Ram Charan Team Responds On Mukesh Ambani Gift - Sakshi
Sakshi News home page

Ram Charan: మెగా ప్రిన్సెస్‌కు అంబానీ ఖరీదైన గిఫ్ట్.. క్లారిటీ ఇదే!

Published Fri, Jun 30 2023 6:32 PM | Last Updated on Fri, Jun 30 2023 9:10 PM

Ram Charan Team Responds On Mukesh Ambani Gift - Sakshi

ఈ ఏడాది మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. దాదాపు పెళ్లయిన 11 ఏళ్లకు మెగాస్టార్ ఇంట్లో మనవరాలు అడుగుపెట్టింది. దీంతో మెగాఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్‌ కూడా పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతే కాకుండా జూన్ 30న తన మనవరాలికి బారసాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన బిడ్డకు ప్రముఖ బిజినెస్‌మెన్ ముకేశ్ అంబానీ దాదాపు కోటి రూపాయల విలువైన బంగారు ఊయలను బహుమతిని ఇచ్చారని నెట్టింట చర్చ మొదలైన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?)

అయితే ఈ వార్తలపై రామ్ చరణ్ టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేసింది. ప్రజ్వల ఫౌండేషన్‌ వాళ్లు సిద్ధం చేసిన చెక్క ఉయ్యాలనే ఈ వేడుకల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఉపాసనకు  ప్రజ్వల ఫౌండేషన్‌ చెక్కతో తయారు చేసిన ఊయలను అందించింది. ఈ విషయాన్ని ఉపాసన తన ఇన్‌స్టాలో కూడా పంచుకుంది. దీంతో అంబానీ ఖరీదైన బహుమతి ఇచ్చారన్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. ఇవాళ జరగిన బారసాల కార్యక్రమంలో మెగాస్టార్ మనవరాలితి క్లీంకార అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు.

 (ఇది చదవండి: హీరోయిన్‌ సంఘవి ఇప్పుడెలా ఉందో చూశారా? రీఎంట్రీపై క్లారిటీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement