
రామ్‌చరణ్- ఉపాసనల దంపతులకు జూన్ 20న పండంటి పాప పుట్టింది. సాక్షాత్తూ లక్ష్మీదేవి తమ ఇంట అడుగుపెట్టిందని మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. గత సంవత్సరం చివర్లో శుభవార్త అందినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని నిహారిక కొణిదెల మొదటిసారి ఇలా స్పందించింది.
(ఇదీ చదవండి: మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్)
'ఈ సంతోషం కోసం మా కుటుంబం మొత్తం ఎంతగానో నిరీక్షించింది. పాప పుట్టిన శుభవార్తతో మా ఆనందానికి అవధులు లేవు. ఆ సమయంలో పాపను చూడడానికి ఎక్కువసేపు వేచి ఉండలేకపోయాను. మా అందరి ఆనందాన్ని పాప రెట్టింపు చేసింది. దీంతో మా అన్నయ్య కుటుంబం సంపూర్ణంగా అనిపిస్తుంది. నాకు గుర్తున్నంత వరకు చరణ్ అన్న మా కజిన్స్ గ్రూప్‌కి పేరెంట్. అతను ఎప్పుడూ మా అందరికి రక్షణగా ఉంటాడు, అందుకే నేను అతనిని 'బాపూజీ' అని పిలుస్తాను. ఉపాసన వదిన ఒక శక్తివంతమైన మహిళ కాబట్టి వారిద్దరి సంరక్షణలో పాప మంచి ఉన్నతస్ధాయికి చేరుకుంటుంది.' అని నిహారిక తెలిపింది.
(ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన)
Comments
Please login to add a commentAdd a comment