సాక్షి, హైదరాబాద్: క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ప్రవీణ్‌పై కేసులు నమోదుచేసి బుధవారం నగరంలోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.కోట్ల హవాలా ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది.
ఇదిలా ఉండగా.. బోయినపల్లికి చెందిన అతడి భాగస్వామి మాధవరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో మాధవరెడ్డి ఇంట్లో ఉన్న ఓ కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్ కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సదరు కారు స్టిక్కర్‌పై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ స్టిక్కర్‌ను తాను మూడు నెలల క్రితమే పడేసినట్టు స్పష్టం చేశారు. తానే పడేసిన స్టిక్కర్‌ను ఎవరో పెట్టుకుంటే నాకేంటి సంబంధం అని మంత్రి ప్రశ్నించారు.
మరోవైపు.. క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్, మాధవరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, హవాలా లావాదేవీలపై ఈడీ.. ప్రవీణ్‌ను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. సోదాల్లో ఈడీ.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను వీరు ప్రత్యేక విమానాల్లో తరలించి అక్కడ క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలు సేకరించింది.
ఇది కూడా చదవండి: క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే..
Comments
Please login to add a commentAdd a comment