పనాజీ: గోవాలో ఓ మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి గురించి తాను కామెంట్లు చేయనని ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. రాష్ట్ర మాజీమంత్రి అటానాసియో మోన్సిరేట్ ఈ కేసులో నిందితుడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉందని అందుకే కేసు గురించిగానీ, విచారణపై కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని చెప్పారు. క్రైం బ్రాంచ్ బాగా పనిచేస్తుందని మాత్రమే తాను చెప్పగలనన్నారు. రూ.50 లక్షలకు 16 ఏళ్ల మైనర్ బాలికను కొనుక్కుని ఆ బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలున్నాయి. మోన్సిరేట్, బాలిక తల్లితో సహా మరో మహిళను ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు.
బుధవారం ఆయన రిమాండ్ గడువు ముగియనున్న నేపథ్యంలో పోలీసు కస్టడీలో ఉన్న నేతను కోర్టులో హాజరు పరచనున్నారు. తనను రాజకీయంగా బలహీన పరచడానికే ప్రత్యర్థులు ఈ చర్యలకు దిగుతున్నారంటూ అటానాసియో మోన్సిరేట్ ఆరోపిస్తున్నారు. గతేడాది కాంగ్రెస్ పార్టీ ఆయనను బహష్కిరించింది. ఈ ఏడాది మార్చిలో సెయింట్ క్రూజ్ కు చెందిన మాజీ మంత్రి అటానాసియో మోన్సిరేట్ ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు గోవా ఎస్పీ ఎస్పీ కార్తిక్ కష్యప్ గతంలోనే తెలిపారు.
'రేపిస్టు' మంత్రిపై కామెంట్లు చేయను!
Published Tue, May 10 2016 6:11 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
Advertisement
Advertisement