lal darwaja bonalu
-
పాతబస్తీలో బోనాల సందడి
-
బోనాల వేళ చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్.. పోలీసుల దెబ్బకు పరారీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్ ప్రదర్శించిన విషయం తెలిసిందే. చికోటి ప్రవీణ్ లాల్ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటితో వెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, వీరి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, రిమాండ్ రిపోర్టు ప్రకారం.. చికోటి ప్రవీణ్ పరారీలో ఉన్నాడు. ప్రవీణ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. ఈ కేసులో చికోటి ప్రవీణ్‌ను పోలీసులు ఏ1గా చేర్చారు. లాల్ దర్వాజ బోనాల్లో టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడ్డ ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది వద్ద లైవ్ రౌండ్స్, మూడు తుపాకులు స్వాధీనం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో చికోటి సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు అయ్యింది. చీటింగ్ సహా ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. సాయుధ వ్యక్తిగత గార్డులుగా కొనసాగేందుకు అధికారం లేదు. లైసెన్స్ లేకుండా అక్రమంగా చికోటీ ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ముగ్గురు నిందితులు సిఆర్ఫీఎఫ్ నుండి రిటైర్ అయ్యి.. ఎలాంటి లైసెన్స్ లేకుండానే సెక్యూరిటీ ఉద్యోగం చేసుకుంటున్నారని తెలిపారు. తమకు వచ్చే జీతం సరిపోకపోవడంతో చికోటిని ఆశ్రయించిన ముగ్గురు ప్రైవేట్ గన్ మెన్‌గా ఉంటామని ఆయన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. పర్సనల్ సెక్యూరిటీ కోసం చికోటి దగ్గరికి వెళ్లిన ఈ ముగ్గురు తాము వెపన్స్ ఉపయోగించకూడదు అని చికోటికి చెప్పినా అతను పట్టించుకోలదని చెప్పారు. అదంతా తాను చూసుకుంటానని.. ఎక్కడ లైసెన్స్ క్యారీ చేయద్దు అని చికోటి వారికి చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిసిందని వెల్లడించారు. అయితే, ప్రవీణ్ ప్రస్తుతం గోవాలో తలదాచుకున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతి త్వరలోనే చీకోటి ప్రవీణ్‌ను ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: పొలిటికల్ అలర్ట్.. తెలంగాణలో చక్రం తిప్పిన కాంగ్రెస్! -
లాల్ దర్వాజ అమ్మవారికి బంగారు బోనమెత్తిన బేబీ హీరోయిన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో లాల్ దర్వాజ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్య ప్రజానీకంతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తాజాగా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బేబీ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా సినిమా సక్సెస్ తర్వాత తొలి బోనం మహంకాళి అమ్మవారికి తీసుకుని వస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. బేబీ రిలీజవడానికి ముందు సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి బోనమెత్తాను. దర్శనం కూడా బాగా జరిగింది' అని చెప్పుకొచ్చింది. గతానికి, ఇప్పటికి తేడా ఏంటన్న ప్రశ్నకు.. ఎప్పుడూ లైన్లో వస్తుండె.. ఇప్పుడు జర స్పెషల్ ఎంట్రీతో వచ్చిన అని చెప్పుకొచ్చింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వైష్ణవి చైతన్య టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయింది. అలాగే పలు షార్ట్ ఫిలింస్ ద్వారా కూడా పేరు తెచ్చుకుంది. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు చేసే వైష్ణవి బేబీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. యూట్యూబర్ హీరోయినేంటి? అన్న చాలామంది ప్రశ్నలకు తన నటనతో నోరు మూయించింది. ఇక బేబీ సినిమాను సాయి రాజేశ్ డైరెక్ట్ చేయగా ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత ఎస్కేఎన్ నిర్మించాడు. జూలై 14న విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ.14 కోట్ల పై చిలుకు వసూళ్లు రాబట్టడం విశేషం. చదవండి: బుల్లితెర నటి బోల్డ్ పిక్స్.. నెటిజన్స్ దారుణ కామెంట్స్ -
లాల్‌దర్వాజ బోనాలు: ఆలయం వద్ద చికోటీ ప్రవీణ్ ఓవరాక్షన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లాల్‌దర్వాజలో బోనాల సందడి నెలకొంది. ఆలయాల దగ్గర బోనాలతో మహిళలు బారులుతీరారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని కొలిచేందుకు భక్తి శ్రద్ధలతో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. కాగా, లాల్ దర్వాజ అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్ ప్రదర్శించారు. చికోటి ప్రవీణ్ లాల్ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటతో వెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారు. ఇక, ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ వద్ద వెపన్స్ ఉండటంతో పోలీసులు కంగుతిన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టారీత్యా నేరమని తెలిపారు. అనంతరం.. ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, వెపన్స్‌కు లైసెన్స్ లేకపోతే కేసులు నమోదు చేయనున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో లాల్‌దర్వాజ బోనాల సందడి.. పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని -
లాల్ దర్వాజా బోనాలు..
-
ఘనంగా లాల్ దర్వాజ బోనాలు
హైదరాబాద్: చారిత్రక పాతనగరంలో లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా సాగుతోంది. ఉదయం నుంచే మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు, నైవేద్యం సమర్పించేందుకు బారులు తీరారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ తదితరులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఉదయం నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. మరోవైపు పాతబస్తీ అంతటా బోనాల జాతర సందడి నెలకొంది. అమ్మవారి జానపద గీతాలు, బోనాల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆషాఢమాసం బోనాల ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని మహిమాన్వితమైన శక్తిప్రదానియిగా భక్తులు కొలుస్తారు. నిజాం నవాబుల కాలం నుంచి లాల్ దర్వాజ్ సింహవాహిని అమ్మవారు పూజలందుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మూడు వందల సీసీ కెమరాలు ఏర్పాట్లను చేశామని, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు.