
సాక్షి, కృష్ణా: గుడివాడ క్యాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'గుడివాడలో క్యాసినో నిర్వహించామని టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేశారు. మూడు రోజులు గుడివాడలో నిర్వహించిన క్యాసినోకు ఐదు వందల కోట్లు వస్తే, 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలి. గుడివాడలో నన్ను ఒడించలేకే లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు.
గుడివాడ ప్రజలు అమాయకులు కాదు, వారికి అన్ని విషయాలు తెలుసు. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని, టీడీపీ చీర్ బాయ్స్ పోలీసులకు ఫిర్యాదులు చెయ్యడం అవివేకం. గుడివాడలో క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్‌కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో?. గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే, 362రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇచ్చాను వారికి చేతనైంది చేసుకోవాలి' అని మంత్రి కొడాలి నాని అన్నారు.
చదవండి: (వారి తరపున సీఎం జగన్‌కు పాదాభివందనం: మంత్రి కొడాలి నాని)
Comments
Please login to add a commentAdd a comment