
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాతో గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న పుకార్లను నటుడు జహీర్ ఇక్బాల్ ఖండించాడు. దీనిపై ఓ ఇంటర్యూలో జహీర్ స్పందిస్తూ.. ‘నేను సోనాక్షి ప్రేమలో ఉన్నామంటు వచ్చిన వార్తలను చదివి మేమిద్దరం నవ్వుకున్నాం. ఇది నా మొదటి రుమర్ అందుకే ఎలా స్పందించాలో నాకర్థం కాలేదు’ అని చెప్పాడు. ‘‘తరచూ ఇద్దరం కలిసి వివిధ పార్టీలకు, డిన్నర్‌లకు వెళ్లేవాళ్లం. అది చూసి అంతా సోనాక్షి, నేను డేటింగ్‌లో ఉన్నామని భావించి ఉంటారు. నాకు తెలిసి అందువల్లే ఈ పుకార్లు పుట్టుకొచ్చి ఉంటాయి. అయితే ప్రజలు అది మాత్రమే కాదు ఇంకా మా మధ్య ఎముందో కూడా తెలుకోవాలి’’ అంటూ చెప్పుకొచ్చాడు. (నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి)
ఇక తమపై వచ్చిన పుకార్లను చూసి సోనాక్షి, తాను చర్చించుకున్నామని చెప్పాడు. ఇక అందరికి తెలియని విషయం ఏటంటే తాను అప్పటికే మరొకరితో ప్రేమలో ఉన్నానని చెప్పాడు. ఆ విషయం సోనాక్షికి కూడా తెలుసని, దీంతో తమపై వచ్చిన ఈ రూమర్ వల్ల సోనాక్షి చాలా ఇబ్బంది పడిందన్నాడు. అయితే ప్రస్తుతానికి తాను సింగిల్‌గా ఉన్నానని చెప్పాడు. కాగా జాహీర్ గతేడాది దర్శకుడు నితిన్ కక్కర్, రూపొందించిన ‘నోట్‌బుక్’ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశాడు. ఈ చిత్రంలో జాహీర్‌కు సరసన మోహ్నీష్ బహ్ల్ కూతురు ప్రణుతాన్ బహ్ల్ నటించారు. కాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. (కరోనా కాలంలో షేక్ హ్యాండ్ ఇచ్చిన హీరో!)
Comments
Please login to add a commentAdd a comment