సాక్షి, హైదరాబాద్: నగరంలోని లాల్‌దర్వాజలో బోనాల సందడి నెలకొంది. ఆలయాల దగ్గర బోనాలతో మహిళలు బారులుతీరారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని కొలిచేందుకు భక్తి శ్రద్ధలతో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు.
కాగా, లాల్ దర్వాజ అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్ ప్రదర్శించారు. చికోటి ప్రవీణ్ లాల్ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటతో వెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారు. ఇక, ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ వద్ద వెపన్స్ ఉండటంతో పోలీసులు కంగుతిన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టారీత్యా నేరమని తెలిపారు. అనంతరం.. ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, వెపన్స్‌కు లైసెన్స్ లేకపోతే కేసులు నమోదు చేయనున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో లాల్‌దర్వాజ బోనాల సందడి.. పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని
Comments
Please login to add a commentAdd a comment