సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా తెరపైకి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరేందుకు ముహర్తం ఫిక్స్ అయ్యింది. నేడు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో చికోటీ ప్రవీణ్ బీజేపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభిమానులతో కలిసి బీజేపీ ఆఫీసుకి చికోటీ ప్రవీణ్ భారీ ర్యాలీతో రానున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కర్మాన్‌ఘాట్‌లోని హనుమాన్ టెంపుల్ నుంచి భారీ ర్యాలీ తీయనున్నారు. ఎల్బీనగర్ మీదుగా దిల్‌సుఖ్‌నగర్, నల్లగొండ క్రాస్‌రోడ్స్, మలక్‌పేట్, కోఠి, అబిడ్స్, నాంపల్లి వరకు ర్యాలీ జరగనుంది.
ఇక, బీజేపీలో చేరికపై చికోటీ ప్రవీణ్ స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తితోనే పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అక్రమాలకు బీజేపీనే అడ్డుకోగలదని.. అందుకనే బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రవీణ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా విచారించింది.
ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఇక పరిశీలన పర్వం
Comments
Please login to add a commentAdd a comment