
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్ సీనియర్ స్టార్ జగపతి బాబు గోవాలోని బిగ్ డాడీ కాసినోలో ఎంజాయ్ చేశారు. స్వయంగా ఆయన కాసినోలో దిగిన ఫోటోను తన ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేసి ‘నేను గోవా, బిగ్ డాడీ కాసినోలో ఎంజాయ్ చేస్తున్నాను. నన్న విష్ చేయండి’ అంటూ ట్వీట్ చేశారు. జగపతి బాబు జూద ప్రియుడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన షూటింగ్ సమయాల్లో ఏమాత్రం గ్యాప్ దొరికిన కాసినోలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు.
ఈ అలవాటు కారణంగానే జగపతిబాబు తన ఆస్తులను కోల్పోయారన్న అపవాదు కూడా ఉంది. అయితే జగ్గుభాయ్ మాత్రం కొంతమంది నమ్మిన వ్యక్తులు మోసం చేయటం, సినిమా ఎంపికలో సరిగ్గా వ్యవహరించకపోవటం లాంటి కారణాలతోనే తాను ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను గానీ, తన అలవాట్ల కారణంగా కాదని చెపుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు ఈ సీనియర్ స్టార్.
Enjoying myself in big daddy casino Goa ..... Pls wish me luck.... pic.twitter.com/dDovDKqHKs
— Jaggu Bhai (@IamJagguBhai) August 3, 2019
Comments
Please login to add a commentAdd a comment