ట్విన్ సిస్టర్స్‌ను కలిసిన మెగా వారసురాలు.. ఫోటో వైరల్! | Ram Charan Wife Upasana with Her Daughter Klin Kaara Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Upasana: ట్విన్ సిస్టర్స్‌ను కలిసిన క్లీంకార.. ఉపాసన ట్వీట్ వైరల్!

Published Mon, Feb 12 2024 7:00 PM | Last Updated on Mon, Feb 12 2024 7:40 PM

Ram Charan Wife Upasana with Her Daughter Klin Kaara Photo Goes Viral  - Sakshi

మెగా హీరో, గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే ఈ జంటకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టింది. తన ముద్దుల మనవరాలికి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా పెట్టారు.  క్లీంకారగా నామకరణం చేశారు. పాప జన్మించిన శుభవేళ మెగా ఫ్యామిలీ  గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

అయితే ఉపాసన తాజాగా పోస్ట్‌ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్‌ దంపతులు ఈ ఫోటోకు పోజులిచ్చారు. ఇందులో ఆమె తన సిస్టర్‌ అనుశ్ పాల, ఆమె భర్త కూడా ఉన్నారు. అయితే ఈ ఫోటోలో అనుశ్ పాల దంపతులు తమ ట్విన్ డాటర్స్‌ను చేతుల్లో పట్టుకుని కనిపించారు. వీరంతా కలిసి ఓ ఫంక్షన్‌లో ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది. ఉపాసన తన ఫోటోను పోస్ట్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేసింది. 

తన ట్వీట్‌లో రాస్తూ..'మేము అద్భుతమైన ముగ్గురిని మీకు పరిచయం చేస్తున్నా. వీరంతా పవర్‌ పఫ్‌ గర్ల్స్‌. క్లీంకార తన ఇద్దరు సిస్టర్స్‌ ఆరా పుష్ప ఇబ్రహీం, రైకా సుచరత ఇబ్రహీంలతో కలిసిపోయింది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన మెగాఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement