దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరానికి చెందిన సూరే మౌనిక, మాధవరెడ్డి దంపతులకు 2013 సెప్టెంబర్ 28న ఆడబిడ్డ జన్మించింది. వీరు కూడా బంగారుతల్లి పథకం కోసం దరఖా స్తు చేసుకున్నారు. మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకు వారి బ్యాంక్ ఖాతాలో మొదటి విడత ఇచ్చే రూ. 2,500 జమ కాలేదు. బాండ్ కూడా మంజూరు కాలేదు. బంగారు తల్లి పథకానికి దరఖాస్తు చేసుకున్న శాంతి, మౌనిక వంటి వాళ్లు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు.
సీఎం కిరణ్ మానస పుత్రికగా చెప్పుకునే బంగారుతల్లి పథకం ఆచరణలో పేరుకు తగ్గట్టుగా లేదు. ఈ ఏడాది మే ఒకటిన జిల్లాలో ప్రారంభమైన పథకానికి ఇంత వరకూ 3,500 దరఖాస్తులు వచ్చాయి. అయితే లబ్ధిదారులకు ఒక్క పైసా కూడా అందిన దాఖలాలు లేవు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఉదయగిరి, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన మానసపుత్రికగా గొప్పగా చెప్పుకుంటున్న ‘బంగారుతల్లి’ పథకం బాలారిష్టాలు దాటలేదు. ఈ పథకం 2013 జూన్‌లో అసెంబ్లీ ఆమోదం పొందింది. మే 1 నుంచి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ప్రతి ఆడబిడ్డకు బంగారు భవిత కల్పిస్తామని ఊదరగొట్టింది. ఈ పథకానికి గత ఏడు నెలల్లో జిల్లాలో 3,500 దరఖాస్తులు అందాయి. వీటిలో సగం ప్రభుత్వ పరిశీలనకు వెళ్లినప్పటికీ లబ్ధిదారులకు పైసా కూడా మంజూరుకాలేదు. పథకం ప్రారంభంలోనే ఇలా ఉంటే మున్ముందు ఏ మేరకు అమలవుతుం దో అంతుపట్టని ప్రశ్నగా మారింది. జిల్లాలో ఈ పథకం మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2000లో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు బాలికా శిశుసంరక్షణ పథకాన్ని అమల్లోకి తెచ్చారు.
ఈ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. మహానేత వైఎస్సార్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక 2005లో ఈ పథకానికి కొద్దిగా మార్పులు చేసి ఆడబిడ్డలకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా రూపకల్పన చేశారు. తొలి కాన్పులో ఆడబిడ్డ జన్మిస్తే రూ.30 వేలు, రెండో కాన్పులో తిరిగి ఆడబిడ్డ పుడితే మరో రూ.30 వేలు ప్రభుత్వం వారి పేరుపై డిపాజిట్ చేసేది. ఒక్క ఆడబిడ్డకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి రూ.1 లక్ష డిపాజిట్ చేసేది. ఈ పథకం కింద జిల్లాలో సుమారు 17 వేల మంది దరఖాస్తు చేసుకోగా 15,500 మందికి బాండ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు వాటిని ఇంత వరకు అందజేయలేదు. మరో 1500 పెండింగ్‌లో ఉన్నాయి.
‘బంగారుతల్లి’:
ఆడబిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించేలా సీఎం కిరణ్ అనేక విమర్శలను తోసిరాజని బంగారుతల్లి పథకానికి చట్టం చేశారు. ఆడబిడ్డ జన్మిస్తే రూ.2 లక్షలుపైగా లబ్ధిపొందే విధంగా రూపకల్పన చేశారు. బిడ్డ పుట్టిన నాటి నుంచి 21 ఏళ్ల వరకు దశల వారీగా నగదు వచ్చే విధంగా పథకానికి రూపకల్పన చేశారు. ఇంటర్‌మీడియెట్ పాసైతే రూ.50 వేలు, డిగ్రీ పాసైతే రూ.1 లక్ష ఇచ్చే విధంగా పథకాన్ని తీర్చిదిద్దారు. చెప్పుకునేందుకు బాగానే ఉన్నా ఆచరణలో అపహాస్యమవుతోంది.
పెండింగ్‌లో దరఖాస్తులు
గడిచిన ఏడు నెలల్లో బంగారుతల్లి పథకానికి 3,500 దరఖాస్తులు అందినట్లు సమాచారం. వీటిలో ఇంతవరకు 134 బాండ్లు మాత్రమే గత రచ్చబండలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా దరఖాస్తులన్నీ కూడా ప్రభుత్వం ఆమోదం కోసం వేచి ఉన్నాయి.
అందనంటోంది ‘బంగారు తల్లి’
Published Mon, Jan 20 2014 5:11 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement