నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు: సీఎం | Do not misunderstand that I support increasing number of Casinos: Goa CM | Sakshi
Sakshi News home page

నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు: సీఎం

Published Mon, Jul 11 2016 12:52 PM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు: సీఎం

నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు: సీఎం

పణజి: గోవా ఆర్థిక వ్యవస్థ కేసినో(పేకాట క్లబ్బులు)లపై ఆధారపడి ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ చెప్పారు. వాటిని మూసివేయడం లేదా సంఖ్యను పెంచడం చేయబోమని అన్నారు. ఆఫ్‌షోర్ (తీరానికి దూరంగా నీటి మధ్యలో ఏర్పాటు చేసేవి) కేసినోలను తరలించమని పర్సేకర్ చెప్పారు. గోవాలో ఎంతోమంది స్థానికులు కేసినోల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని పొందుతున్నారన్నారు. అయితే తాను కేసినోల సంఖ్య పెంచడానికి మద్దతు పలుకుతున్నానని తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు.

పక్షుల సంరక్షణ కేంద్రానికి దగ్గరగా ఉన్న కేసీనోను తరలించాలని ఆదేశించినట్టు అటవీశాఖ మంత్రి రాజేంద్ర ఆర్లెకర్ వెల్లడించిన నేపథ్యంలో పర్సేకర్ ఈవిధంగా స్పందించారు. గోవాలో ఐదు ఆఫ్‌షోర్, మిగతావి మామూలు కేసినోలున్నాయి. కేసినోల వల్ల వ్యభిచారం, నేరాలు పెరుగుతున్నాయని ఆందోళనలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement