సాక్షి, హైదరాబాద్: చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరికపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీలోకి చేరడానికి మంగళవారం.. పెద్ద సంఖ్యలో అభిమానులతో కలిసి కర్మన్‌ఘాట్ నుంచి నాంపల్లి వరకు చికోటి భారీగా ర్యాలీగా వెళ్లారు. కానీ చివరి నిముషంలో బీజేపీలో చేరికకు ప్రవీణ్‌కు బ్రేకులు పడ్డాయి.
రేపు దీక్ష కారణంగా సీనియర్లు అందుబాటులో లేరని బీజేపీ కార్యాలయం సిబ్బంది చెప్పడంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ పట్ల అభిమానంతో వచ్చానన్న చికోటి.. మిస్ కమ్యూనికేషన్ ఉండొచ్చన్నారు. జాతీయ నేతలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తితోనే పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రవీణ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా విచారించింది. కాగా, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి.
చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు?
Comments
Please login to add a commentAdd a comment