సాక్షి, అమరావతి: కాసినోలు, అశ్లీల నృత్యాల గురించి చంద్రబాబు, లోకేష్‌లకు బాగా తెలుసని రాష్ట్ర మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గతంలో లోకేష్ స్విమ్మింగ్ పూల్‌లో మహిళలతో అర్ధ నగ్నంగా, చేతిలో మద్యం గ్లాసు పెట్టుకుని చేసిన వేషాలను అందరూ చూశారన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తన కల్యాణ మండపంలో కాసినో, జూదం నిర్వహించినట్టు రుజువు చేస్తే రాజీనామాతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే చంద్రబాబు, లోకేష్, ఆయన కుల మీడియా ఏం చేస్తారో చెప్పే దమ్ముందా అని నిలదీశారు. ప్రశాంతంగా ఉండే గుడివాడలో చంద్రబాబు చిచ్చు రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది, చేస్తోంది కూడా చంద్రబాబే అని మండిపడ్డారు. ఇప్పటికీ మహిళలను అడ్డు పెట్టుకుని బతుకుతున్న చరిత్ర చంద్రబాబుదేనన్నారు. గతంలో లక్ష్మీపార్వతిని సాకుగా చూపించి ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్కున్నారన్నారు. మరో మహిళను అడ్డుపెట్టుకుని బ్రోకర్ పని చేసి సైకిల్ గుర్తు తెచ్చుకున్నారని చెప్పారు. చివరికి కట్టుకున్న భార్యను కూడా రాజకీయాల కోసం రోడ్డుపైకి తెచ్చారన్నారు. రాజకీయాలకు చంద్రబాబు అనర్హుడని వ్యాఖ్యానించారు.
రెండు వారాలుగా గుడివాడలో లేను
తాను గత రెండు వారాలుగా గుడివాడలో లేనని, కోవిడ్‌తో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందిæ కేబినెట్ మీటింగ్ కోసం వచ్చినట్టు తెలిపారు. అటువంటిది చంద్రబాబు పెట్టే పెడిగ్రీ తింటూ.. ఆయన ఏం చెబితే.. అది చూపించే డబ్బా మీడియా, మొరిగే తొత్తులు గుడివాడలోని తన కల్యాణ మండపంలో ఏదో జరిగిపోతోందని, ఎక్కడో తీసుకొచ్చిన వీడియోలు చూపించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యూట్రల్ మీడియా గుడివాడ వెళ్లి వాస్తవాలేమిటో తెలుసుకుని ప్రజలకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా చంద్రబాబు ఎప్పుడో సమాధి అయ్యారని, ఇంకా సిగ్గూ, శరం లేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో ఎప్పుడూ ఎన్నికల్లో గెలవని వర్ల రామయ్య, విజయవాడలో ఆస్తులు ఆక్రమించి, మహిళల్ని వేధించిన బోండా ఉమ గుడివాడ వెళ్తారా అని ప్రశ్నించారు. సంక్రాంతికి సంప్రదాయంగా జరిగే కోడి పందేలే గుడివాడలో కూడా జరిగాయన్నారు. ఎక్కడో డ్యాన్సులు జరుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తే.. తానే స్వయంగా డీఎస్పీకి ఫోన్ చేసి ఆపించానని చెప్పారు. చంద్రబాబు కాదు కదా.. ఎవరొచ్చినా గుడివాడలో ప్రజల అండ ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
‘కాసినో’ వ్యవహారం నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. లేకుంటే మీరేం చేస్తారు?: మంత్రి కొడాలి నాని
Published Fri, Jan 21 2022 3:48 PM | Last Updated on Sat, Jan 22 2022 9:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment