ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్‌పాట్‌ : గుండె ఆగినంత పనైందట! | Man Wins 4 USD Million At Singapore Casino Allegedly Suffers Cardiac Arrest, Says Report | Sakshi
Sakshi News home page

ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్‌పాట్‌ : గుండె ఆగినంత పనైందట!

Published Wed, Jun 26 2024 1:39 PM | Last Updated on Wed, Jun 26 2024 3:12 PM

Man Wins 4 USD Million at Singapore Casino Allegedly Suffers Cardiac Arrest Report

సింగపూర్‌లో జరిగిన ఒక సంఘటన పుట్టెడు దుఃఖాన్నయినా తట్టుకునే గుండె పట్టరాని ఆనందాన్ని భరించ లేదా? అనే ప్రశ్నను లేవనెత్తింది. ఎపుడూ నష్టాలను మూటగట్టుకునే వ్యక్తికి ఊహించని అదృష్టం వరించడంతో ఉక్కిరిబిక్కిరయ్యి గుండె ఆగిపోయినంత పనైన ఘటన తాజాగా వెలుగు చూసింది.

వివరాలను పరిశీలిస్తే.. సింగపూర్‌లోని మారినా బే సాండ్స్‌ క్యాసినోలో ఒక వ్యక్తి జాక్‌పాట్‌ కొట్టాడు. లాస్ వెగాస్‌కు చెందిన  గేమింగ్  అండ్‌  రిసార్ట్ కంపెనీ నిర్వహిస్తున్న ఐకానిక్ క్యాసినోలో ఏకంగా 33 కోట్ల రూపాయలు (4 బిలియన్‌ డాలర్లు) గెలుచుకున్నాడు. అయితే ఎపుడూ నష్టపోయే అతడు ముందుగా ఆ విషయాన్ని నమ్మలేదు. కలో మాయో తెలియని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆ ఆనదంలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయాడు. ఆ ఆనందంలోనే గుండెపోటుతో కుప్పకూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆ షాక్‌తోనే అతను చనిపోయినట్టు ఎక్స్‌లో పేర్కొన్నారు.

అయితే శివుడు ఆజ్ఞలేనిదే చీమ అయినా కుట్టదన్నట్టు ఆ వ్యక్తి సజీవంగానే ఉన్నాడని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. క్యాసినో నిర్వాహకులు అతనికి తక్షణ వైద్య సహాయం అందించారని, దీంతో అతను కోలుకుంటున్నాడని కాసినో. ఆర్గ్‌  తెలిపినట్టుగా  కమెంట్‌ సెక్షన్‌లో చూడవచ్చు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement