్మక, ప్రత్యేక భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ప్లాంటు నిర్మాణంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. అతిపెద్ద యూనిట్: మోదీ వెయ్యి మెగావాట్ల సామర్థ్యమున్న ఈ యూనిట్ దేశ విద్యుత్ రంగంలో అతిపెద్ద యూనిట్ అని, స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిని భారీగా పెంచాలన్న భారత లక్ష్యాల్లో మైలురాయి అని మోదీ పేర్కొన్నారు. ఇందుకు భారతీయులు రష్యాకు రుణపడి ఉన్నారన్నారు. ‘ఒకేచోట వెయ్యిమెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే తొలి యూనిట్ ఇదే కావడం గర్వకారణం. కూడంకుళం-1తో భారత్-రష్యా సంబంధాల్లో మరో చారిత్రక ముందుడుగు వేశాం. ఇది ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికే కాక, దృఢమైత్రికీ వేడుకలాంటిది. పారిశ్రామిక ప్రగతి స్వచ్ఛ ఇంధనంతో ముందుకు సాగాలి. అణు విద్యుత్ ఉత్పత్తి ఎజెండాను ముందుకు తీసుకెళ్తాం. రష్యా సహకారంలో కూడంకుళంలోనే ఇలాంటి మరో ఐదు భారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని తమిళంలో జయను ఉద్దేశించి చెప్పారు. భారత్-రష్యా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం శాశ్వతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు పుతిన్‌ను ఉద్దేశించి రష్యన్లో అన్నారు. ఉన్నత ప్రమాణాలు: పుతిన్ అత్యాధునిక రష్యా సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నతస్థాయి భద్రతా ప్రమాణాలతో ఈ యూనిట్‌ను నిర్మించినట్లు పుతిన్ చెప్పారు. కూడంకుళం ప్రాజెక్టు సాకారం కావడానికి తాను సీఎంగా ఉన్న పదేళ్ల కాలంలో ఎల్లప్పుడూ మద్దతిచ్చానని జయ పేర్కొన్నారు. ప్రాజెక్టు భద్రతకు సంబంధించిన స్థానికుల భయాందోళనలు తొలగించేందుకు, వారికి నచ్చజెప్పేందుకు ప్రాధ్యాన్యమిచ్చానని ఆమె పేర్కొన్నారు. ప్రాజెక్టు విశేషాలు.. కూడంకుళం ప్రాజెక్టు నిర్మాణం కోసం 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, సోవియట్ యూనియన్ అధ్యక్షుడు గోర్బచెవ్లు ఒప్పందంపై సంతకాలు చేశారు. అసలు కార్యాచరణ 1997లో మొదలైంది. భారత అణువిద్యుత్ కార్పొరేషన్, రష్యాకు చెందిన రోసాటమ్ సంస్థలు కేఎన్‌పీపీని నిర్మించాయి. శుద్ధి చేసిన యురేనియంతో పనిచేసే వీవీఈఆర్ రకం అణు రియాక్టర్లను ఇందులో నెలకొల్పారు. మొదటి, రెండో యూనిట్లను రూ. 21 వేల కోట్ల ఖర్చుతో నిర్మించారు. రెండో యూనిట్ ఈ ఏడాదిలోనే ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌లో అత్యధిక భాగం తమిళనాడు, మిగతా భాగం కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలు పంచుకుంటాయి. -
'కూడంకుళం' జాతికి అంకితం
న్యూఢిల్లీ: తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం భారత్-రష్యా మైత్రిలో మైలురాయని భారత ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. అణువిద్యుత్ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముగ్గురు అధినేతలు జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. రష్యా రాజధాని మాస్కోలో అధ్యక్షుడు పుతిన్, ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నై సచివాలయంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆశీనులై అణువిద్యుత్ కేంద్రాన్ని సంయుక్తంగా జాతికి అంకితం చేశారు. తిరునల్వెలి జిల్లా కూడంకుళంలో భారత్-రష్యాలు సంయుక్తంగా రూ.22వేల కోట్లతో రెండు యూనిట్ల అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్-రష్యా మధ్య సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైందన్నారు. ఇరుదేశాలు సంయుక్తంగా మరిన్ని అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండు దేశాల ఇంజినీర్లు కఠోర శ్రమకు వందనం అని మోదీ ప్రశంసించారు. ముందుగా మోదీ భారత్, రష్యా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అణువిద్యుత్ కేంద్రం స్థాపనతో రష్యా దేశానికి భారతీయులు రుణపడి ఉన్నారని పేర్కొన్నారు. ఒకేచోట వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే తొలి కేంద్రం ఇదే కావడం గర్వకారణమని అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి తమిళంలో చెప్పారు. ఈ అణువిద్యుత్ కేంద్ర వాతావరణ, పర్యావరణ సమస్యలకు తావులేకుండా దేశాభివృద్ధికి దోహదం చేయగలదని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్-రష్యా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం శాశ్వతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు రష్యా భాషలో మోదీ చెప్పారు. అణువిద్యుత్ కేంద్రాన్ని అందించిన రష్యా అధ్యక్షులు పుతిన్‌కు, రష్యా ప్రజలకు జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. కాగా, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా కూడంకుళం ప్లాంటును మూసివేయాలంటూ రెండేళ్లుగా స్థానిక ప్రజలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇవీ ప్లాంటు ప్రత్యేకతలు: 1. కేఎన్‌పీపీ దేశంలో నిర్మించిన 21వ అణువిద్యుత్ రియాక్టర్. దేశంలో తొలి ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ కూడా ఇదే. 2. రెండు యూనిట్లలోని రియాక్టర్లు అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో కూడిన థర్డ్ జనరేషన్ రియాక్టర్లు. 3. రెండు రియాక్టర్లూ వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పనిచేయగలవు. 4. గత అక్టోబరు నుంచి పనిచేస్తున్న యూనిట్ 1 నుంచి ఇప్పటిదాకా 190 కోట్ల యూనిట్ల విద్యుత్ దక్షిణ గ్రిడ్‌కు అందింది. -
చిన్నవాడిని పెళ్లాడిన పుతిన్ మాజీ భార్య
మాస్కో: రష్యాలో ఇప్పుడు ఒకే అంశాన్ని అక్కడి మీడియా కోడై కూస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మాజీ భార్య ప్రేమ వ్యవహారం గురించి ఆ మీడియా బయటకు చెప్పడంతో అక్కడి జనాలు ఔరా అని చెవులు కొరుక్కుంటున్నారు. పుతిన్ మాజీ భార్య లిద్మిలా పుతినా(58) ఎవరికీ తెలియకుండా రహస్యంగా మరోసారి వివాహం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఆమెకంటే 21 ఏళ్లు చిన్నవాడిని పెళ్లాడిందని తెలుస్తోంది. రష్యాకు చెందిన ఓ న్యూస్ మేగజిన్ 'సోబెసిడ్నిక్' స్వతంత్ర పరిశీలన ప్రకారం పుతిన్ మాజీ భార్య ఆమె పేరును లిద్మిలా ఓకెరెత్నాయా అని మార్చుకుంది. దీంతో ఆ మేగజిన్ 'లిద్మిలా ఈజ్ నో లాంగర్ పుతిన్' అనే శీర్షికతో కథనాన్ని వెలువరించింది. ఇందులో ఆమె అర్తుర్ ఓకెరెత్నీ 37 ఏళ్ల వ్యాపారవేత్తతో కలిసి ఉంటోందని, అతడిని వివాహం చేసుకున్నట్లుందని పేర్కొంది. అయితే, ఆమె మరో వివాహం చేసుకున్నట్లు ఎక్కడా సర్టిఫికెట్ మాత్రం కనిపించడంలేదని కూడా తెలిపింది. కాగా, దీనిపై స్పందించేందుకు పుతిన్ అధికారప్రతినిధి క్రెమ్లిన్ నిరాకరించారు. పుతిన్‌కు ఆమెకు ఇప్పటికే విడాకులు అయ్యాయని, వారి వ్యక్తిగత జీవితం గురించి తానేది మాట్లాడదలుచుకోలేదని చెప్పారు. 2013 జులై నెలలో పుతిన్, లిద్మిలా విడాకులు తీసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు వారి వైవాహిక జీవితం కొనసాగింది. -
ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యం
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ♦ ఇరాక్, సిరియాల్లో పలు ప్రాంతాలు స్వాధీనం ♦ అమెరికా, పాశ్చాత్య దేశాలపై దెబ్బతీయడంపై దృష్టి ♦ ‘ఖలీఫా’ను పునరుద్ధరించడమే లక్ష్యంగా విస్తరణ ఐఎస్ఐఎస్.. గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఉగ్రవాద సంస్థ ఇది. ఇరాక్, సిరియాల్లోని కొన్ని ప్రాంతాలను అనూహ్యమైన బలప్రయోగంతో తమ అధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్ఐఎస్... తాను ‘ఖలీఫా’ను స్థాపించానని, తమ ఖాలీఫ్ అబుబకర్ అల్-బగ్దాదీ అని ప్రకటించింది. ఖాలీఫా అంటే ‘ఇస్లాం రాజ్యం’. ఖాలీఫ్ అంటే ఆ రాజ్యానికి అధినేత, మహమ్మద్ ప్రవక్త వారసుడు. అరేబియా ప్రాంతంతో పాటు మధ్య ప్రాచ్యమంతా ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని.. యూరప్, ఆఫ్రికా, దక్షిణాసియా వరకూ విస్తరిస్తామని, అమెరికా శ్వేతసౌధం పైనా తమ జెండా ఎగురవేస్తామని ఐఎస్ఐఎస్ తన ‘ప్రణాళిక’ను వెల్లడించింది. అందులో భాగంగా భారీ స్థాయిలో ఉగ్రదాడులకు తెగబడుతోంది. ఫ్రాన్స్‌లోనూ శుక్రవారం మారణహోమం సృష్టించి 128 మందిని బలి తీసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఐఎస్ఐఎస్ ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, ఎలా విస్తరిస్తోందనే దానిపై ప్రత్యేక కథనం.. ఎలా పుట్టింది? ఇరాక్‌లో జమాత్ అల్-తాహిద్ వల్-జిహాద్ అనే పేరుతో 1999లో ఒక ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. ఆ తర్వాత 2004 సంవత్సరంలో అల్‌ఖైదాతో చేతులు కలిపి.. ‘అల్-ఖైదా ఇన్ ఇరాక్’ (ఏక్యూఐ) అని పేరు మార్చుకుంది. 2003లో ఇరాక్‌పై అమెరికా ఆక్రమణ నేపథ్యంలో.. ఆ దేశంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏక్యూఐ పాలుపంచుకుంది. 2006లో ఇతర సున్నీ తీవ్రవాద సంస్థలతో కలసి ‘ముజాహిదీన్ షురా కౌన్సిల్’గా మారింది. ఆ తర్వాత కొద్ది కాలానికే.. ఇస్లామిక్ రాజ్యంఏర్పాటును ప్రకటించింది. తన పేరును ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్’ (ఐఎస్ఐ)గా మార్చుకుంది.అబుబకర్ అల్-బాగ్ధాదీ నాయకత్వంలో ఈసంస్థ గణనీయంగా పెరిగింది. సిరియా అంతర్యుద్ధంలో ప్రవేశించి.. ఆ దేశంలోని సున్నీ మెజారిటీ ప్రాంతాల్లో గట్టి పట్టు సాధించింది.2013 ఏప్రిల్‌లో అక్కడి అల్‌ఖైదా అనుబంధఉగ్రవాద సంస్థ జభాట్ అల్-నుస్రా ఫ్రంట్నువిలీనం చేసుకుని.. పేరును ‘ఇస్లామిక్ స్టేట్ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ - ఐఎస్ఐఎస్గా (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరా అండ్ ద లెవాంట్ -ఐఎస్ఐఎల్ అనీ అంటారు) మార్చుకుంది.ఇది 2014 ఫిబ్రవరి వరకూ కూడా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సన్నిహతసంబంధాలు కలిగివుంది. కొంత కాలం ఆధిపత్య పోరు తర్వాత ఐఎస్ఐఎస్తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు అల్‌ఖైదా అధినేతఅల్-జవహరి ప్రకటించారు. ఐఎస్ఐఎస్ ‘ఖలీఫా’.. ఒకప్పుడు అరబ్ దేశాలన్నీ ‘ఖలీఫా’ పాలనలో ఉండేవి. దాదాపు వందల ఏళ్ల పాటు ఒకే ఛత్రం కింద కొనసాగాయి. కానీ పశ్చిమ దేశాల ప్రభావం, ప్రపంచ యుద్ధాల్లో దెబ్బతినడంతో... ఇప్పుడున్న రూపంలో స్వతంత్ర దేశాలుగా రూపొందాయి. అయితే.. ఇస్లాం రాజ్యాన్ని పునరుద్ధరించాలన్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఖలీఫాను రాజకీయ చర్యలద్వారా పునరుద్ధరించాలని ముస్లిం బ్రదర్హుడ్, హిజ్బ్ ఉట్-తాహ్రిర్ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. శతాబ్దాల పాటు కొనసాగిన తమ ‘ఖలీఫా’ విచ్ఛిన్నం కావడానికి కారణం పశ్చిమ దేశాలేనన్న ఆలోచన ఇస్లాం ప్రపంచంలో బలంగా నాటుకుపోయింది. ఆ తర్వాత కూడా పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించి ఇజ్రాయెల్ ఏర్పాటు, అఫ్గానిస్థాన్ ఆక్రమణ, ఇరాక్ ఆక్రమణ వంటి అనేక పరిణామాలు.. ముస్లిం ప్రపంచంలో పాశ్చాత్య దేశాలపై వ్యతిరేకతను పెంచుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బలప్రయోగం ద్వారా ఖాలీఫాను పునరుద్ధరించాలని, పశ్చిమ దేశాలను దెబ్బ తీయాలనే లక్ష్యంతో అల్‌ఖైదా వంటివి పుట్టుకొచ్చాయి.అనూహ్యంగా తెరపైకి వచ్చిన ‘ఐఎస్ఐఎస్’ మాత్రం.. ఇరాక్, సిరియాల్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించి ‘ఖాలీఫా’ను స్థాపించినట్లు ప్రకటించుకుంది. 2014 జూన్ 29న తాను ప్రపంచవ్యాప్త ఖలీఫాగా ఐఎస్ఐఎస్ సంస్థ ప్రకటించుకుంది. తన పేరును ‘ఇస్లామిక్ స్టేట్’గా మార్చుకుంది. అయితే ఏదేశం కానీ, ప్రధాన స్రవంతి ముస్లిం సంస్థలు కానీ దీనిని ఖాలీఫాగా గుర్తించటానికి నిరాకరించాయి. నాయకుడు ఎవరు? ప్రపంచంలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ టైస్ట్‌గా ఉన్న అబుబకర్ అల్-బాగ్దాదీ (43) అసలు పేరు ఇబ్రహీం ఇబిన్ అవ్వాద్ అల్-బాద్రి అల్-సమర్రాయి. 1971లో ఇరాక్‌లోని సమర్రా నగరంలో పుట్టాడు. స్వతహాగా బిడియస్తుడని పేర్కొంటారు. ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ బాగ్దాద్ నుంచి ఇస్లామిక్ స్టడీస్‌లో పీహెచ్డీ పూర్తిచేశాడు. ఇతడు నేరుగా మహమ్మద్ ప్రవక్త వారసుడని ప్రచారం. ఇరాక్‌పై అమెరికా ఆక్రమణ నేపథ్యంలో తన నగరంలో ‘జైష్ హల్ అల్ సున్నా అల్-జమా’ అనే ఒక చిన్న సున్నీ తిరుగుబాటు సంస్థను నెలకొల్పాడు. కొన్ని నెలలకే 2004 ఫిబ్రవరిలో ఫలుజాలో ఇతడిని అమెరికా బలగాలు నిర్బంధంలోకి తీసుకుని.. బాగ్దాద్ శివార్లలో ‘క్యాంప్ బుక్కా’ జైలుకు తరలించాయి. అదే ఏడాది డిసెంబర్లో విడుదల చేశాయి. అనంతరం 2006లో బాగ్దాదీ సంస్థ, మరికొన్ని సున్నీ తిరుగుబాటు సంస్థలు కలిసి ‘ముజాహిదీన్ షురా కౌన్సిల్’గా ఏర్పడ్డాయి. అది ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్’గా పేరు మార్చుకున్నపుడు అందులో బాగ్దాదీ హోదా పెరిగింది. 2010 మే నాటికి ఆ సంస్థ అధినేత అయ్యాడు. బగ్దాదీ ఉన్నట్లా.. లేనట్లా? బగ్దాదీ గాయపడ్డాడని, మరణించాడని పలుమార్లు వార్తలు వెలువడ్డాయి... అయితే అతని మృతి చెందాడని గట్టిగా ధృవీకరించి ఏ దేశమూ చెప్పడం లేదు. ఈ ఏడాది మార్చి 18న సిరియా సరిహద్దుల్లోని అల్ బాజ్ జిల్లాలో.. వైమానిక దాడుల్లో బగ్దాదీ తీవ్రంగా గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. తదుపరి నేతను ఎన్నుకోవడానికి ఐఎస్ఎస్ అగ్రనేతలు సమావేశమయ్యారని కూడా వినవచ్చింది. బగ్దాదీ పూర్తిగా కోలుకోలేదని, బగ్దాదీకి డిప్యూటీగా పనిచేసిన ఫిజిక్స్ ఉపాధ్యాయుడు అబూ అలా అల్- ఆఫ్రీ (ఇరాక్ దేశస్తుడు)ని ఐఎస్ఐఎస్ తాత్కాలిక నాయకుడిగా ఎన్నుకున్నారని ఏప్రిల్ 22న ఇరాక్ ప్రభుత్వవర్గాలు తెలిపాయి. బగ్దాదీ వెన్నముక దెబ్బతిందని, కదల్లేని స్థితిలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. మే 14న బగ్దాదీ ఆడియో టేపుగా ఐఎస్ఐఎస్ ఒక టేపును విడుదల చేసింది. ఇందులో అతను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఇస్లామిక్ స్టేట్‌కు తరలిరావాలని, తమ తరఫున పోరాడాలని పిలుపిచ్చాడు. బగ్దాదీ గాయపడ్డాడు లేదా మరణించాడనే వార్తలు నిజం కాదని ఈ ఏడాది జులై 20న న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అక్టోబరు 11న బగ్దాదీ కాన్వాయ్‌పై తాము దాడి చేశామని ఇరాక్ వాయుసేన ప్రకటించుకుంది. కానీ ధృవీకరణ జరగలేదు. మొత్తం మీద అగ్రరాజ్యం అమెరికా సహా ఏ దేశమూ బగ్దాదీ చనిపోయాడని ధృవీకరించకపోవడం గమనార్హం. బలాన్ని చాటే యత్నం సిరియా అధ్యక్షుడు అసాద్‌ను తొలగించాలని, అతని అసమర్థత వల్లే ఐఎస్ఐఎస్ విస్తరిస్తోందని అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు వాదిస్తున్నాయి. అసాద్ తప్పితే మరొకరు ఐఎస్ఐఎస్ను నిలువరించలేరని రష్యా అధ్యక్షుడు పుతిన్ వాదన. అసాద్ బలగాలకు మద్దతు తమ వైమానిక దళాలతో రష్యా ఐఎస్ఐఎస్పై వైమానిక దాడులు మొదలుపెట్టింది. మరోవైపు అమెరికా ఐఎస్ఐఎస్ ఆధీనంలోని చమురు బావులు, ఇతర కీలక స్థావరాలపై దాడులను ముమ్మరం చేసింది. సింజార్ ఐఎస్ ఆధీనంలో నుంచి జారిపోయింది. కుర్దు బలగాలు సింజార్ను వశం చేసుకున్నాయి. వీటన్నింటిని నేపథ్యంలో ఇటీవల ఐఎస్ఐఎస్ కాస్తా వెనకంజ వేయాల్సి వచ్చింది. బలం కూడా తగ్గినట్లు కనపడింది. ఈ నేపథ్యంలోనే పాశ్చాత్యదేశాల్లో వణుకు పుట్టించడం... తద్వారా తామింకా బలంగానే ఉన్నామని చాటడమే లక్ష్యంగా ఐఎస్ఐఎస్ భారీదాడికి వ్యూహరచన చేసి... పారిస్‌పై విరుచుకుపడి ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. యువత ఎలా ఆకర్షితమవుతోంది..? ఐఎస్ఐఎస్లో చేరేందుకు.. అరబ్ దేశాల నుంచేకాదు.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వంటి పాశ్చాత్య దేశాల నుంచీ.. భారత్ నుంచీ గణనీయమైన సంఖ్యలో యువత ప్రయాణమవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ఇస్లాం రాజ్యాన్ని విస్తరించేందుకు జిహాద్ (పవిత్రయుద్ధం)లో బాధ్యతగా పాల్గొనాలని ఐఎస్ఐఎస్ ఇస్తున్న పిలుపు ఒకటైతే.. ఇరాక్, సిరియాల్లో తాను ఇస్లాం రాజ్యాన్ని స్థాపించానంటూ ‘సాధించిన విజయం’పై చేసుకుంటున్న ప్రచారం మరొకటి. యుక్తవయసులోఉండే ఉడుకు రక్తంతో పాటు.. పాశ్చాత్య దేశాలపై వ్యతిరేకతతో రగులుతున్న ముస్లిం యువతకు ఇదితమకు అందివచ్చిన ఒక అవకాశంగా కనిపిస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే.. ఒకసారి అందులోకి వెళ్లాక.. అక్కడి అంతులేని హింస, అరాచకత్వాలను సహించలేక.. అందులో నుంచి బయటకు రాలేక తల్లడిల్లుతున్న యువకుల ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి. జాతుల హత్యాకాండ.. ఐఎస్ఐఎల్ తన ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో ‘జాతి, మత పరమైన’ హత్యాకాండలకు, హింసకుపాల్పడుతోందని.. ఇతర జాతుల వారిని తుడిచిపెట్టే కార్యక్రమం కొనసాగిస్తోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని వారందరూ ఇస్లాం మతాన్ని స్వీకరించి.. సున్నీ ఇస్లాం, షరియా చట్టాలకు తాను ఇచ్చే భాష్యం ప్రకారం జీవించాలని ఈసంస్థ స్పష్టం చేస్తోందని.. వినని వారిపై హింసకు పాల్పడుతోందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగాషియా ముస్లింలు, స్థానికులైన అస్సీరియన్, చాల్దియన్, సిరియాక్, ఆర్మీనియన్ క్రిస్టియన్లు, యాజిదీలు, డ్రూజ్, షబాక్లు, మాందియాన్లను లక్ష్యంగా చేసుకుని హింసిస్తోంది. ఖ్వినియేలో 90 మంది వరకూ, హర్దాన్‌లో 60 మంది, సింజార్‌లో 500 మందివరకూ, రమాదీ జబాల్లో 70 మంది, ధోలాలో50 మంది, ఖానాసోర్లో 100 మంది, హర్దాన్‌లో 300 మంది వరకూ, అల్-షిమాల్లో డజన్ల సంఖ్యలో, జదాలాలో 14 మంది, టాల్ అఫర్ జైలులో200 మంది యాజిదీలను ఐఎస్ఐఎస్ హత్యచేసింది. ఖోచోలో 400 మంది యాజిదీలను చంపేసివేయి మందిని అపహరించింది. బేషిర్లో 700మంది షియా తుర్కుమెన్లను చంపింది. మోసుల్‌లోని బాదుష్ జైలులో 670 మంది ఖైదీలను చంపింది. ఈ హత్యలన్నీ ఇరాక్‌లోని ఆయా ప్రాంతాలను ఐఎస్‌ఐల్ ఆక్రమించుకుంటున్న క్రమంలో 2014 ఆగస్టులో జరిగినవే. ఇక సిరియాలోనూ ఘ్రానీజ్, అబు హమాన్, కాష్కియే పట్టణాల్లో సున్నీ అల్షియాటట్ తెగకు చెందిన 700మందిని హతమార్చారు. -
‘రష్యా దూకుడుకు కళ్లెం వేద్దాం’
క్రూయెన్(జర్మనీ): ఉక్రెయిన్ విషయంలో రష్యా అనుసరిస్తున్న ధోరణిపట్ల జీ7 దేశాలు కలసికట్టుగా వ్యవహరించి రష్యా దూకుడుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆ కూటమి దేశాల నేతలకు పిలుపునిచ్చారు. జీ7 సదస్సు కోసం క్రూయెన్ పట్టణానికి చేరుకున్న ఒబామాకు జర్మనీ శనివారం సంప్రదాయ విందు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీ8 సమ్మిట్‌గా ఉన్న తాము రష్యా అధ్యక్షుడు పుతిన్ వైదొలగడంతో జీ7గా మారామని అన్నారు. పుతిన్‌కు ఈ సమావేశం ద్వారా గట్టి సందేశం పంపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ అభ్యున్నతికి జర్మనీతో కలసి పనిచేస్తామన్నారు. కాగా, జీ7 సదస్సు జరుగుతున్న క్రూయెన్ పట్టణం ప్రపంచీకరణ వ్యతిరేకులు, పర్యావరణ వేత్తల ఆందోళనలతో అట్టుడికింది.