
4 గంటలకు గోవా కొత్త సీఎం పేరు ప్రకటన
న్యూఢిల్లీ: గోవా నూతన ముఖ్యమంత్రి ఎంపికపై సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో ముగిసింది. గోవా సీఎంగా లక్ష్మీకాంత్ పర్సేకర్ పేరును ఖరారు చేయాలని పార్లమెంటరీ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. అయితే గోవా సీఎం రేసులో రాజేంద్ర అర్లేకర్, ప్రాన్సిస్ డీసౌజాలు కూడా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గోవా సీఎం పేరును బోర్డు ప్రకటించనుంది. పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలోని సభ్యులు అధిక శాతం మంది లక్ష్మీకాంత్ వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది.
ప్రస్తుత గోవా సీఎం మనోహర్ పారెకర్ ఆదివారం కేంద్ర పదవి చేపట్టనున్నారు. ఆ క్రమంలో ఆయన ఈరోజ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో గోవా కొత్త సీఎం ఎంపిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ బోర్డుకు శనివారం సమాశమైంది. కానీ ఈ బోర్డు మీటింగ్కు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు కానీ హాజరుకాలేదు.