Ram Gopal Varma Meets Chikoti Praveen At His Farm House, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: చికోటితో ఆర్జీవీ భేటీ..ఫాంహౌస్‌లో మంతనాలు..త్వరలో సినిమా?

Nov 2 2022 1:53 PM | Updated on Nov 2 2022 3:06 PM

Ram Gopal Varma Meets Chikoti Praveen At His Farm House - Sakshi

రామ్‌గోపాల్‌ వర్మ.. నిత్యం ఏదో ఒక వివాదానికి పురుడు పోస్తూ జనం నోళ్లలో నానే వ్యక్తి. చికోటి ప్రవీణ్.. నిన్న మొన్నటి దాకా కేసులంటూ స్టేషన్ల చుట్టూ తిరిగిన వ్యక్తి. ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? అది కూడా నగరానికి దూరంగా ఫాం హౌజ్ లో సిట్టింగ్ వేస్తే జరిగే చర్చ ఏంటీ?

క్యాసినో కింగ్‌ చీకోటి ప్రవీణ్‌కుమార్‌తో సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ భేటీ అయ్యాడు. చికోటీ ప్రవీణ్‌ కుమార్‌ ఫాంహౌజ్‌కి వెళ్లి మరీ ఆయనను కలిశాడు. ఈ సందర్భంగా చికోటీ ఫాంహౌజ్‌లో ఉన్న జంతువును సందర్శించాడు ఆర్జీవీ. ఈ విషయాన్ని ట్వీటర్‌ వేదికగా తెలియజేస్తూ.. ‘వైల్డ్‌ మ్యాన్‌ చికోటి ప్రవీణ్‌తో కలిసి అతని వైల్డ్‌ పాంహౌజ్‌ని సందర్శించాను. అతని అన్యదేశ అడవి జంతువుల సేకరణ చాలా ఆకట్టుకుంది’అని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. 

కాగా ఇటీవల క్యాసినో వ్యవహారంతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీపై చీకొటి ప్రవీన్ ను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆర్జీవీ అతన్ని కలవడంతో సర్వాత్రా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే చికోటిపై ఆర్జీవీ సినిమా చేయనున్నాడా? అని నెటిజన్స్‌ చర్చించుకుంటున్నారు. మరి  వారిద్దరు ఏం చర్చించారు? సినిమా గురించా?, క్రైం గురించా? లేక జరిగిన క్రైంపై సినిమా తీయడం గురించా? అనేది తెలియాలంటే ఆర్జీవీ నుంచి మరో ట్విట్‌ వచ్చే వరకు ఆగాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement