చిన్నారిని బలికి టీచర్‌ యత్నం | Family Members Try to Sacrifice Three year old Girl in Assam | Sakshi
Sakshi News home page

చిన్నారిని బలికి టీచర్‌ యత్నం

Published Sun, Jul 7 2019 4:58 AM | Last Updated on Sun, Jul 7 2019 5:17 AM

Family Members Try to Sacrifice Three year old Girl in Assam - Sakshi

ఉడాల్‌గురి(అస్సాం): ఒక ఉపాధ్యాయుడు, ఆయన కుటుంబం కలిసి తమ మూడేళ్ల చిన్నారిని బలి ఇచ్చేందుకు చేసిన యత్నాన్ని గ్రామస్తులు, పోలీసులు కలిసి అడ్డుకున్నారు. ఈ ఘటన అస్సాంలోని ఉడాల్‌గురి జిల్లా గనక్‌పారలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి ఇంట్లోంచి శనివారం ఉదయం దట్టమైన పొగ రావడం గ్రామస్తులు గమనించి, అప్రమత్తమయ్యారు. వారు వెళ్లి లోనికి చూడగా మహిళలు సహా ఇంట్లోని వారంతా నగ్నంగా కూర్చుని పెద్దగా మంత్రాలు చదువుతున్నారు. మధ్యలో మూడేళ్ల చిన్నారిని కూర్చోబెట్టారు.

ఆమె మెడ నరికేందుకు ఓ మంత్రగాడు పెద్దకత్తిని పట్టుకుని ఉన్నాడు. విషయం తెల్సి పోలీసులురాగానే రాళ్లు, ఇతర వస్తువులను ఇంట్లోనివాళ్లు విసిరారు. పోలీసులు గాలిలోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి, అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల్లో టీచర్‌తోపాటు అతని కొడుకు గాయపడ్డారు. బలి ఇవ్వడానికి సిద్ధం చేసిన బాలిక సదరు ఉపాధ్యాయుడి మరదలి కూతురనీ, ఆమె తల్లీ ఆ పూజల్లో పాల్గొందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement