laxmikant parsekar
-
బీజేపీకి తప్పని తిరుగుబాట్ల తలనొప్పి
పణజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ నాలుగు స్థానాల్లో అసమ్మతిని ఎదుర్కొంటోంది. పనాజీ, మాండ్రేమ్, సంగూమ్, కుంభర్జువా స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు కమలం పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇటీవల బీజేపీని వీడిన ఉత్పల్ పారికర్ ప్రతిష్టాత్మక పణజి స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2019లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న అటానాసియో మోన్సెరట్టెపై ఆయన పోటీ చేస్తున్నారు. మాండ్రెమ్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ బీజేపీకి తిరుగుబాటు తప్పలేదు. మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వరకు బీజేపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇటీవలే కమలం గూటికి నుంచి బయటకు వచ్చారు. 2017లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను ఓడించిన దయానంద్ సోప్టేపై ఆయన బరిలోకి దిగుతున్నారు. 2019లో దయానంద్ అధికార బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. (చదవండి: ప్రధాన పార్టీలకు.. వలసల దెబ్బ) సంగెం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవేలార్ భార్య సావిత్రి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆమె.. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుభాష్ ఫాల్దేశాయ్‌పై పోటీకి రెడీ అయ్యారు. సంగెం స్థానానికి ప్రస్తుత సభలో స్వతంత్ర శాసనసభ్యుడు ప్రసాద్ గాంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి నిలబడ్డారు. కుంభార్జువా నియోజకర్గంలోనూ కాషాయ పార్టీకి తిరుగుబాటు తప్పలేదు. రోహన్ హర్మల్కర్ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పాండురంగ్ మద్కైకర్ భార్య జైనితా మద్కైకర్పై ఆయన పోటీ చేస్తున్నారు. అయితే పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కుమారుడు సిద్ధేష్ నాయక్‌ను బీజేపీ శాంతింపజేయడంతో కొంతలో కొంత ఊరట. కాగా, గోవా అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో ఫిబ్రవరి 14న జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. (చదవండి: పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి) -
బీజేపీకి మరో ఎదురుదెబ్బ.. మాజీ సీఎం కూడా..
పణజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ శుక్రవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మీకాంత్ పర్సేకర్ కూడా రాజీనామా అస్త్రాన్ని సంధించారు. బీజేపీకీ రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇక బీజేపీలో కొనసాగాలని కోరుకోవడం లేదని, రాజీనామా చేయాలనుకుంటున్నట్టు పీటీఐతో చెప్పారు. భవిష్యత్ కార్యాచరణ తర్వాత ప్రకటిస్తానని తెలిపారు. పర్సేకర్ ప్రస్తుతం గోవా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. పార్టీ కోర్ కమిటీ సభ్యుడి కూడా ఆయన కొనసాగుతున్నారు. 2002 నుంచి 2017 వరకు మాండ్రేమ్ అసెంబ్లీ నియోజకవర్గానికి పర్సేకర్ ప్రాతినిధ్యం వహించారు. తాజా ఎన్నికల్లో ఈ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే దయానంద్ సోప్టేకు కట్టబెట్టింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన పర్సేకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే 2019లో మరో 9 మంది నాయకులతో కలిసి దయానంద్ అధికార బీజేపీలో చేరారు. (చదవండి: బీజేపీ గెలవాలని కోరుకుంటున్న ములాయం!) పర్సేకర్.. 2014 నంచి 2017 వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను రక్షణ మంత్రిగా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పర్సేకర్‌ను సీఎంగా నియమించారు. కాగా, ఫిబ్రవరి 14న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికలకు 34 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. (చదవండి: ఇక బీజేపీకి గుడ్ బై: మాజీ సీఎం తనయుడు) -
సోషల్ మీడియాలో సీఎంకు చేదు అనుభవం!
పనాజి: సోషల్ మీడియాలో సామాన్య వ్యక్తులే కాదు ప్రజా ప్రతినిధులు, పెద్ద హోదాల్లో ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ సీఎంకు ఎదురైంది. గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ నిన్న (గురువారం) ఫేస్ బుక్ లో చేసిన పోస్టుపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆయనపై కామెంట్ల పర్వం కొనసాగగా, చివరకు సీఎం ఆ పోస్టును ఎడిట్ చేయాల్సి వచ్చింది. గోవా అసెంబ్లీకి ఈ నెల 4న ఎన్నికలు జరిగాయి కదా.. అయితే ఎన్నికలు ముగియడంతో ఎంతో ప్రశాంతంగా ఉన్నానంటూ స్విమ్మింగ్ పూల్ లో సేదతీరుతున్న విషయాన్ని తెలియజేసేలా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. 'ఎన్నికల తర్వాత రిలాక్స్ అవుతున్నాను. ఎవరో గెస్ చేయండి. ఎక్కడో చెప్పుకోండి' అని పోస్ట్ చేస్తూ ఓ ఫొటో కూడా అప్ లోడ్ చేశారు. నెటిజన్లు కొందరు సీఎం పోస్ట్ పై స్పందిస్తూ.. 'త్వరలో శాశ్వతంగా రిలాక్స్ అవుతారులే (పదవి పోతుంది)' అని కామెంట్ చేశారు. దీంతో సీఎం పర్సేకర్ తన ఎఫ్బీ పోస్ట్ ను 'కమ్యూనింగ్ విత్ నేటర్. ఏ రిఫ్రెషింగ్ ఎక్స్ పీరియన్స్. గెస్ హూ. గెస్ వేర్ (ప్రకృతితో కమ్యూనికెట్ అవుతున్నాను. రిఫ్రెష్ అవుతున్నాను. ఎవరో చెప్పుకోండి.. ఎక్కడో చెప్పుకోండి)' అని మార్పు చేశారు. -
'కేజ్రీవాల్‌ను పట్టించుకోను.. అతనంతే'
పనాజీ: త్వరలో ఎన్నికల నేపథ్యంలో గోవాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. విపక్షాల ఆరోపణలకు అధికార పక్షం వ్యూహాత్మకంగా సమాధానాలు ఇవ్వడం మొదలుపెట్టింది. డబ్బులు ఇచ్చి ఓట్లర్లను మభ్యపెడుతున్నారన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాటలను తాను అస్సలు పట్టించుకోనని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. కేజ్రీవాల్ ఎక్కడ సభలకు వెళ్లినా సంచలనం కోసం ప్రయత్నిస్తాడే తప్ప అందులో వాస్తవాలు ఉండవని, అందుకే తాను ఆయన మాటలను పట్టించుకోనని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఓటర్లను మభ్యపేట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సంచలనాలు సృష్టిద్దామన్న మోజులో కేజ్రీవాల్ ఇతర పార్టీలపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు పంచుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. డబ్బులు ఇచ్చేందుకు ఏ పార్టీ వచ్చినా వారి దగ్గర నుంచి తీసుకోవాలని ఓట్లు మాత్రం ఆమ్ ఆద్మీపార్టీకి వేయాలని ఢీల్లీ సీఎం ఓటర్లకు సూచించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై పై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మరోపక్క, కేజ్రీవాల్ తన మాటలను వెనక్కు తీసుకోని క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆప్ తరపున గోవాలో ఎల్విస్ గోమ్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆయన గత ఏడాది జూలైలో గోవా సివిల్ సర్వీస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఫిబ్రవరి 4న గోవాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
ఇద్దరు మంత్రులపై వేటు వేసిన సీఎం
గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ తన మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులపై వేటు వేశారు. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ఇద్దరినీ తన ప్రభుత్వం నుంచి పీకేశారు. గోవాలో బీజేపీ-ఎంజీపీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, రెండు పార్టీల మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో బాగా చెడిపోవడంతో.. వచ్చే సంవత్సరం రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే విషయం అనుమానంగానే ఉంది. మంత్రులను తొలగిస్తున్న విషయాన్ని గోవా గవర్నర్ మృదులా సిన్హాకు సోమవారం అర్ధరాత్రి సమయంలో పర్సేకర్ తెలిపారు. సుదిన్ ధావలికర్ దీపక్ ధావలికర్ అనే ఇద్దరినీ పదవుల నుంచి ఆయన తీసేశారు. దాంతో గోవా మంత్రివర్గంలో మొత్తం మంత్రుల సంఖ్య పదికి తగ్గింది. రాజ్యాంగంలోని 164 (1) అధికరణం కింద వాళ్లిద్దరినీ తొలగించాలని సూచించినట్లు పర్సేకర్ చెప్పారు. వాళ్లిద్దరి వద్ద ఉన్న అన్ని శాఖలను వేరే మంత్రులకు కేటాయించేవరకు ప్రస్తుతానికి తనవద్దే ఉంటాయని తెలిపారు. ఎంజీపీ తరఫున కేబినెట్లో ఇద్దరు మంత్రులే ఉండేవారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో 21 స్థానాలు బీజేపీకి రాగా, ఎంజీపీ మూడుచోట్ల గెలిచింది. ఎన్నికలకు ముందే రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు ఇద్దరు మంత్రులను తొలగించినా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండబోదు. సుదిన్ ధావలికర్ వద్ద రవాణా, ప్రజాపనుల శాఖ ఉండగా, డీపక్ వద్ద గ్రామీణాభివృద్ధి శాఖ ఉండేది. మంత్రులను తొలగించే అధికారం తనకు రాజ్యాంగబద్ధంగా ఉందని, వాళ్లు తనమీద విమర్శలు చేస్తున్నందువల్లే తప్పించానని సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ స్పష్టం చేశారు. ఈ ఖాళీల్లోకి ఎవరిని తీసుకోవాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. అయితే, తమను తప్పించిన విషయం ఇంకా తమవరకు రాలేదని ఎంజీపీ మంత్రులు ఇద్దరూ చెప్పారు. -
ఫ్రీ టాక్ టైమ్ స్కీమ్ ప్రవేశపెట్టిన గోవా
పనాజీ(గోవా): అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో యువతను ఆకర్షించడానికి గోవాలోని బీజేపీ సంకీర్ణ సర్కారు దేశంలోనే ప్రథమంగా ఫ్రీ టాక్ టైమ్, ఫ్రీ డేటా స్కీమ్‌ను ప్రకటించింది. 'గోవా యువ ఇనిషియేటివ్ స్కీమ్' పేరుతో 100 నిమిషాల టాక్ టైమ్, 1జీబీ డేటా(2ఎంబీపీఎస్ స్పీడు) ఉచితంగా అందిస్తారు. 1.25లక్షలు మంది యువత ఈ పథకం కింద లబ్ధిపొందనున్నారని గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ తెలిపారు. ప్రతి నెల ప్రభుత్వానికి కోటి రూపాయల వరకు భారం పడనుందన్నారు. 16 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువత ఈ స్కీమ్‌కు అర్హులని పరీకర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను అనుసంధానం చేయడంతో పాటూ, స్కిల్స్ డెవలప్ మెంట్ కోసం ఈ పథకం ఉపయోగపడనుందని తెలిపారు. దీనికి వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మొబైల్ సేవల పథకాన్ని అమలు చేయడానికి రిలయన్స్ జియో, ఐడియాతో పోటీ పడి వోడాఫోన్ ఈ బిడ్‌ను దక్కించుకుంది. గోవా వ్యాప్తంగా 500కు పైగా రిటైల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేసి మరో 15 రోజుల్లో వోడాఫోన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనుందని పరీకర్ తెలిపారు. -
'తీవ్రవాదాన్ని క్లీన్ చేస్తున్న పరీకర్'
పంజీ: తీవ్రవాదాన్ని క్లీన్ చేసే పనిలో కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పరీకర్ నిమగ్నమయ్యారని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. ఆదివారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పర్సేకర్ నివాళులు ఆర్పించారు. పర్సేకర్ మట్లాడుతూ క్లీన్ గోవా మిషన్‌ను ప్రస్తావించారు. 'మన మట్టిలో జన్మించిన బిడ్డను టెర్రరిజాన్ని క్లీన్ చేయడానికి మనం పంపించాము. ఆయన తన కర్తవ్యాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు' అని పర్సేకర్ అన్నారు. 'గాంధీజీ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమం గాంధీజీ సందేశానికి వాస్తవ రూపం ఇచ్చేలా ఉంది' అని పర్సేకర్ అన్నారు. -
నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు: సీఎం
పణజి: గోవా ఆర్థిక వ్యవస్థ కేసినో(పేకాట క్లబ్బులు)లపై ఆధారపడి ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ చెప్పారు. వాటిని మూసివేయడం లేదా సంఖ్యను పెంచడం చేయబోమని అన్నారు. ఆఫ్‌షోర్ (తీరానికి దూరంగా నీటి మధ్యలో ఏర్పాటు చేసేవి) కేసినోలను తరలించమని పర్సేకర్ చెప్పారు. గోవాలో ఎంతోమంది స్థానికులు కేసినోల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని పొందుతున్నారన్నారు. అయితే తాను కేసినోల సంఖ్య పెంచడానికి మద్దతు పలుకుతున్నానని తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. పక్షుల సంరక్షణ కేంద్రానికి దగ్గరగా ఉన్న కేసీనోను తరలించాలని ఆదేశించినట్టు అటవీశాఖ మంత్రి రాజేంద్ర ఆర్లెకర్ వెల్లడించిన నేపథ్యంలో పర్సేకర్ ఈవిధంగా స్పందించారు. గోవాలో ఐదు ఆఫ్‌షోర్, మిగతావి మామూలు కేసినోలున్నాయి. కేసినోల వల్ల వ్యభిచారం, నేరాలు పెరుగుతున్నాయని ఆందోళనలు జరుగుతున్నాయి. -
'రేపిస్టు' మంత్రిపై కామెంట్లు చేయను!
పనాజీ: గోవాలో ఓ మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి గురించి తాను కామెంట్లు చేయనని ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. రాష్ట్ర మాజీమంత్రి అటానాసియో మోన్సిరేట్ ఈ కేసులో నిందితుడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉందని అందుకే కేసు గురించిగానీ, విచారణపై కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని చెప్పారు. క్రైం బ్రాంచ్ బాగా పనిచేస్తుందని మాత్రమే తాను చెప్పగలనన్నారు. రూ.50 లక్షలకు 16 ఏళ్ల మైనర్ బాలికను కొనుక్కుని ఆ బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలున్నాయి. మోన్సిరేట్, బాలిక తల్లితో సహా మరో మహిళను ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు. బుధవారం ఆయన రిమాండ్ గడువు ముగియనున్న నేపథ్యంలో పోలీసు కస్టడీలో ఉన్న నేతను కోర్టులో హాజరు పరచనున్నారు. తనను రాజకీయంగా బలహీన పరచడానికే ప్రత్యర్థులు ఈ చర్యలకు దిగుతున్నారంటూ అటానాసియో మోన్సిరేట్ ఆరోపిస్తున్నారు. గతేడాది కాంగ్రెస్ పార్టీ ఆయనను బహష్కిరించింది. ఈ ఏడాది మార్చిలో సెయింట్ క్రూజ్ కు చెందిన మాజీ మంత్రి అటానాసియో మోన్సిరేట్ ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు గోవా ఎస్పీ ఎస్పీ కార్తిక్ కష్యప్ గతంలోనే తెలిపారు. -
గోవా కొత్త సీఎంగా పార్సేకర్ ప్రమాణం
పణజి: గోవా నూతన ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ఎస్ మూలాలున్న లక్ష్మీకాంత్ పార్సేకర్ (58) శనివారం ప్రమాణస్వీకారం చేశారు. పణజిలోని రాజ్‌భవన్‌లో సాయంత్రం 4 గంటలకు జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ మృదులా సిన్హా ప్రమాణం చేయించారు. అలాగే గత మనోహర్ పారికర్ ప్రభుత్వంలోని తొమ్మిది మంది మంత్రులు కూడా తిరిగి మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి ఫ్రాన్సిస్ డిసౌజా, దయానంద్ మంద్రేకర్, రమేశ్ తవాడ్కర్, మహదేవ్ నాయక్, దిలీప్ పరులేకర్, మిలింద్ నాయక్, అలినా సాల్దన్హాలు మంత్రులుగా ప్రమాణం చేయగా ఆ పార్టీ మిత్రపక్షమైన మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ) నుంచి రామకృష్ణ అలియాస్ సుదిన్ ధావలికర్, దీపక్ ధావలికర్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎం పార్సేకర్ మాంద్రెమ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు సీఎం పదవికి మనోహర్ పారికర్ రాజీనామా చేశారు. ఆపై బీజేపీ శాసనసభాపక్షం భేటీలో పార్సేకర్ పేరును ప్రతిపాదించగా దాన్ని ఫ్రాన్సిస్ డిసౌజా బలపరిచారు. ఇందుకు 21 మంది ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలపడంతో బీజేపీఎల్పీ నేతగా పార్సేకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
గోవా సీఎంగా పర్సేకర్ ప్రమాణం
-
4 గంటలకు గోవా కొత్త సీఎం పేరు ప్రకటన
-
4 గంటలకు గోవా కొత్త సీఎం పేరు ప్రకటన
న్యూఢిల్లీ: గోవా నూతన ముఖ్యమంత్రి ఎంపికపై సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో ముగిసింది. గోవా సీఎంగా లక్ష్మీకాంత్ పర్సేకర్ పేరును ఖరారు చేయాలని పార్లమెంటరీ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. అయితే గోవా సీఎం రేసులో రాజేంద్ర అర్లేకర్, ప్రాన్సిస్ డీసౌజాలు కూడా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గోవా సీఎం పేరును బోర్డు ప్రకటించనుంది. పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలోని సభ్యులు అధిక శాతం మంది లక్ష్మీకాంత్ వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. ప్రస్తుత గోవా సీఎం మనోహర్ పారెకర్ ఆదివారం కేంద్ర పదవి చేపట్టనున్నారు. ఆ క్రమంలో ఆయన ఈరోజ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో గోవా కొత్త సీఎం ఎంపిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ బోర్డుకు శనివారం సమాశమైంది. కానీ ఈ బోర్డు మీటింగ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు కానీ హాజరుకాలేదు.