
'తీవ్రవాదాన్ని క్లీన్ చేస్తున్న పరీకర్'
తీవ్రవాదాన్ని క్లీన్ చేసే పనిలో కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పరీకర్ నిమగ్నమయ్యారని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు.
పంజీ:
తీవ్రవాదాన్ని క్లీన్ చేసే పనిలో కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పరీకర్ నిమగ్నమయ్యారని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. ఆదివారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పర్సేకర్ నివాళులు ఆర్పించారు. పర్సేకర్ మట్లాడుతూ క్లీన్ గోవా మిషన్ను ప్రస్తావించారు. 'మన మట్టిలో జన్మించిన బిడ్డను టెర్రరిజాన్ని క్లీన్ చేయడానికి మనం పంపించాము. ఆయన తన కర్తవ్యాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు' అని పర్సేకర్ అన్నారు.
'గాంధీజీ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమం గాంధీజీ సందేశానికి వాస్తవ రూపం ఇచ్చేలా ఉంది' అని పర్సేకర్ అన్నారు.