former first lady
-
బుష్ కుటుంబంలో విషాదం
మిడ్‌లాండ్(టెక్సాస్): అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్(సీనియర్) సతీమణి బార్బరా పియర్స్ బుష్(92) కన్నుమూశారు. వృద్ధాప్యంలోనూ చలాకీగా వ్యవహరించే ఆమె మంగళవారం ఇంట్లో ఉన్నప్పుడే గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారని బుష్ కుటుంబ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. బార్బరా మరణంతో బుష్ కుటుంబంలో విషాదం నెలకొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలు దేశాల ప్రముఖులూ బుష్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. 16 ఏళ్లకే ప్రేమ-పెళ్లి: 1925, జూన్ 8న మాన్‌హట్టన్‌లో జన్మించిన బార్బరా పియర్స్ ఆష్లే హాల్ స్కూల్లో గ్రాడ్యువేషన్ పూర్తిచేశారు. ఆమెకు 16 ఏళ్లు ఉన్నప్పుడు జార్జ్ బుష్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత వారు వివాహబంధంతో ఒక్కటయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో టెక్సాస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అనంతరకాలంలో బుష్ రాజకీయాల్లో ఎదిగి రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వారిలో జార్జ్ బుష్(జూనియర్) కూడా దేశాధ్యక్ష పదవి చేపట్టడం తెలిసిందే. ఫస్ట్‌లేడీగా ఉన్న రోజుల్లో అక్షరాస్యత వ్యాప్తి కోసం బార్బరా కృషిచేశారు. బార్బరా-బుష్ దంపతుల 73 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం. వారికి ఐదురు సంతానం. 17 మంది మనవళ్లు, మనవరాళ్లు, ఏడుగురు మునిమవళ్లు, మునిమనవరాళ్లు ఉన్నారు. సీనియర్ బుష్ (93) సైతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. Statement by the Office of @GeorgeHWBush on the passing of Barbara Pierce Bush this evening at the age of 92. pic.twitter.com/c6JU0xy6Vc — Jim McGrath (@jgm41) 17 April 2018 3. President and Mrs. Bush were married for 73 years. pic.twitter.com/B5P3iOMGU2 — Yashar Ali 🐘 (@yashar) 17 April 2018 -
చిన్నవాడిని పెళ్లాడిన పుతిన్ మాజీ భార్య
మాస్కో: రష్యాలో ఇప్పుడు ఒకే అంశాన్ని అక్కడి మీడియా కోడై కూస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మాజీ భార్య ప్రేమ వ్యవహారం గురించి ఆ మీడియా బయటకు చెప్పడంతో అక్కడి జనాలు ఔరా అని చెవులు కొరుక్కుంటున్నారు. పుతిన్ మాజీ భార్య లిద్మిలా పుతినా(58) ఎవరికీ తెలియకుండా రహస్యంగా మరోసారి వివాహం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఆమెకంటే 21 ఏళ్లు చిన్నవాడిని పెళ్లాడిందని తెలుస్తోంది. రష్యాకు చెందిన ఓ న్యూస్ మేగజిన్ 'సోబెసిడ్నిక్' స్వతంత్ర పరిశీలన ప్రకారం పుతిన్ మాజీ భార్య ఆమె పేరును లిద్మిలా ఓకెరెత్నాయా అని మార్చుకుంది. దీంతో ఆ మేగజిన్ 'లిద్మిలా ఈజ్ నో లాంగర్ పుతిన్' అనే శీర్షికతో కథనాన్ని వెలువరించింది. ఇందులో ఆమె అర్తుర్ ఓకెరెత్నీ 37 ఏళ్ల వ్యాపారవేత్తతో కలిసి ఉంటోందని, అతడిని వివాహం చేసుకున్నట్లుందని పేర్కొంది. అయితే, ఆమె మరో వివాహం చేసుకున్నట్లు ఎక్కడా సర్టిఫికెట్ మాత్రం కనిపించడంలేదని కూడా తెలిపింది. కాగా, దీనిపై స్పందించేందుకు పుతిన్ అధికారప్రతినిధి క్రెమ్లిన్ నిరాకరించారు. పుతిన్‌కు ఆమెకు ఇప్పటికే విడాకులు అయ్యాయని, వారి వ్యక్తిగత జీవితం గురించి తానేది మాట్లాడదలుచుకోలేదని చెప్పారు. 2013 జులై నెలలో పుతిన్, లిద్మిలా విడాకులు తీసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు వారి వైవాహిక జీవితం కొనసాగింది.