madhava reddy
-
స్రవంతికి అండగా నిలిచిన ఎస్పీ మాధవరెడ్డి..
పుట్టపర్తి టౌన్: నల్లమాడకు చెందిన చిన్నారి స్రవంతికి ఎస్పీ మాధవరెడ్డి ఆర్థికంగా అండగా నిలిచారు. తల్లి మృత్యువాత పడటం, అనారోగ్యంతో తండ్రి మంచం పట్టడంతో కుటుంబ భారం మోస్తున్న స్రవంతి గురించి తెలుసుకున్న ఎస్పీ సోమవారం చిన్నారిని తన కార్యాలయానికి పిలిపించారు. ఈ సందర్భంగా దుస్తులు, నిత్యావసరాలతో పాటు రూ.30 వేల ఆర్థిక సాయం చేశారు. అలాగే చిన్నారి చదువుకు ఇబ్బంది లేకుండా గురుకుల పాఠశాలలో చేర్పిస్తామన్నారు. భవిష్యత్‌లోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. నల్లమాడకు చెందిన లక్ష్మీదేవి, సూర్యనారాయణ దంపతులు కూలి పనులు చేసుకుంటూ ఒక్కగానొక్క కూతురు స్రవంతిని అల్లారుముద్దుగా పెంచుకున్నారన్నారు. అయితే మూడేళ్ల క్రితం సూర్యనారాయణ చెట్టుమీద నుంచి పడి వెన్నుముక దెబ్బతినడంతో మంచానికే పరిమితం కాగా, భార్య లక్ష్మీదేవి కూలీ పనులు చేస్తూ భర్తను, కుమార్తెను పోషించేదన్నారు. అయితే ఆరు నెలల క్రితం లక్ష్మీదేవి అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబ భారం చిన్నారి స్రవంతిపై పడిందన్నారు. తండ్రిని చూసుకుంటూ ఇరుగుపొరుగు వారు ఇచ్చే సహాయంతో జీవనం కొనసాగిస్తోందన్నారు. చిన్నారి స్రవంతికి తమవంతు సాయం అందిస్తామన్నారు. మానవతావాదులూ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాతలు ఎవరైనా సాయం చేయాలనుకుంటే పుట్టగొలుసుల స్రవంతి, అకౌంట్ నంబర్ 91155144392, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నల్లమాడ (ఐఎఫ్ఎస్సీ కోడ్: ఏపీజీబీ 0001014)కు విరాళాలు పంపాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ వాసుదేవన్, సీఐలు రాజేంద్రనాథ్ యాదవ్, రాగిరి రామయ్య, బాలసుబ్రమణ్యం రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
చికోటి ప్రవీణ్ జూదం దందాలో విస్తుపోయే విషయాలు
-
ఈడీ రైడ్స్.. మాధవరెడ్డి కారుపై టీఆర్ఎస్ మంత్రి స్టిక్కర్
సాక్షి, హైదరాబాద్: క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ప్రవీణ్‌పై కేసులు నమోదుచేసి బుధవారం నగరంలోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.కోట్ల హవాలా ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ఇదిలా ఉండగా.. బోయినపల్లికి చెందిన అతడి భాగస్వామి మాధవరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో మాధవరెడ్డి ఇంట్లో ఉన్న ఓ కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్ కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సదరు కారు స్టిక్కర్‌పై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ స్టిక్కర్‌ను తాను మూడు నెలల క్రితమే పడేసినట్టు స్పష్టం చేశారు. తానే పడేసిన స్టిక్కర్‌ను ఎవరో పెట్టుకుంటే నాకేంటి సంబంధం అని మంత్రి ప్రశ్నించారు. మరోవైపు.. క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్, మాధవరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, హవాలా లావాదేవీలపై ఈడీ.. ప్రవీణ్‌ను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. సోదాల్లో ఈడీ.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను వీరు ప్రత్యేక విమానాల్లో తరలించి అక్కడ క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలు సేకరించింది. ఇది కూడా చదవండి: క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే.. -
క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే..
సాక్షి, హైదరాబాద్/సైదాబాద్: ఆయన చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఆయన ఏ కార్యక్రమం చేసినా ఫుల్ హడావుడి, సెలబ్రిటీలే దగ్గరుండి ఏర్పాట్లు చూస్తారు. అలా అనీ ఆయనేం పవర్ సెంటర్ కాదు.. పత్తాలాడించే ఓ సామాన్య వ్యక్తేగానీ.. గల్లీలో పేకాట ఆడించే వాడు కాదు. ఏకంగా ప్రత్యేక విమానాల్లో విదేశాలకు తీసుకెళ్లి కోట్లలో క్యాసినోలు ఆడించే ఖతర్నాక్ ఆర్గనైజర్. అతడే చీకోటి ప్రవీణ్. అలాంటివాడిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదుచేసి బుధవారం నగరంలోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.కోట్ల హవాలా ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. బోయినపల్లికి చెందిన అతడి భాగస్వామి మాధవరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ప్రవీణ్‌పై ఈడీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. అలాగే, మాధవరెడ్డి ఇంట్లో ఒక కారుపై మంత్రికి సంబంధించిన కారు స్టిక్కర్ అతికించి ఉంది. హవాలాతో అడ్డంగా దొరికి.. చీకోటి ప్రవీణ్ ఒకప్పుడు నగరంలో సాదాసీదా పేకాట క్లబ్బులు నడిపించిన వ్యక్తి. బేగంపేట, వనస్థలిపురం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ తది తర ప్రాంతాల్లో సెలబ్రిటీల కోసమే క్యాసినోలు ఏర్పాటుచేసి దందా సాగించేవాడు. 2014 తర్వాత అతడి సుడి మారిపోయిందని చెబుతారు. ఇద్దరు మంత్రులు, 16 మంది ఎమ్మెల్యేల సాన్నిహిత్యంతో చీకోటి వ్యవహారం విదేశాలకు విస్తరించింది. ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్‌కు తీసుకెళ్లి రూ.కోట్లలో పేకాట ఆడించడం వరకు వెళ్లాడు. ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. ఇండోనేషియా, నేపాల్, శ్రీలంకలో పేకాట ఆడించేందుకు హవాలా ద్వారా నగదు లావాదేవీలు చేసి ఈడీకి అడ్డంగా బుక్కయినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో భారత కరెన్సీని హవాలా రూపంలో అందించి.. నేపాల్, ఇండోనేషియాలో తనకు ఎంత కావాలో ఆమేరకు అక్కడి కరెన్సీని తీసుకునేవాడు. ఇలా గత జూన్ 10, 11, 12, 13 తేదీల్లో 8 ప్రత్యేక విమానాల్లో నేపాల్‌లోని హోటల్ మిచీక్రౌన్‌లో భారీ ఎత్తున క్యాసినో ఏర్పాటుచేసి చాలామంది ప్రముఖులను తరలించాడు. సమాచారం అందుకున్న ఈడీ అధికారులు హవాలా ద్వారా వెళ్లిన నగదుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించి రంగంలోకి దిగినట్టు తెలిసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రవీణ్ నివాసం, ఫాంహౌజ్తోపాటు మరో 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దీనికి సంబంధించి ఈడీ అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. సెలబ్రిటీల వీడియోలు బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు, హీరోయిన్లు సైతం చీకోటితో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఈడీ అధికారులను షాక్ తినేలా చేసినట్టు తెలుస్తోంది. గతంలో బేగంపేటలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన బర్త్‌డే ఫంక్షన్లో క్యాసినో ఏర్పాటుచేసిన అంశం పెద్ద దుమారమే రేపింది. ఆ పార్టీకి ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతోపాటు సీనియర్ ఐఏఎస్‌లు హాజరవడం సంచలనం రేపింది. ఆరు నెలల క్రితం చీకోటి పేకాట వ్యవహారాలపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. ఆయనకు సారీ చెప్పి మరీ... గత నెల 17న కర్మన్‌ఘాట్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో చీకోటి తన 46వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. ఫంక్షన్ హాలంతా సెలబ్రిటీలే. బర్త్‌డే సందర్భంగా తాను ఇష్టపడి బుక్ చేసుకున్న రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ కారును ప్రముఖ హీరో, ఓ రాజకీయ పార్టీ అధినేత కూడా ఇష్టపడ్డాడు. సేమ్ కలర్ కూడా కావడంతో ఆ హీరో ప్రవీణ్‌కు ఫోన్‌చేసి ఆ కారు కావాలని అడగ్గా, సారీ.. సర్.. తనకే కావాలని సున్నితంగా చెప్పి సొంతం చేసుకున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. కారు విలువ సుమారు రూ.3.5 కోట్లు. ►నగర శివార్లలోని కడ్తాల్‌లో ప్రవీణ్‌కు 20 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉందని సమాచారం. ఇక్కడే అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులకు హైఫై పార్టీలు ఇస్తుంటాడని తెలుస్తోంది. వీటిలో అత్యంత ఖరీదైన మద్యం ఏరులై పారుతుంది. అనేక మందిని ఆకర్షించడానికి టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోయిన్లతో గానా బజానాలూ ఏర్పాటు చేస్తుంటాడు. ఉత్తరాది టాప్ మోడల్స్ కూడా తళుక్కుమంటారని సమాచారం. జైల్లో పరిచయాలతో... ఓ రియల్టర్‌ను బెదిరించి రూ.30 లక్షలు గుంజిన కేసులో ప్రవీణ్ కొద్ది రోజులు జైల్లోఉన్నాడు. అప్పడు ఏర్పడిన పరిచయాలతోనే ప్రవీణ్ క్యాసినో నిర్వాహకుడిగా మారాడని అంటుంటారు. తొలినాళ్లల్లో క్రికెట్ బుకీగా వ్యవహరించాడు. రాష్ట్రంలో క్లబ్స్ నిషేధించడంతో గోవాకు చెందిన ప్రముఖ గో డాడీ క్యాసినోలో పార్ట్నర్గా మారాడని, ఆపై చెన్నై శివార్లలో సొంతంగా ఓ క్యాసినో పెట్టాడని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్లో వివిధ ప్రాంతాల్లో జరిగే కోళ్ల పందాలు, పేకాట శిబిరాలూ ఇతడి నేతృత్వంలోనివే అని పోలీసులు చెప్తున్నారు. కుడి భుజంగా మాధవరెడ్డి బోయిన్‌పల్లికి చెందిన మాధవరెడ్డి.. ప్రవీణ్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు ఓ మంత్రితో దగ్గర బంధుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రవీణ్ నిర్వహించే క్యాసినోలు, గ్యాంబ్లింగ్‌లకు ప్రముఖులను తీసుకొచ్చే బాధ్యతల్ని తీసుకునేవాడు. బోయిన్‌పల్లికే చెందిన ఓ వ్యక్తి ఇటీవల నేపాల్‌లోని వీరి క్యాసినోకు వెళ్లారు. ముందుగానే రూ.10 లక్షలు చెల్లించారు. అయితే అక్కడ అదనపు ఖర్చులకంటూ మాధవరెడ్డి ఆయనకు డబ్బులు ఇచ్చాడు. తిరిగి వచ్చాక ఆ డబ్బు ఇవ్వాలని బెదిరించి ఆ వ్యక్తికి సంబంధించిన స్థలాన్ని తమ వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది పేకాటరాయుళ్ల భూములను వీరిద్దరూ ఇదే పంథాలో బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సందర్భాలు అనేకం. కొంపల్లిలో ఓ ఫంక్షన్ హాల్ ఇప్పటికీ పేకాటరాయుళ్లకు అడ్డాగా ఉంది. ప్రవీణ్, మాధవరెడ్డి దాన్ని లీజ్‌కు తీసుకున్నారు. అక్కడ ప్రతి నెలా రెండు రోజులపాటు పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. ఇటువైపు పోలీసులు కన్నెత్తి చూడరన్న ఆరోపణలున్నాయి. బంగారం వ్యాపారంలోనూ... చీకోటి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు క్యాసినో ద్వారా జరిగిన హవాలా లావాదేవీలు మాత్రమే కాకుండా బంగారం దందా వ్యవహారంలోనూ సంబంధాలున్నట్టు గుర్తించినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన ప్రముఖ బంగారు వ్యాపారికి హవాలా ద్వారా డబ్బు ఏర్పాట్లు చేసి తాను బంగారం బ్లాక్‌మార్కెట్ ద్వారా తీసుకున్నట్లు ఈడీ గుర్తించినట్టు సమాచారం. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ఈడీ అధికారి ఒకరు చెప్పారు. ఫామ్‌హౌస్‌లో ప్రైవేట్ జూ చీకోటి కుటుంబం ప్రస్తుతం ఐఎస్ సదన్ డివిజన్ వినయ్‌నగర్ కాలనీలోని సాయి కిరణ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. ప్రవీణ్ కడ్తాల్‌లోని ఫామ్‌హౌస్‌లో ఓ ప్రైవేట్ జూ ఏర్పాటు చేసుకున్నాడు. అందులో రూ.కోట్ల విలువైన వైట్హార్స్తోపాటు మాట్లాడే చిలుకలు, కొండచిలువలు, పశువులు.. ఇలా అనేక రకాల జంతువులు, పక్షులను పెంచుతున్నట్టు వీడియోల్లో కనిపిస్తోంది. సినిమాలపై ఎంతో ఆసక్తి ఉన్న ప్రవీణ్ 15 ఏళ్ల క్రితం ఒక తెలుగు సినిమాలో విలన్‌గానూ నటించాడు. 2007లో పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఓ చిత్ర నిర్మాణం కోసం ఒక హీరోకి కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు గుర్తించారు. ప్రవీణ్ తొలినాళ్లల్లో కాంగ్రెస్ నాయకుడిగా చురుగ్గా తిరిగి తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పాడు. ఆడంబర జీవితం గడిపే అతని వెంట అనునిత్యం ప్రైవేట్ సైన్యం ఉంటుంది. తన కుమారులకు రూ.కోట్ల విలువైన కార్లు బహుమతులుగా ఇచ్చాడు. ఒక్కో దేశానికి ఒక్కో రేటు చీకోటి ప్రవీణ్ ఒక్కో ఆటకు ఒక్కో రేటు ఫిక్స్ చేస్తాడు. ఒక్కో దేశానికి ఒక్కో రకమైన డిపాజిట్ తీసుకుంటాడు. హైదరాబాద్ నుంచి ప్రతీ శుక్ర, శని, ఆదివారాల్లోనే విదేశాలకు క్యాసినో ఆడేందుకు ఏర్పాట్లు చేస్తాడు. ఇలా తనకు 200 మంది రెగ్యులర్ కస్టమర్లుండగా వారికి అన్ని ఏర్పాట్లు తానే దగ్గరుండి చేసి పెడతాడు. ప్రయాణానికి ముందే కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకుంటాడు. ఇండోనేషియా, నేపాల్‌కు క్యాసినో ఆడేందుకు వెళ్లే వారు రూ.5 లక్షల నుంచి 50లక్షల వరకు డిపాజిట్ చేస్తారు. రూ.15లక్షల వరకు చెల్లించిన వారిని సాధారణ విమానాల్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో తీసుకెళ్తాడు. రూ.20లక్షల నుంచి రూ.50 లక్షలు డిపాజిట్ చేసే వారిని ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్తాడు. ఒక్కో వీకెండ్‌కు రూ.40 లక్షల సంపాదన ఒక్కో టేబుల్‌పై రూ.2 లక్షల నుంచి 2కోట్ల వరకు పేకాట నడుస్తుంది. ఇందులో ఒక్కో గేమ్‌ను ఒక్కో కిట్‌గా పిలుస్తారు. ప్రతీ కిట్‌పై 5 శాతం కమిషన్‌ను ముందే తీసుకుంటాడు. ఉదాహరణకు ఐదుగురు కలిసి రూ.5లక్షల గేమ్ ఆడితే మొత్తం ఆట విలువ రూ.25లక్షలు అవుతుంది. ఈ ఆటలో కమీషన్ కింద 5 శాతం అంటే రూ.1.75లక్షలు వస్తుంది. ఇలా ఒక్కో వీకెండ్లో రూ.40 లక్షల వరకు ప్రవీణ్ సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. రూ.5లక్షల వరకే ఆడదామని వెళ్లిన వారు అక్కడి వాతావరణానికి రెచ్చిపోయి రూ.20లక్షల వరకు ఆడతారని జూదరులు చెప్పారు. 2017లో మారియట్ హోటల్లో... హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2017 అక్టోబర్‌లో లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఫైవ్‌స్టార్ హోటల్ మారియట్‌పై దాడి చేశారు. దీపావళి నేపథ్యంలో ఏర్పాటు చేసిన క్యాసినో గుట్టురట్టు చేశారు. కేవలం మూడు రోజుల్లో రూ.80 లక్షలకు పైగా చేతులు మారింది. వారాసిగూడకు చెందిన సంజయ్‌కుమార్ ఈ శిబిరం ఏర్పాటు చేయగా... ప్రవీణ్ సహా నలుగురు కీలకపాత్ర పోషించి పోలీసులకు చిక్కారు. ఈ శిబిరంలో ప్రవేశించడానికి పేకాటరాయుళ్లు కనీసం రూ.2 లక్షలు చెల్లించి కాయిన్స్ (చిప్స్) తీసుకుని పేకాట టేబుల్‌పై కూర్చునేలా చేశారు. ఏడో అంతస్తు మొత్తాన్ని బుక్ చేసి... సూట్ రూమ్‌లో ఒక్కో టేబుల్‌పై 8 మంది కూర్చునేలా మొత్తం ఆరు టేబుళ్లు ఏర్పాటుచేశారు. -
పరువు నష్టం దావా: కోర్టుకు రాని పేర్వారం రాములు
హైదరాబాద్ : తెలంగాణ మాజీ డీజీపీ పేర్వారం రాములుపై మాజీ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. మాధవరెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపిన నేపథ్యంలో రాములుపై పరువునష్టం దావా వేశారు. బుధవారం రాములును విచారణకు హాజరు కావల్సిందిగా కోర్టు ఆదేశించింది. 7 శాతం వడ్డీతో రూ.75 లక్షలు చెల్లించాలని 2017లో రాములును కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, రాములు ఈ రోజు కోర్టుకు హాజరు కాలేదు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను పాటించని కారణంగా మాజీ డీజీపీ రాములును అరెస్ట్ చేయాలని పిటీషనర్ మాధవరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ డీజీపీ పేర్వారం రాములు 75 ఏళ్ల వయస్సుతో ఉండటం వల్ల కోర్టుకు హాజరు కాలేదని.. రాములు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో ఇరు వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం ఈ కేసుపై తుది తీర్పును జూలై 5వ తేదీకి వాయిదా వేసింది. -
బ్రిటన్ ఎంపీ.. బిహార్ ఎమ్మెల్యే
రాజకీయ రంగం అంటే.. అనుక్షణం వ్యూహాత్మకంగా పావులు కదపాల్సిన రంగం. డబ్బును మించిన ప్రభావవంతమైన పావు మరొకటి లేదనే పరిస్థితి.. ‘ఎన్నికలు ఖరీదైపోయాయి. రాజకీయరంగం సంపన్నులకు తప్ప సామాన్యులకు అందని రంగంగా మారింద’ని అనుకోక తప్పడం లేదు. అలాంటి సమయంలో ఉద్భవించిన వినూత్న కాన్సెప్ట్ జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఇందులో రాజకీయ వ్యూహాలుండవు. ఉన్నదంతా పారదర్శకతే. అందుకే భవిష్యత్తు జీరో బడ్జెట్ పాలిటిక్స్దే అయి తీరాలి. ఇందుకోసం కంకణం కట్టుకున్న ఓ సామాజికోద్యమకర్త ‘జీరో బడ్జెట్ మాధవరెడ్డి’.- వాకా మంజులారెడ్డి దేశవిదేశాల్లో జీరో బడ్జెట్ ‘జీరో బడ్జెట్ పాలిటిక్స్’ కాన్సెప్ట్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి దేశమంతటా పర్యటిస్తున్నారు పోతిరెడ్డి మాధవరెడ్డి. బ్రిటన్, అమెరికాలో ప్రసంగించారు. న్యూఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, రాజస్తాన్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, మంగళగిరి, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, కాగజ్‌నగర్, పెద్దపల్లి నగరాల్లో సదస్సులు నిర్వహించారు. రాజస్తాన్‌లోని బిట్స్ పిలాని, ఎమ్ఐటీ పుణే, ఐఐటీ ముంబై వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో విద్యార్థులను చైతన్యవంతం చేశారు. సమాజహితమైన, ప్రజాస్వామ్యహితమైన ఈ ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆయన ఆశయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నాయకులు సమాజాన్ని ప్రేమించాలి రాజకీయ రంగంలో వస్తున్న మార్పులు.. ఎన్నికలు జరుగుతున్న తీరుతెన్నులను గమనించినప్పుడు ప్రజాస్వామ్యం ఎటుపోతోందనే ఆవేదన కలిగేది. ఏదో ఒకటి చేయాలనిపించేది. ఆ ఆవేదనలో నుంచి పుట్టిన పరిష్కార మార్గమే జీరో బడ్జెట్ పాలిటిక్స్. నిజానికి ఇందులో బడ్జెట్ లేదు, పాలిటిక్స్ లేవు. ఉన్నదంతా మానవత్వం, మంచితనమే. నాయకుడు తన కుటుంబాన్ని ప్రేమించినట్లే సమాజాన్ని కూడా ప్రేమించగలగాలి. ముసుగు వేసుకోకుండా పారదర్శకంగా పని చేయాలని చెప్పడమే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఉద్యమం. ప్రజలకు దూరమైతే.. అసెంబ్లీ నియోజకవర్గం ఒక చివర నుంచి మరో చివరకు 50 కిలోమీటర్లకు మించదు. నియోజకవర్గం పరిధిలో సుమారు వంద గ్రామాలుంటాయి. ఐదేళ్లలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని గ్రామాల ప్రజలతో మమైకమేతే ఆ నాయకుడికి తర్వాతి ఎన్నికల్లో డబ్బు అస్సలు ప్రభావం చూపనే చూపదు. గ్రామాల్లో పర్యటిస్తే వాళ్ల అవసరాలు తెలుస్తాయి. అన్నీ ఒక్కసారే తీర్చలేకపోయినా దఫదఫాలుగా అయినా పనులు జరుగుతుంటాయి. దాంతో తమ ప్రతినిధిపై విశ్వాసం ఏర్పడుతుంది. ఈసారి గెలిపిస్తే మిగిలిన పనులు కూడా చేస్తారనే నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకమే ఎన్నికలకు పెట్టుబడి. అయితే చాలా సందర్భాల్లో డబ్బు లేని అభ్యర్థికి గెలుపు అందని ద్రాక్షగానే మిగులుతోంది. ఒక వ్యక్తి నిరాడంబరంగా చేతులు జోడించి ప్రజల ముందు నిలబడి నేను సేవ మాత్రమే చేయగలను, డబ్బు పంచలేను అని నిజాయితీగా చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఒక్క అవకాశం ఇవ్వవలసిన బాధ్యత మాత్రం సమాజానిదే. సోమ్ ప్రకాశ్‌సింగ్ ,బారోనెస్ వర్మ బ్రిటన్ ఎంపీ.. బిహార్ ఎమ్మెల్యే బ్రిటన్ పార్లమెంట్లో ఒక అనధికారిక సెషన్లో పాల్గొన్నప్పుడు అక్కడి ఎంపీ బారోనెస్ వర్మ ‘‘నేను ఇక్కడ (బ్రిటన్‌లో) ఎంపీని. అదే ఇండియాలో అయితే వార్డు మెంబర్ని కూడా కాలేకపోయేదాన్ని’’ అన్నారు. ఇండియా రాజకీయాల్లో డబ్బు ప్రభావం, వారసత్వ రాజకీయాలపై వాళ్లకు ఏర్పడిన అభిప్రాయం అది. అయితే మనం ఇక్కడ మరో సంగతి కూడా గుర్తు చేసుకోవాలి. సోమ్ ప్రకాశ్‌సింగ్ బిహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లా ఓబ్రా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. ఆయన ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఎన్నికల ఖర్చుల కోసం ప్రజలు విరాళాలు పోగు చేసి రూ.1.,48 లక్షలు ఇచ్చారు. అందులో రూ.1.22 లక్షలు మాత్రమే ఖర్చయ్యాయి అతడికి. అలాగే తెలంగాణలో సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి రిటైర్డ్ టీచర్. గడచిన పంచాయతీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి పంచాయతీ సర్పంచ్‌గా గెలిచారు. అతడికి కూడా గ్రామస్తులే లక్షా ఏడు వేల రూపాయల విరాళాలు సేకరించి పెట్టారు. అతడి ఎన్నికల ఖర్చు ఐదు వేలకు మించలేదు. మిగిలిన డబ్బు పంచాయతీకి జమ చేశారు. నిజాయతీగా ఉండే నాయకుడి వెంట జనం ఉంటారు. ఇలాంటి వాళ్లను గెలిపించడానికి పార్టీ అధిష్టానం నుంచి నాయకులు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరమే ఉండదు. వాళ్లను ప్రజలే గెలిపించుకుంటారు. అలా ప్రజల చేత గెలిపించుకోగలిగిన సత్తా ఉన్న నాయకులను తయారు చేయడమే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఉద్దేశం. అరవై ఏళ్ల బారోనెస్ వర్మ, బ్రిటన్ పార్లమెంట్ (హౌస్ ఆఫ్ లార్డ్స్) మెంబర్. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లో పుట్టారామె. బాల్యంలోనే తల్లిదండ్రులతో ఇంగ్లండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రచ్చబండ వేదికగా.. ఎన్నికల ప్రచారం ఎంత ఆడంబరంగా ఉంటే అంతగా జనాన్ని ప్రభావితం చేయవచ్చనే అపోహలో ఉన్నారు నాయకులు. నిరాడంబరంగా ప్రజలతో మమేకమయ్యే వారికే నిజమైన ఆదరణ లభిస్తుంది. ఒక గ్రామానికి వెళ్లి రచ్చబండ మీద ఒక పూట గడిపితే, గ్రామస్తులు ఆ నాయకుడిని అక్కున చేర్చుకోకుండా ఉండగలుగుతారా? అంత సమయం కేటాయించే ఓపిక ఉండడం లేదెవ్వరికీ. భారీ హోర్డింగులు, మైకులతో గంట సేపట్లో ఊరంతటినీ చుట్టేసి కాలు కింద పెట్టకుండా ప్రచారం అయిందనిపిస్తున్నారు. జనం కూడా ‘నాయకులు వచ్చారు, వెళ్లారు’ అన్నట్లే అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. వాళ్లటు వెళ్లగానే మర్చిపోతున్నారు. రేపటి తరాన్ని సిద్ధం చేయడం కోసం ఆలోచన ఉంటే ఏదీ అసాధ్యంకాదు. భవిష్యత్తు తరం ఇప్పటి విద్యార్థులదే. వారిలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆలోచన రేకెత్తిస్తే వాళ్లే భవిష్యత్తు సమాజాన్ని ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంతో పరిఢవిల్లేలా చేయగలుగుతారు. అందుకే విద్యాసంస్థలపై దృష్టి పెడుతున్నాను. కొత్తగా తెరమీదకొస్తున్న నాయకులు చిలుక పలుకుల్లా ‘జీరో బడ్జెట్ పాలిటిక్స్’ను తమ ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు. కానీ వాళ్లు కూడా ఆచరణలో పెట్టడం లేదని వాళ్ల చర్యలే చెబుతున్నాయి. కులం ఒక అపోహ ఏ కులానికైనా సరాసరిన ఐదు శాతం ఓటర్లు మాత్రమే ఉంటారు. ఒక పార్టీ నాయకుడి కులం ఐదు శాతం, స్థానిక అభ్యర్థి కులం ఐదు శాతం కలిసినా పది శాతమే. ప్రత్యర్థి పార్టీలోనూ అంతే. పది– పది ఇరవై శాతం పోగా మిగిలిన ఎనభై శాతం మంది ఓట్లు ఉంటాయి కదా! ఒకవేళ పార్టీ నాయకుడు, అభ్యర్థి ఒకే కులం వాళ్లయితే వాళ్లకు లభించే కుల మద్దతు ఐదు శాతమే. కాబట్టి కులం గెలిపిస్తుందనేది ఒక అపోహ మాత్రమే. గెలిపించేది మానవత్వం, నాయకత్వం మాత్రమే. వైఎస్ఆర్ని గుండెల్లో పెట్టుకున్నారు పాలకుడు ప్రజలకు కల్పించాల్సిన మౌలిక వసతులు విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, రోడ్డు, కరెంటు. వీటిని ఏర్పాటు చేస్తే ఆ నాయకుడిని సమాజం వదులుకోదు. గుండెల్లో పెట్టుకుంటుంది. మళ్లీ ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రజలు మనసారా స్వాగతిస్తారు. వైఎస్ఆర్ విజయవంతమైంది ఇక్కడే. మిగిలిన వాళ్లు ఎదురీదుతున్నది కూడా ఈ విషయంలోనే. ఇది మహావృక్షం నేనెక్కడికి వెళ్లినా ‘ఈ ఫార్ములాని నిరూపించడానికి మీరే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా’ అని అడుగుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఒక మహావృక్షానికి 2016లో బీజం వేశాను. మొలకెత్తి, ఎదిగి విస్తరించడానికి కనీసం ఒక దశాబ్దం పడుతుంది. మా జిల్లాలో తిమ్మమ్మ మర్రిమాను విస్తరించినట్లు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంశం కూడా ఊడలతో పరిపుష్టమవుతుంది. ఆ రోజున నేను, నాతోపాటు ఈ యజ్ఞంలో యూఎస్ నుంచి సహకరిస్తున్న శివారెడ్డి, జనార్దన్‌రెడ్డి, కోదాడ మోహన్, ఐఐటీ శివాజీ, బాలసుబ్రహ్మణ్యంతోపాటు అనేక మంది మిత్రులు కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారు. వేదికను పటిష్టంగా నిర్మించిన తర్వాత మాత్రమే ప్రదర్శన మొదలు పెట్టాలి. – పి. మాధవ్‌రెడ్డి,జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఉద్యమకర్త నమ్మకమే ఓటు విలువ పోతిరెడ్డి మాధవ్రెడ్డిది అనంతపురం జిల్లా ఎలనూరు మండలం వాసాపురం గ్రామం. అమ్మానాన్నలు సుభద్రమ్మ, చినవీరారెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబం. చిన్న కమతంతో, ముగ్గురు అక్కలకు ఓ తమ్ముడు. బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేస్తున్నారు. భార్య లక్ష్మి, బాబు ప్రణవ్, పాప భవ్యశ్రీ.. ఇదీ ఆయన కుటుంబం. మూడేళ్ల వయసులో సోకిన పోలియోనే తన జీవితాన్ని మలుపు తిప్పిందంటారు మాధవరెడ్డి. ఫ్యాక్షన్ గ్రామంలో పుట్టిన తాను ఆ చట్రంలో ఇరుక్కోకుండా బయటకు రావడమే కాక సోదరుడి వరసయ్యే వ్యక్తికి ‘పగ ప్రతీకారాల కోసం జీవితాలను అంతం చేసుకోవద్ద’ని నచ్చచెప్పారు. ఇప్పుడు దేశంలోని రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి పూనుకున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రచారంలో ఆయన ఇస్తున్న నినాదం ఇది.. ‘ఇప్పుడు కాకుంటే ఎప్పుడు...మనం కాకుంటే ఎవరు?చక్కదిద్దుదామా...మనకెందుకని వదిలేద్దామా?’ -
దర్శి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా మాధవ రెడ్డి
హైదరాబాద్ : ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా బాదం మాధవ రెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ కేంద్రకార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. -
పోలీసులపై ప్రైవేటు కేసు!
ఎస్ఐపై చేయి చేసుకోలేదన్న మాధవరెడ్డి అనంతపురం సెంట్రల్ : తనను దారుణంగా కొట్టి, అక్రమ కేసులు బనాయించిన అనంతపురం టూటౌన్ పోలీసులపై ప్రైవేట్ కేసు పెడతానని బాధితుడు కేంద్రీయ వాతావరణ కేంద్రం ఉద్యోగి మాధవరెడ్డి తెలిపారు. ఈ నెల 13న సాయినగర్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వద్ద టూటౌన్ ఎస్ఐ జనార్దన్‌పై చేయి చేసుకున్నారనే కారణంతో మాధవరెడ్డిని పోలీసులు చుట్టుముట్టి లాటీలతో కొట్టి.. అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో రెండురోజుల పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒండి నిండా గాయాలతో ఉన్న మాధవరెడ్డి బుధవారం చికిత్స కోసం సర్వజనాస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ఎస్ఐపై చేయి చేసుకోలేదని, కొడుతుంటే చేయి అడ్డుగా పెట్టానని స్పష్టం చేశారు. తనను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్ఐతో పాటు పది మంది కానిస్టేబుళ్లు దారుణంగా కొట్టారని విలపించారు. తాను ప్రభుత్వ ఉద్యోగినని, చట్టం అంటే గౌరవం ఉందని అన్నారు. తనపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తెలిపారు. తనపై బనాయించిన అక్రమకేసులు కొట్టేసేలా ఎస్పీ చొరవ తీసుకోవాలని కోరారు. పోలీసులపై ప్రైవేటు కేసు పెట్టడంతో పాటు మానవహక్కుల కమిషనన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. దెబ్బలు బాగా తగిలాయి మాధవరెడ్డికి దెబ్బలు బాగా తగిలాయని సర్వజనాస్పత్రి ఆర్థో వైద్యులు గౌస్ తెలిపారు. అన్నింటికీ ఎక్స్‌రేలు తీయించామని, రేపు ఉదయం వచ్చే రిపోర్టులను బట్టి పరిస్థితిని తెలియజేస్తామన్నారు. ఎక్కువశాతం బెడ్‌రెస్ట్ అవసరమవుతుందిదని చెప్పారు. నా భర్తకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత నా భర్తకు ప్రాణహాని ఉంది. నా భర్తకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత. సభ్యసమాజం తలదించుకునేలా పోలీసులు నా భర్తను కిరాతకంగా కొట్టారు. పైగా అక్రమంగా కేసులు నమోదు చేశారు. నాకు, నాభర్తకు న్యాయం చేయాలి. - భార్గవి, మాధవరెడ్డి భార్య -
నయీమ్... అప్పట్లో ఓ ఇన్ఫార్మర్
‘సాక్షి’తో రిటైర్డ్ ఐపీఎస్ శ్రీరామ్ తివారీ ► ఇంత పెద్ద గ్యాంగ్‌స్టర్ అయ్యాడా? ► నక్సలైట్లపై ప్రతీకారమే అతని లక్ష్యం ►మాధవరెడ్డిపై దాడిని ముందే హెచ్చరించాడు సాక్షి, హైదరాబాద్: నయీమ్ పదిహేడేళ్ల కింద ఓ పోలీస్ ఇన్ఫార్మర్గా తనకు తెలుసని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో 1997-2000 మధ్య ఎస్ఐబీ చీఫ్‌గా పని చేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీరామ్ తివారీ చెప్పారు. అప్పట్లో నక్సలైట్ల కార్యకలాపాలపై నయీమ్ సమాచారం చేరవేసేవాడన్నారు. నక్సలైట్ల అణిచివేత కార్యకలాపాలకు పోలీసు విభాగం అతన్ని అప్పట్లో వాడుకుందని చెప్పారు. ‘‘ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసులో పోలీసులకు పట్టుబడ్డ నయీమ్ కొంతకాలం జైలులో ఉన్నాడు. లొంగిపోయాక ఇన్ఫార్మర్గా పని చేశాడు. నేను ఎస్ఐబీలో ఉండగా రెండు మూడుసార్లు నన్ను కలిశాడు. చాలా భావోద్వేగంతో మాట్లాడేవాడు. నక్సలైట్లపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆరాటం అతనిలో కనిపించేది. నక్సలైట్లకు సంబంధించిన సమాచారం ఇచ్చేవాడు. అతనిచ్చే సమాచారం పక్కాగా ఉండేది. (చంద్రబాబు హయాంలో) అప్పటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య గురించి నయీమ్ మమ్మల్ని ముందే హెచ్చరించాడు. అప్పుడతను ఏదో కేసులో జైళ్లో ఉన్నాడు. ఒక పెద్ద వికెట్‌ను పీపుల్స్‌వార్ టార్గెట్ చేసిందంటూ సమాచారం చేరవేశాడు. కొన్ని వివరాలు కూడా వెల్లడించాడు. కానీ వాటిని సాంకేతికంగా మేం సరిగా డీకోడ్ చేయలేకపోయాం.. పెద్ద వికెట్ ఎవరనేది కూడా సరిగా అంచనా వేయలేకపోయాం. (అప్పటి) సీఎం చంద్రబాబును టార్గెట్ చేసి ఉంటారని అటువైపు దృష్టి సారించాం. కానీ హోంమంత్రి మాధవరెడ్డి కాన్వాయ్‌పై ఘట్కేసర్ వద్ద అటాక్ జరిగింది. రాత్రి వేళ అలా జరుగుతుందని ఊహించలేకపోయాం. ఈ విషయమై నయీమ్ ఇచ్చిన సమాచారం పక్కాగానే ఉంది. మేమే దాన్ని సరిగా డీకోడ్ చేయలేకపోయాం’’ అని గుర్తు చేసుకున్నారు. ‘‘సమాచారమిచ్చే వారికి పోలీసు విభాగం డబ్బులిచ్చేది. అలా నయీమ్‌కు కూడా కింది స్థాయి అధికారులు డబ్బులిచ్చే వారు’’ అని చెప్పారు. అతనో గ్యాంగ్‌స్టర్‌గా మారాడని, వేల కోట్లు సంపాదించాడని అతని ఎన్కౌంటర్ తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు చూస్తే తనకే ఆశ్చర్యంగా ఉందన్నారు. -
చంద్రబాబు సీఎం కావడంలో మాధవ రెడ్డిది కీలకపాత్ర
నల్లగొండ రూరల్: టీడీపీలో అంతర్గత విభేదాలు వచ్చిన సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచి ఆయన సీఎం కావడంలో దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి కీలకపాత్ర పోషించారని మాధవరెడ్డి సతీమణి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఉమా మాధవరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో నిర్వహించిన జిల్లా టీడీపీ అధ్యక్ష ఎన్నిక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తమ కుటుంబం మొదటి నుంచీ చంద్రబాబుకు అం డగా ఉందన్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్ మాధవరెడ్డి అరెస్ట్
మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామానికి చెందిన మాధవరెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రావల్కోల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గూడూరు మాధవరెడ్డి గురువారం రాత్రి మునీరాబాద్ నుంచి వస్తుండగా కడప పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ చూపి, వాహనం దిగాలని సూచించారు. వెంటనే మాధవరెడ్డి స్టీరింగ్ కేసి తలను బాదుకుని, కేకలు వేయటం ప్రారంభించాడు. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోవటంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మాధవరెడ్డి.. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారంటూ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగిన విషయాన్ని శుక్రవారం ఉదయం కడప జిల్లా పోలీసులు తెలపటంతో మేడ్చల్ పోలీసులు బిత్తరపోయారు. మాధవరెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడని తెలియగానే ఆశ్చర్యపోయారు. వారిచ్చిన వివరాల మేరకు కేసు నమోదు చేశారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు మాధవరెడ్డి ఇంటిపై దాడి చేసి, నాలుగు ఎర్రచందనం దుంగలు లభించటంతో కేసు నమోదు చేసి, అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాలేవీ తమకు తెలియదని మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి అంటున్నారు. వివాదాస్పదుడు..రౌడీషీటర్ మాధవరెడ్డి మొదటి నుంచి వివాదాస్పదుడు. పదేళ్ల క్రితమే మేడ్చల్ పోలీసులు ఆయనపై రౌడీషీట్ తెరిచారు. తాండూర్, చేవెళ్ల పోలీస్స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. అతన్ని అరెస్ట్ చేయడానికి రావల్కోల్ గ్రామానికి వెళ్లిన చేవెళ్ల పోలీసులపై కుటుంబసభ్యులు రాళ్లతో దాడి చేశారు. చిల్లర కేసుల్లో ఉండే మాధవరెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడని తెలియగానే మండల ప్రజలు విస్తుపోయారు. -
మరపురాని నేత మాధవరెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి మరణించి నేటికి పదిహేను సంవత్సరాలు పూర్త యింది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో, తెలుగుదేశం పార్టీలో కీలకపాత్ర పోషించిన మాధవరెడ్డి నక్సలైట్ల దాడిలో కన్నుమూసి అప్పుడే్చ 15 సంవత్సరాలు అయిందంటే నమ్మబుద్ధి కావటం లేదు. 1981లో సర్పంచ్‌గా, తదుపరి పంచాయతీ సమితి అధ్యక్షు నిగా 1985, 89, 94, 99లలో వరుసగా భువనగిరి శాసనసభ్యుడిగా వ్యవహరించిన మాధవరెడ్డి 1994 నుంచి 1996 వరకు ైవైద్య ఆరోగ్యశాఖామంత్రిగా, 1996-99లో హోంశాఖ మంత్రిగా, 1999-2000 సంవత్సరంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో సేవలందించారు. చెరగని చిరునవ్వుతో, పరిచయం ఉన్నవారు ఎన్నిరోజుల తర్వాత అయినా కనబడితే పదవులు, హోదాలు పక్కనబెట్టి పేరుపేరునా ఆత్మీయంగా పలకరించడం ఆయన ప్రత్యేకత. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా స్వీయ క్రమశిక్షణతో పార్టీలో కీలక స్థానంలో పనిచేస్తూ యావత్ పార్టీ నేతల, కార్యకర్తల అభిమానాన్ని చూరగొన్నారు. సామాన్య కార్యకర్తలు, ప్రజల విన్న పాలు తీర్చడంలో అందరికంటే ముం దుండేవారు. హోంశాఖపై మాధవ రెడ్డిగారు వేసిన ముద్ర చెరిగిపోనిది. జైళ్లలో సదుపాయాలు, నూతన పోలీ స్స్టేషన్లు, క్వార్టర్ల నిర్మాణం, పోలీ సులు, ఉద్యోగుల జీతాల పెంపుదల, స్టేషనరీకి, ఇతర సదుపాయాలకు, పోలీసుల సంక్షేమానికి కావలసిన బడ్జెట్ కోసం ఆయన ఎప్పుడూ శ్రద్ధ వహించేవారు. పోలీసుశాఖ సంక్షేమం ప్రాతిపదికన బడ్జెట్‌ను తీర్చిదిద్దాలని స్వయంగా అధికారులను కోరేవారు. హోంశాఖతోపాటు సినిమాటోగ్రఫీ శాఖను కూడా నిర్వహించిన మాధవరెడ్డి సినీ పరిశ్రమాభి వృద్ధిపై దృష్టి పెట్టి ఆ శాఖలో ఉన్న సమస్యలపై దృష్టి సారించారు.సినీ కార్మికుల ఇళ్లు, ఫిలిం ఛాం బర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ భవన నిర్మాణానికి ఆయన కృషి చేశారు. ఏ శాఖ కార్యకలాపాలమీదైనా సరే పూర్తి వివరాలు తెలుసుకుని మరీ చర్యలు చేపట్టే వారు. ఆయా శాఖల్లో ముఖ్యంగా చిన్న స్థాయి ఉద్యోగుల సంక్షేమానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రతిపక్షాలతో ఆయన ఎంతో స్నేహభావంతో ఉండేవారు. స్వప క్షంలో వైరివర్గం ఎంతగా కవ్వించినా సహనంతో వ్యవహరించేవారు. ‘‘ఎన్నికలలో ఎటువంటి రాజకీయా లు ఉన్నా ఓట్లు వేయడం అయిపో గానే అందరూ కలసి ఉండాలే’’ అనేవారాయన. అందుకే భువనగిరిలో జరిగే ఎన్నికలలో ఏ పార్టీ వారైనా మాధవరెడ్డి పోటీ చేసే నియోజకవర్గంలో పార్టీల జెండాలు పక్కనబెట్టి ఆయనకే ఓట్లేసేవారు. ఆయన నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ ప్రతి పక్ష పార్టీలను వేధించిన, బాధపెట్టిన సందర్భాలు మచ్చుకైనా కనబడవు. అందుకే భువనగిరిలో ఆయన హయాంలో ఎక్కడా కూడా రాజకీయ ఘర్ష ణలు జరగలేదు. హోంశాఖ మంత్రిగా ఆయన పూర్తి గా శాఖ పట్ల నిబద్ధతతో వ్యవహరించారు. ప్రజా స్వామిక పంథాలోనే హక్కులు సాధించుకోవాలి, ప్రగతిశీల పోరాటాలు నిర్మించాలనే దృక్పథం ఆయనది. ప్రతిపక్ష పార్టీనేతగా అనేక వామపక్ష పార్టీలతో ఆయన కలసిపనిచేసేవారు. నక్సలైట్లు ఆయనను లక్ష్యంగా పెట్టుకుని వధించిన ఘటన, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకించి భువనగిరి ప్రజలను, ఆయన అభిమానులను తీవ్రంగా కదిలించివేసింది. మాధవరెడ్డి పగనూ, ప్రతీకారాన్నీ కోరుకున్న వారు కాదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజంతోపాటు తీవ్ర వాద చర్యలను కూడా అదుపుచేస్తే తప్ప రాష్ట్రం బాగుండదని, రాష్ట్రాభివృద్ధికి శాంతిభద్రతలు అదు పులో ఉండాలని బలంగా విశ్వసించారు. ఆయన హత్యానంతరం పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా వెల్లువెత్తిన నిరసన, ఆందోళన ప్రజల్లో ఆయన పట్ల ఉన్న అభిమానానికి ప్రతీక. ఆయన మరణించినా వర్తమాన రాజకీయాలపై ఆయన వేసిన ముద్రను మాత్రం చెరిపివేయలేము. ఒక్కటి మాత్రం నిజం, ఆయన బ్రతికుంటే తెలంగాణ రాజకీయ స్వరూపం చాలా భిన్నంగా ఉండేది. (నేడు ఎలిమినేటి మాధవరెడ్డి 15వ వర్ధంతి) కాలేరు సురేష్ కన్వీనర్, మాధవరెడ్డి స్మారక సమితి. మొబైల్: 9866174474 -
కరెంటు ‘కట్’కట
లైన్ల పునరుద్ధరణ పేరుతో ఎడాపెడా కోతలు నగరంపై ఖరీఫ్ ఎఫెక్ట్ పగలే కాదు.. రాత్రి పూటా తప్పని తిప్పలు మంచినీటి సరఫరాకూ ముప్పు సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ఇటీవల రోజూ ఏదో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం కూడా కాస్త తగ్గింది. కానీ వినియోగదారులకు కోతల వెతలు మాత్రం తప్పడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇంతకాలం గ్రేటర్‌కు సరఫరా అయిన విద్యుత్ కోటాపై కోత పడుతోంది. సరఫరాకు, డిమాండ్‌కు మధ్య సుమారు 150 మెగావాట్ల కొరత ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లోనే అనధికారిక కోతలు అమలు చేయాల్సి వస్తోందని డిస్కం స్పష్టం చేస్తోంది. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరఫరా నిలిపివేస్తుండటం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కనీసం కరెంటు ఎప్పుడు పోతుందో, తిరిగి ఎప్పుడు వస్తుందో ముందే చెబితే, ఆ సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైన్ల పునరుద్ధరణ పేరుతో.. బైరామల్‌గూడ డివిజన్ పరిధిలోని శ్రీరమణ కాలనీలో లైన్ల పునరుద్ధరణ పేరుతో గురువారం మధ్యాహ్నం 1.30 నుంచి మూడు గంటల వ రకు సరఫరా నిలిపివేశారు. రాజేంద్రనగర్ డివిజన్లో ఉదయం తొమ్మిది నుంచి 10.30 గంటల వరకు సరఫరా నిలిపివేశారు. ఉప్పల్ సర్కిల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సరఫరా నిలిపివేశారు. నిజానికి తమ ఏరియాల్లో ఎలాంటి పునరుద్ధరణ పనులు చేపట్టలేదని.. ఏఈ, లైన్మన్లకు ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు కోత పెట్టడం వల్ల వృద్ధులు, పిల్లలు ఉక్కపోతకు తట్టుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈదురు గాలులతో కురిసిన వ ర్షానికి భూపేష్ నగర్ 11 కేవీ సబ్‌స్టేషన్‌లో ఓ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిందని, దీని స్థానంలో కొత్తది అమర్చి రీఛార్జి చేసేందుకు గంటన్నర పాటు సరఫరా నిలిపివేయాల్సి వచ్చిందని చంపాపేట్ డీఇ మాధవరెడ్డి వివరించారు. తాగునీటిపైనా కోతల ఎఫెక్ట్ ఎడాపెడా అమలవుతున్న ఈ కోతలు మంచినీటి సరఫరాకు గండంలా పరిణమించాయి. సరిగ్గా మంచినీరు సరఫరా అ వుతున్న సమయంలోనే విద్యుత్ సరఫరాను కూడా నిలిపి వేస్తుండటంతో మోటార్లు ఆగిపోతున్నాయి. నల్లాలపై ఆధారపడిన బస్తీవాసులు ఇంట్లో చుక్కనీరు లేక అల్లాడుతున్నారు. సామాన్య ప్రజలు కూడా మంచినీటి కోసం వందలాది రూపాయలను వెచ్చించక తప్పని పరిస్థితి నెలకొంది. కృష్ణానది నుంచి నగరానికి నీటిని సరఫరా చేస్తున్న మోటార్లపై కూడా ప్రభావం పడుతోందని జలమండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మంజీరా ఫేజ్-1, 2 పరిధిల్లోని రాజంపేట్, కలగ్గూర్ ప్రాంతాల్లో జలమండలి మంచినీటి పంపింగ్ కేంద్రాలకు సీపీడీసీఎల్ తరుచూ విద్యుత్ కోతలు విధిస్తుండటంతో నగరంలో పలు ప్రాంతాలకు అరకొరగా, ఆలస్యంగా మంచినీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు కాలనీలు, బస్తీలకు విద్యుత్ కోతలు శాపంగా పరిణమిస్తున్నాయి. ఆయా ప్రాంతాలకు ప్రతిరోజూ ఆలస్యంగా, అరకొరగా మంచినీళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ పరిస్థితితో మంచినీటి పంపింగ్‌కు కరెంట్ కోతలు లేకుండా చూడాలని కోరుతూ జలమండలి అధికారులు సీపీడీసీఎల్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. -
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోరు
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోరు దొంతి రాజీనామాతో ఖాళీ జిల్లా పీఠంపై పలువురు నేతల దృష్టి ఎన్నికల వేళ పొన్నాలకు తప్పని తలనొప్పి సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో పెద్ద చిక్కే వచ్చిపడింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన పొన్నాల లక్ష్మయ్య ఉన్నా... జిల్లా స్థారుులో ఆ పార్టీ సమన్వయ బాధ్యతలు చూసే అధ్యక్షుడు లేకుండాపోయారు. నర్సంపేట టికెట్ ఇచ్చి వెనక్కి తీసుకున్నందుకు నిరసనగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి దొంతి మాధవరెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ రంగంలో ఉండడంతో తక్షణం డీసీసీ పీఠాన్ని కాంగ్రెస్‌లోని ఇతర నేతలకు అప్పగించాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఆయన నిర్ణయం ప్రకారమే డీసీసీ చీఫ్‌ను నియమించనున్నారు. ఎన్నికల తరుణంలో డీసీసీ పదవిని పొన్నాల ఎవరికి కట్టబెడతారనేది ఆ పార్టీలో ఆసక్తికరంగా మారింది. సాధారణ ఎన్నికల్లోపే నియూమక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. వరంగల్ డీసీసీ చీఫ్ తరహాలోనే ఖమ్మం డీసీసీ అధ్యక్ష పదవి ఖాళీ అయింది. కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అధ్యక్షులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ జిల్లాలకు సైతం కొత్త అధ్యక్షులను నియమించే అవసరం ఉన్నందున... వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. పది మందికి పైనే... డీసీసీ పదవిపై జిల్లాలో ఆశలు పెట్టుకున్న వారు ఆ పార్టీలో ఎక్కువ మందే ఉన్నారు. సుమారు పది మంది పది మంది నేతలు ఆ పదవిని ఆశిస్తున్నారు. దొంతి మాధవరెడ్డికి టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో ఆయన సామాజికవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తల్లో కాంగ్రెస్‌పై అసంతృప్తి నెలకొందనే అభిప్రాయం ఉంది. దీన్ని తొలగించేందుకు దొంతి సామాజిక వర్గానికే తిరిగి డీసీసీ పదవిని కట్టబెట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి ప్రధానంగా జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. బీసీ వర్గాలకు ఈ పదవిని కేటాయించాల్సి వస్తే.. బండా ప్రకాష్, సాంబారి సమ్మారావు పేర్లను పరిశీలనకు రానున్నట్లు విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌గా ఉన్న జంగా రాఘవరెడ్డి డీసీసీ పదవి విషయంలో ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. డీసీసీ చీఫ్ పదవి నుంచి వైదొలిగిన మాధవరెడ్డి ప్రత్యర్థి కావడంతో జంగా రాఘవరెడ్డి దీన్ని అధిరోహించాలని భావిస్తున్నట్లు సమాచారం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించి నిరాశ చెందిన జంగాకు ఈ పదవిని ఇచ్చే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఎలా ఉంటుందో వేచిచూడక తప్పదు. వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించి భంగపడిన నాయిని రాజేందర్‌రెడ్డి పేరు డీసీసీ అధ్యక్ష పదవికి వినిపిస్తోంది. ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఉన్న రాజేందర్‌రెడ్డి.. టికెట్ల కేటాయింపు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం సైతం జరిగింది. రాజేందర్‌రెడ్డి స్వయంగా ఇలా ప్రచారం చేసుకున్నారని... మళ్లీ ఆయనే ఖండించారని నాయిని వ్యతిరేక వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై ఇలా స్పందించిన నా యినికి పదవి ఇవ్వడం సమంజసం కాదని వీరు అంటున్నారు. ప్రస్తుతం డీసీసీ అధికార ప్రతినిధి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సైతం వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించారు. టికెట్ వస్తుందనే ఉద్దేశంతోనే ముందుగానే నామినేషన్ వేశారు. పొన్నాల లక్ష్మయ్య జోక్యంతో ఉపసంహరించుకున్నారు. పార్టీలో అందరిని సమన్వయం చేసే బొద్దిరెడ్డి పేరును డీసీసీ అధ్యక్ష పదవికి పరిశీలించే అవకాశం ఉంది. తక్షణం డీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేయని పక్షంలో తాత్కాలికంగా సమన్వయ బాధ్యతలను బొద్దిరెడ్డికే అప్పగించే అవకాశం ఉంది. జంగా రాఘవరెడ్డికి డీసీసీబీ అధ్యక్ష పదవి, నాయిని రాజేందర్‌రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఉన్నారు. ఇప్పటికే వీరు పదవుల్లో ఉన్నందున డీసీసీ పీఠాన్ని అప్పగించే విషయంలో అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కాదంటే... చివరికి పొన్నాల వైశాలి పేరును పరిశీలించనున్నట్లు సమాచారం. వైశాలికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. వచ్చే ఐదేళ్ల వరకు మళ్లీ ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వైశాలి పేరును డీసీసీ అధ్యక్ష పదవికి పరిశీలించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వైశాలి ప్రస్తుతం కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇది పార్టీ పదవే కావడంతో... డీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా కాంగ్రెస్‌లో వ్యతిరేకత రాదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారుు. -
'పొన్నాల నా టికెట్ అమ్ముకున్నాడు'
తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కుట్రపూరింతగా వ్యవహరించి తనకు వచ్చిన టికెట్‌ను వేరొకరికి అమ్ముకున్నారని నర్సంపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మాధవ్ రెడ్డి ఆరోపించారు. శనివారం వరంగల్‌లో మాధవ్ రెడ్డి మాట్లాడుతూ... పొన్నాల చర్యల వల్ల తాను తీవ్ర మనస్థాపం చెందినట్లు చెప్పారు. అందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నర్సంపేటలో తన నామినేషన్ ఉపసంహరించుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. తన గెలుపుతో పొన్నాలకు బుద్ది చెప్తానని మాధవ్ రెడ్డి తెలిపారు. -
పనై.. పోయింది..
క్రాంతి, సాక్షిప్రతినిధి, నల్లగొండ: దివాళా తీసిన దుకాణం లెక్కున్న పార్టీ ఆఫీసు ముందల ఇద్దరు తెలుగుతమ్ముళ్లు దిగాలుగా కూసుండ్రు. ఎట్లున్న రోజులుఎట్లయిపాయేరా భగవంతుడా అని ఒకర్నొకరు ఓదార్సుకుంటుండ్రు. పార్టీ పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే కడుపుల కట్టెపెట్టి కెలికనట్టు అయితాందని ఇదై పోతాండ్రు. ఒకప్పటి రోజుల్ని జ్ఞాపకం జేసుకుంటుండ్రు.. ఎవడ్రా పార్టీని ఇట్ట నాశనం చేసినోడని ఉడికి పోతుండ్రు. మాధవరెడ్డి పోయిండు.. మారాజులు పోయిండ్రు.. మాయగాళ్లు వచ్చిండ్రని గుర్రుగున్నరు. కమ్యూనిస్టులతోని దోస్తితో జిల్లాల పచ్చజెండా రెపరెపలాడిన రోజుల గురించి.. జేబులు నింపుకునే సొంత పార్టీ నాయకుల తీరు గురించి.. ఏమీ పట్టించుకోక.. ఆగమాగం చేసిన నాయకుడి గురించి.. ముచ్చట్ల పడ్డరు. అసలు కొంపంతా ముంచింది మన ‘నాయకుడే’రా.. అని ఓ తమ్ముడు అక్కసంతా వెళ్లగక్కిండు. అవ్ అంటూ మరో తమ్ముడు తలూపిండు. ‘‘తెలంగాణ విషయంలాగ రెండు కళ్ల తిరకాసేంది. ఒకతాన ఒకమాట చెప్పుడు... మరోకాడ మాట మార్సుడేంది. చివరికేమైంది.. ఎటూ గాకుంట అయితిమి. తెలంగాణ కోసం కొట్లాడినం అన్నా నమ్మేటోడు లేకుంటాయే. ఇగిప్పుడు జనంలకు పోయెదెట్టా.. బయట పడేదెట్టా. పరిస్థితి ఇట్లుంటే ఒక్క సీటన్న గెలుస్తమా..? గీ సంగతి పార్టీల ఎవనికైనా తలెక్కుతుందా..?’’ అని ఓ తమ్ముడు ఉడికిపోయిండు. కార్యకర్తల గురించి పట్టించుకునేటోడే లేడు. ఎవని గోల వానిది.. ఎవడి పదవి కోసం వాడిదే ఆరాటం. గుంపుల లొల్లితో కొట్టుక చస్తుండ్రు. చేజేతాల పార్టీని నాశనం చేసిండ్రు గదరా భయ్ అని రెండో తమ్ముడు సమర్దించిండు. ఇద్దరు తమ్ముళ్లకు జరుగుతున్న సంగతులు ఒక్కొక్కటే కళ్ల ముందుకదలాడుతున్నయ్. ‘కమలం’తో దోస్తి అంటూ చక్కర కొడుతున్న ముచ్చట్లు గుర్తుకు తెచ్చుకుండ్రు. వామపక్షాలతోని దోస్తానాను మూసీల కలిపిండ్రు. ఇగిప్పుడు కమలం వెంట పడతుండ్రు. అయినా, జిల్లాల బీజేపోల్లతో దోస్తానా చేస్తే ఏం కలిసొస్తది. అయిదేళ్ల కాడ్నుంచి ఎట్లనో గట్ల పార్టీ కోసం పైసలు బెట్టినోళ్ల నోట్ల మన్నుగొడతరా ఏంది..? పార్టీల లొల్లితోనే .. షానాల్ల దాకా నియోజకవర్గాలల్ల ఎవరికీ ఇన్చార్జి పదవులియ్యలే. మొన్నమొన్ననే తీరా.. మల్లయ్య ఓ తానా.. పుల్లయ్య ఓ తానా అని లెక్క తేల్చిండ్రు. ఇగ పోటీ చేసుడే తరువాయి అనుకుని చ ంకలు గుద్దుకుని గోడల మీద రాతలు.. బ్యానర్లు.. ఫ్లెక్సీలు.. ఇంటింటికీ తెలుగుదేశం అని ఊరూరా డప్పుకొట్టుకుంట తిరిగినోని పనేం గావాలే.. అని మదన పడిపోయారు. టీడీపీ.. బీజేపీల దోస్తి పట్టాలెక్కిందో...! ఇగ మనోళ్ల పనైనట్టే.. ఇప్పుడున్న మూడు సీట్లల్ల ఒక్కటన్నా బయట పడతామా అని భయపడ్డరు. ‘‘అసలు పార్టీల ఏమైతుందో చంద్రన్నకు ఏమన్నా తెలుస్తుందా. సూస్తుండంగనే .. అయిదేళ్ల పొద్దు గిర్రున తిరిగిపోయే..పోయిన ఎలచ్చన్ల ఓట్లేసినోళ్లకు.. ఏం జేయలేక పోతిమి. ఇగిప్పుడు ఏం మొఖం పెట్టుకుని జనాల కాడికి పోవాలే.. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలకు.. రెండు గుంపులు. ఒకడు నిచ్చెనెక్కిటోడు.. కాలుపట్టి కిందికి గుంజే టోడు మరోడు. ఇగ పార్టీ ముందల పడేదెట్టరా..? కచ్చపట్టిన ట్టు పార్టీలో రచ్చ రచ్చ చేసి.. గెల్చుడు కష్టమని పెద్దల సభకు పోటీ పడిరి. అంటేంది. గీ ఎలచ్చన్న గెలవమనే కదా..? పదవులు ఎలగబెట్టినోడే పారిపోబడితే.. ఇగ పార్టీకి అండగ నిలబడేటోడు ఎవరు...’’ అనుకుంటు పార్టీ ఆఫీసుకల్ల బిక్క మొఖం పెట్టుకుని చూసిండ్రు. పాత రోజులు మళ్లేం వస్తయ్.. ఇక పార్టీ పనై పోయింద ని గునుక్కుంట ఇళ్ల దారి పట్టిండ్రు. -
రాజ్యసభ ‘రచ్చ’
సాక్షిప్రతినిధి, నల్లగొండ: పిట్టపోరు.. పిట్టపోరు పిల్లి తీర్చిన విధంగా.. జిల్లా టీడీపీలోని గుంపుల పోరును రాజ్యసభ ఎన్నికలు తీర్చేలానే కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎంతో ఆశపడి, ప్రయత్నించినా చేతికి దక్కకుండా పోయిన రాజ్యసభ టికెట్ టీడీపీలో కొత్త కుంపటి రాజేస్తోంది. ఆయన రాజ్యసభ టికెట్ కోరుతూ అధినేతకు విన్నవించుకున్నట్లు వార్తలు వచ్చిన తరువాత, ఏమాత్రం ఆలస్యం చేయకుండా భువనగిరి ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి తనూ ఓ దరఖాస్తు పెట్టేశారు. మోత్కుపల్లి ఒకవర్గంగా, ఎమ్మెల్యేలు చందర్రావు, ఉమామాధవరెడ్డి మరోవర్గంగా జిల్లా టీడీపీ రాజకీయం రక్తి కడుతున్న విషయం విదితమే. ఒకే జిల్లా నుంచి ఇద్దరు నాయకులు పోటీలు పడి టికెట్ అడగడంతో అసలుకే ఎసరు వచ్చింది. ఎవరికీ అవకాశం రాకుండాపోయింది. ఉమా మాధవరెడ్డి బాబును కలిసి రాజ్యసభ సీటు కోరిన మరుసటి రోజే, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జ్‌లందరినీ తీసుకుపోయిన మోత్కుపల్లి ఒకవిధంగా అధినేత వద్ద బల ప్రదర్శన చేశారు. అయినా, పాచిక పారకపోవడంతో అలకపాన్పు ఎక్కారు. ఇది కొత్తేం... కాదు తాను అనుకున్నట్లు అధినేతను ఆడించేందుకు.. తన పనులు చేయించుకునేందుకు.. ఎదుటి వర్గంపై పైచేయి సాధించేందుకు అలకబూనడం మోత్కుపల్లికి కొత్తేం కాదు, ఇది మొదటిసారి కూడా కాదని ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. గతంలో తెలంగాణ ఎమ్మెల్యేలంతా టీటీడీపీ ఫోరం నేత ఎర్రబెల్లి నేతత్వంలో బస్సు యాత్ర చేసిన సమయంలో కూడా ఇదే తరహాలో చెట్టెక్కి కూర్చున్నారు. ఖమ్మం జిల్లా నుంచి సూర్యాపేట నియోజకవర్గంలో ప్రవేశించి, దేవరకొండ మీదుగా మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లిన ఆ బస్సు యాత్రలో ఆయన పాల్గొనలేదు. తన అనుచరులకు నియోజకవర్గ ఇన్చార్జ్ పోస్టులు ఇప్పించుకునేందుకు ఈ ఎత్తు వేశారు. అదే మాదిరిగా, గతేడాది జనవరిలో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ‘మీ కోసం’ యాత్రకు వచ్చిన సమయంలోనూ ఇదే రిపీటైంది. ఖమ్మం జిల్లా నుంచి కోదాడ నియోజకవర్గంలో బాబు యాత్ర చేరుకునే సమయంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మంతనాలు జరిపి, బాబుతో ప్రత్యేక భేటీ అయ్యాక కానీ.. ఆయన ఈ యాత్రలో పాల్గొన లేదు. ఆ తర్వాతే హుజూర్నగర్ ఇన్చార్జ్ నియామకం జరిగింది. తన ప్రాధాన్యం తగ్గకుండా, ‘ఇలా అదను చూసి అలగడం ‘మోత్కుపల్లి’కి రివాజుగా మారిందని ఆ పార్టీ నేతలు అం టున్నారు. ఈసారి కూడా ఆయన రాజ్యసభ టికెట్ ఇవ్వలేదన్న సాకు చూపెట్టి, మరేదో పెద్ద టెండరే వేసి ఉంటారు..’ అని పార్టీ జిల్లా నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అధినేత బుజ్జగింపులతో మెట్టు దిగి పార్టీలో కొనసాగినా.. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వర్గంతో ఈ ఎన్నికల సమయంలో నిత్య పోరాటం మాత్రం తప్పేలా లేదు. కాకుంటే, గత కొద్ది నెలలుగా జిల్లా తెలుగుదేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను విశ్లేషిస్తే, ఇద్దరు ఎమ్మెల్యేలున్న వ్యతిరేక వర్గం కంటే ఆయన వర్గమే బలంగా ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో తన మాటే చెల్లుబాటు అయ్యేలా, తాను కోరిన వారికి టికెట్లు ఇప్పించుకునేలా చక్రం తిప్పే అవకాశం కూడా లేకపోలేదు. అయితే, అంతంత మాత్రంగానే ఉన్న పార్టీ పరిస్థితి, ఈ గుంపుల పోరుతో మరింత దయనీయంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం తటస్థ నాయకత్వం నుంచి వస్తోంది. ఇక, మంగళవారం మీడియాలో పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం మేకు ఆయన పార్టీని వీడుతారా, లేదా అన్న అంశంపై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. గతంలో ఓ మారు ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. తిరిగి, టీడీపీకి గూటికి చేరారు. ‘.. ఏమో, ఏమైనా జరగవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అధినేత వ్యవ హార శైలి, ఆయన తీసుకునే నిర్ణయంపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది..’ అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అభిప్రాయ పడ్డారు. మరి , ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అధినేత ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా..? లేదా అన్నది తేలాల్సి ఉంది. -
అందనంటోంది ‘బంగారు తల్లి’
దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరానికి చెందిన సూరే మౌనిక, మాధవరెడ్డి దంపతులకు 2013 సెప్టెంబర్ 28న ఆడబిడ్డ జన్మించింది. వీరు కూడా బంగారుతల్లి పథకం కోసం దరఖా స్తు చేసుకున్నారు. మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకు వారి బ్యాంక్ ఖాతాలో మొదటి విడత ఇచ్చే రూ. 2,500 జమ కాలేదు. బాండ్ కూడా మంజూరు కాలేదు. బంగారు తల్లి పథకానికి దరఖాస్తు చేసుకున్న శాంతి, మౌనిక వంటి వాళ్లు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు. సీఎం కిరణ్ మానస పుత్రికగా చెప్పుకునే బంగారుతల్లి పథకం ఆచరణలో పేరుకు తగ్గట్టుగా లేదు. ఈ ఏడాది మే ఒకటిన జిల్లాలో ప్రారంభమైన పథకానికి ఇంత వరకూ 3,500 దరఖాస్తులు వచ్చాయి. అయితే లబ్ధిదారులకు ఒక్క పైసా కూడా అందిన దాఖలాలు లేవు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉదయగిరి, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన మానసపుత్రికగా గొప్పగా చెప్పుకుంటున్న ‘బంగారుతల్లి’ పథకం బాలారిష్టాలు దాటలేదు. ఈ పథకం 2013 జూన్‌లో అసెంబ్లీ ఆమోదం పొందింది. మే 1 నుంచి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ప్రతి ఆడబిడ్డకు బంగారు భవిత కల్పిస్తామని ఊదరగొట్టింది. ఈ పథకానికి గత ఏడు నెలల్లో జిల్లాలో 3,500 దరఖాస్తులు అందాయి. వీటిలో సగం ప్రభుత్వ పరిశీలనకు వెళ్లినప్పటికీ లబ్ధిదారులకు పైసా కూడా మంజూరుకాలేదు. పథకం ప్రారంభంలోనే ఇలా ఉంటే మున్ముందు ఏ మేరకు అమలవుతుం దో అంతుపట్టని ప్రశ్నగా మారింది. జిల్లాలో ఈ పథకం మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2000లో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు బాలికా శిశుసంరక్షణ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. మహానేత వైఎస్సార్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక 2005లో ఈ పథకానికి కొద్దిగా మార్పులు చేసి ఆడబిడ్డలకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా రూపకల్పన చేశారు. తొలి కాన్పులో ఆడబిడ్డ జన్మిస్తే రూ.30 వేలు, రెండో కాన్పులో తిరిగి ఆడబిడ్డ పుడితే మరో రూ.30 వేలు ప్రభుత్వం వారి పేరుపై డిపాజిట్ చేసేది. ఒక్క ఆడబిడ్డకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి రూ.1 లక్ష డిపాజిట్ చేసేది. ఈ పథకం కింద జిల్లాలో సుమారు 17 వేల మంది దరఖాస్తు చేసుకోగా 15,500 మందికి బాండ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు వాటిని ఇంత వరకు అందజేయలేదు. మరో 1500 పెండింగ్‌లో ఉన్నాయి. ‘బంగారుతల్లి’: ఆడబిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించేలా సీఎం కిరణ్ అనేక విమర్శలను తోసిరాజని బంగారుతల్లి పథకానికి చట్టం చేశారు. ఆడబిడ్డ జన్మిస్తే రూ.2 లక్షలుపైగా లబ్ధిపొందే విధంగా రూపకల్పన చేశారు. బిడ్డ పుట్టిన నాటి నుంచి 21 ఏళ్ల వరకు దశల వారీగా నగదు వచ్చే విధంగా పథకానికి రూపకల్పన చేశారు. ఇంటర్మీడియెట్ పాసైతే రూ.50 వేలు, డిగ్రీ పాసైతే రూ.1 లక్ష ఇచ్చే విధంగా పథకాన్ని తీర్చిదిద్దారు. చెప్పుకునేందుకు బాగానే ఉన్నా ఆచరణలో అపహాస్యమవుతోంది. పెండింగ్‌లో దరఖాస్తులు గడిచిన ఏడు నెలల్లో బంగారుతల్లి పథకానికి 3,500 దరఖాస్తులు అందినట్లు సమాచారం. వీటిలో ఇంతవరకు 134 బాండ్లు మాత్రమే గత రచ్చబండలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా దరఖాస్తులన్నీ కూడా ప్రభుత్వం ఆమోదం కోసం వేచి ఉన్నాయి. -
ఖరీఫ్.. ఖతం
నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ఖరీఫ్ సాగు..ఖతమైంది. ఆగస్టు మాసం పూర్తి కావడంతో జిల్లాలో ఖరీఫ్ సాగు ఇక ముగిసిందని చెప్పవచ్చు. ఈ సారి సాధారణ సాగుకంటే 56,136 హెక్టార్లు తగ్గింది. వరుణుడు కరుణించకపోవడం.. సాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీటి విడుదలపై నెలకొన్న సందిగ్ధత.. చివరకు నీటి విడుదల చేయడం తదితర కారణాలతో ఆశించిన స్థాయిలో పంటలు సాగు కాలేదు. సీజన్ ప్రారంభంలో వరుణుడు కొంత కరుణించినప్పటికీ తరువాత ముఖం చాటేయడంతో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. దీంతో నాన్ ఆయకట్టు ప్రాంతంలో మెట్టపంటలను సాగుపై దృష్టిసారించారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం లక్షా 93 వేల 445 హెక్టార్లకు గాను ప్రస్తుత ఖరీఫ్‌లో 2,67,711 హెక్టార్లలో సాగు చేశారు. అయినప్పటికీ గత ఖరీఫ్ కంటే 30వేల 113 హెక్టార్లలో పతి పంట సాగు తగ్గింది. గత ఖరీఫ్‌లో 2,97,824 హెక్టార్లలో సాగు కావడం విశేషం. సాగు ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 5,08,938 హెకార్లు కాగా ఇప్పటి వర కు 4,52,802 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగుకు నోచుకున్నాయి. ఇంకా 56,136హెక్టార్లు సాగుకు నోచుకోని పరిస్థితి నెలకొంది. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో కొంత మేరకు వరి సాగు అయ్యే ఆవకాశం ఉంది. గత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 5,10,034 హెక్టార్లలో రైతులు వివిధ పంటలను సాగు చేసుకున్నారు. జిల్లాలో గత ఖరీఫ్‌లో వరి పంట 1,17,059హెక్టార్లలో సాగు చేయగా ప్రస్తుత ఖరీఫ్‌లో 1,12,674 హెక్టార్లలో సాగుకు నోచుకుంది. అదే విధంగా గత ఖరీఫ్‌లో పత్తి 2,97,824 హెక్టార్లలో సాగు చేయగా ప్రస్తుత ఖరీఫ్‌లో 2,67,711హెక్టార్లలో సాగు చేశారు. దీంతో పత్తి 30,113 హెక్టార్లలో తగ్గినట్లయ్యింది. ఇతర కంది, పెసర, మొక్కజొన్న పంటల సాగు మోస్తరుగా ఉంది. వాణిజ్య పంటల ఊసేలేదు. గత ఖరీఫ్‌లో పంటల సాగు సాధారణ విస్తీర్ణంకంటే ఎక్కువగా సాగుకు నోచుకున్నప్పటికీ కరువు కారణంగా రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూశారు. ప్రస్తుత ఖరీఫ్‌లోనైనా ప్రకృతి కరుణిస్తే పంటల దిగుబడులు ఆశించిన స్థాయిలో వచ్చి ఆర్థికంగా లాభాల బాటలో పయనిస్తామని ఆశలో ఆన్నదాతలు ఉన్నారు. 15వేల హెక్టార్ల వరిసాగు పెరిగే అవకాశం : జేడీఏ, బి.నర్సింహారావు ఆయకట్టులో ప్రస్తుతం నాట్లు వేసేందుకు రైతులు నార్లు సిద్ధం చేస్తున్నారు. వీరు నాట్లు వేసుకునే అవకాశం ఉంది. మరో 15వేల హెక్టార్ల వరిసాగు పెరుగుతుందని భావిస్తున్నాం. వరి సాగు చేయదలుచుకుంటే డ్రమ్‌సీడర్ ద్వారా నేరుగా నాటు వేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలి.