casino camps
-
చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
-
వారి పేర్లు బయటకు చెప్పలేను: చికోటీ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహరం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చికోటి ప్రవీణ్‌పై ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను ఏ తప్పు చేయలేదు. క్యాసినో లీగల్‌గానే చేశాను. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. రాజకీయ స్వార్థం కోసమే నా భుజంపై తుపాకీ పెట్టారు. విదేశాల నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. విచారణలో రాజకీయ నేతల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారు. మా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. నేను ఎలాంటి హవాలా వ్యాపారాలకు పాల్పడలేదు అని స్పష్టం చేశారు. సినీ ప్రముఖుల ప్రమోషన్లకు చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయి. వీఐపీలు, వీవీఐపీలు క్యాసినోలకి వచ్చింది వాస్తవం. వారి పేర్లు చెప్పలేను. నాకు అన్ని పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయి. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఈడీ ఎప్పుడూ పిలిచినా వెళ్తాను’’ అని వెల్లడించారు. ఇది కూడా చదవండి: 40 ఏళ్ల పొలిటికల్ లైఫ్‌లో ఇలా ఎన్నడూ జరగలేదు.. మర్రి శశిధర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ -
ఈడీ రైడ్స్.. మాధవరెడ్డి కారుపై టీఆర్ఎస్ మంత్రి స్టిక్కర్
సాక్షి, హైదరాబాద్: క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ప్రవీణ్‌పై కేసులు నమోదుచేసి బుధవారం నగరంలోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.కోట్ల హవాలా ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ఇదిలా ఉండగా.. బోయినపల్లికి చెందిన అతడి భాగస్వామి మాధవరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో మాధవరెడ్డి ఇంట్లో ఉన్న ఓ కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్ కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సదరు కారు స్టిక్కర్‌పై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ స్టిక్కర్‌ను తాను మూడు నెలల క్రితమే పడేసినట్టు స్పష్టం చేశారు. తానే పడేసిన స్టిక్కర్‌ను ఎవరో పెట్టుకుంటే నాకేంటి సంబంధం అని మంత్రి ప్రశ్నించారు. మరోవైపు.. క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్, మాధవరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, హవాలా లావాదేవీలపై ఈడీ.. ప్రవీణ్‌ను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. సోదాల్లో ఈడీ.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను వీరు ప్రత్యేక విమానాల్లో తరలించి అక్కడ క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలు సేకరించింది. ఇది కూడా చదవండి: క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే.. -
పేకాట ఆడుతున్న ఏడుగురు కానిస్టేబుళ్ల అరెస్ట్
మహబూబ్‌నగర్: పోలీసులు దారి తప్పారు. నిత్యం పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పేకాట ఆడేవారిని అరెస్ట్ చేసే పోలీసులే పేకాట రాయుళ్లుగా అవతారమెత్తారు. ఈ దృశ్యం మహబూబ్‌నగర్ జిల్లా అయోధ్య నగర్లో ఆదివారం వెలుగుచూసింది. అందిన సమాచారం మేరకు పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుళ్ల నుంచి 93 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.