chaild
-
నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు!
ఆమె భర్త ఏ పనిచేస్తాడో? అసలు పనిచేస్తాడో లేదో కూడా తెలియదు. ఆమె మాత్రం బతుకుదెరువు కోసం ఇ–రిక్షా నడుపుతుంది. ఇంట్లో పిల్లాడిని చూసుకోవడానికి ఎవరూ లేరు. దీంతో పిల్లాడిని ఒళ్లో పడుకోబెట్టుకొని ఇ–రిక్షా నడుపుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆమె వీడియో క్లిప్ 2.8 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. నెటిజనులను భావోద్వేగానికి గురి చేసింది. ‘ఈ వీడియో చూసి నా గుండె చెరువు అయింది’ ‘ఆమె చాలా రిస్క్ తీసుకుంటోంది. పిల్లాడిని బేబీ కేర్ సెంటర్లో చేరిస్తే మంచిది’ ‘దగ్గర్లో ఉన్న దాతలు ఎవరైనా ఆమెకు బేబీ క్యారియర్ ఇప్పిస్తే బాగుంటుంది’... ఇలా రకరకాలుగా నెటిజనులు స్పందించారు. -
నా బిడ్డను నాకివ్వండి! ప్లీజ్!!
అనుపమ ఓ బిడ్డకు తల్లి. బిడ్డ పుట్టి మొన్నటికి (ఈ నెల 19వ తేదీకి) ఏడాదైంది. సంతోషంగా బిడ్డ తొలి పుట్టిన రోజును పండగ చేసుకోవాల్సిన సమయం. ఈ ఏడాది లోపు పాపాయి బోర్లా పడడం, పాకడం, అన్నప్రాశన, తల నీలాలు తీయడం... ప్రతిదీ ఓ వేడుకగా జరిగి ఉండాల్సింది. కానీ ఏ ఒక్క వేడుకా జరగలేదు. పుట్టినరోజు వేడుక కూడా జరగలేదు. అనుపమకు తన బిడ్డ ఎక్కడ ఉందో తెలియదు. ఎలా ఉందో తెలియదు. ప్రసవం తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాక ముందు వరకే బిడ్డను పొత్తిళ్లలో చూసుకుంది అనుపమ. హాస్పిటల్ నుంచి తల్లీ బిడ్డ వేరయ్యారు. ఇంతవరకూ కలవలేదు. బిడ్డ కోసం అనుపమ పోరాడుతోంది. ఆ (కేరళ) రాష్ట్ర ముఖ్యమంత్రి కి కూడా విన్నవించుకుంది. అయినా సరే... బిడ్డ ఆచూకీ అగమ్యంగానే ఉంది. మరీ ఇంత వ్యూహాత్మకమా! ఇలాంటి సంఘటనల్లో సాధారణంగా హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బిడ్డ మాయం కావడం చూస్తుంటాం. పిల్లలు లేని మహిళలు పేషెంట్ల రూపంలో హాస్పిటల్లో సంచరిస్తూ చంటిబిడ్డను ఎత్తుకెళ్లిపోవడం కూడా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ చంటిబిడ్డ మాయం కావడానికి కారణం ఆ బిడ్డ తాత జయచంద్రన్. అతడు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. బిడ్డ ఏమైందని అడిగితే అతడు ‘నా కూతురు అనుపమ అనుమతితో ఆమె బిడ్డను దత్తత ఇచ్చేశాను’ అని చెప్తున్నాడు. ‘తన మానసిక, ఆర్థిక స్థితి సరిగ్గా లేని కారణంగా బిడ్డను పోషించే స్థితిలో లేదని, ఈ కారణాల వల్ల బిడ్డను దత్తత ఇవ్వడానికి అంగీరిస్తున్నట్లు... నా కూతురు సంతకం చేసింది చూడండి’ అని అనుపమ సంతకంతో కూడిన పత్రాన్ని కూడా చూపిస్తున్నాడు. ఇదీ కారణం! అనుపమది మలబార్ ఎరావా సామాజిక వర్గం. ఆ సామాజికవర్గానికి సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు ఉంది. ఆమె ప్రేమించిన అజిత్ దళిత క్రిస్టియన్. అనుపమ ప్రేమను ఆమె తండ్రి అంగీకరించకపోవడానికి కారణం సామాజిక వర్గమే. గర్భవతిగా ఉన్న కూతురికి మంచి మాటలు చెప్పి ప్రసవానికి పుట్టింటికి తీసుకువచ్చారు ఆమె తల్లిదండ్రులు. అనుపమ అక్కకు పెళ్లయ్యే వరకు అనుపమ పెళ్లి, బిడ్డ వివరాలను గోప్యంగా ఉంచుదామని అనుపమను నమ్మించారు. డెలివరీ తర్వాత హాస్పిటల్ నుంచి అనుపమను నేరుగా జయచంద్రన్ స్నేహితుని ఇంటికి తీసుకు వెళ్లారు. బిడ్డను మరోచోట సురక్షితంగా ఉంచామని చెప్పారు. కొన్నాళ్లకు అనుపమను పుట్టింటికి తీసుకువెళ్లారు, ఆ తీసుకువెళ్లడమే ఆమెను గదిలో బంధించారు. బిడ్డ వివరాలు అడిగితే చెప్పేవాళ్లు లేరు. పైగా అనుక్షణం ఆమెతో ఇంట్లో వాళ్లు ఎవరో ఒకరు నీడలా అంటిపెట్టుకునే ఉండేవారు. అనుపమ అక్క పెళ్లికి ఊరి వాళ్లను ఆహ్వానించే సమయంలో అనుపమను కూడా వెంట తీసుకువెళ్లారు. అనుపమ ఎక్కడా నోరు విప్పకూడదనే ఆంక్ష విధించి మరీ. అలాగే నడుచుకుంది అనుపమ. అక్క పెళ్లి తర్వాత తన బిడ్డను ఇవ్వమని, అజిత్ దగ్గరకు వెళ్తానని అడిగింది. ‘కుటుంబ ఆస్తిలో తనకు వారసత్వంగా రావాల్సిన హక్కు వదులుకుంటున్నట్లు’ సంతకం చేయమన్నాడు తండ్రి. అలాగే అతడు చెప్పిన చోటల్లా సంతకం చేసింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ల అసలు కుట్ర బయటపడింది. ‘బిడ్డను నీ అంగీకారం ప్రకారమే దత్తత ఇచ్చేశాను’ అనేశాడు అనుపమ తండ్రి. ఇన్నాళ్లూ బిడ్డ కోసం తండ్రి చెప్పినట్లల్లా చేసింది. ఇప్పుడా బిడ్డ ఆచూకీనే లేనప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా బిడ్డను దక్కించుకోవాలనే మొండిపట్టుదలతో ఇల్లు దాటి వచ్చేసింది. అజత్తోపాటు పోలీసులను ఆశ్రయించింది. తన బిడ్డ ఆచూకీ తెలిస్తే చెప్పమని కనిపించిన బంధువులను, కుటుంబ స్నేహితులను అర్థిస్తోంది. ప్రభుత్వంలో ఉన్న పెద్ద అధికారులు, పార్టీ అగ్రశ్రేణి నాయకులను కలిసి న్యాయం చేయమని మొరపెట్టుకుంది. ఆఖరుకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించింది. ఇంత జరిగినా బిడ్డ ఏమైందో ఎవరికీ తెలియడం లేదు. తన డెలివరీ లోపు ఒకసారి తల్లిదండ్రులు తనకు అబార్షన్ చేయించడానికి కూడా ప్రయత్నించినట్లు అనుపమ చెప్తోంది. తన గోడు విన్న వాళ్లందరూ సానుభూతితో స్పందిస్తున్నారు, కానీ బిడ్డ ఆచూకీ మాత్రం లభించలేదు. ‘బిడ్డకు పాలివ్వడానికి నోచుకోలేని తల్లిగా తాను, తల్లిపాలకు దూరమైన తన బిడ్డ దురదృష్టవంతుల’మని కన్నీరు పెట్టుకుంటోంది అనుపమ. కేరళ రాష్ట్రం మనదేశంలో అత్యున్నత శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని అభ్యుదయపథంలో నడుస్తున్న రాష్ట్రంగా పరిగణిస్తాం. అలాంటిది ఈ డిజిటల్ యుగంలో కూడా ‘కులం, మతం’ మనిషి జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి. బిడ్డను తల్లికి దూరం చేస్తున్నాయి. బిడ్డ ఎక్కడ ఉన్నట్లు? అనుపమ ఈ ఏడాది మార్చిలో ఇంటి నుంచి తప్పించుకుని వచ్చింది, అదే నెలలో పోలీసును ఆశ్రయించింది, పోరాడగా పోరాడగా... విషయం మీడియాలో బయటకు వచ్చిన తర్వాత పోలీసులు నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని, కానీ ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పాడు అజిత్ ఆవేదనగా. ఇక జయచంద్రన్ మాత్రం అనాథ బిడ్డల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మతొట్టిల్ పథకం ఉయ్యాల్లో వేసినట్లు ఒకసారి చెప్పాడు, శిశు సంక్షేమ శాఖ కమిటీకి అప్పగించినట్లు మరోసారి చెప్పాడు. శిశు సంక్షేమ కమిటీ నిర్వహకురాలు సునంద ఈ విషయంలో స్పందిస్తూ... ’ఏప్రిల్‌లో బిడ్డ తల్లిదండ్రులు తమ బిడ్డ ఆచూకీ కోసం వచ్చినట్లు చెబుతూ తమ వద్దకు వచ్చిన ప్రతి బిడ్డ గురించిన రికార్డు ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్నతల్లితో స్వయంగా మాట్లాడిన తర్వాత మాత్రమే బిడ్డను స్వీకరిస్తామని వివరించారు. గత ఏడాది అక్టోబర్‌లో అమ్మతొట్టిల్కి వచ్చిన ఇద్దరు శిశువుల్లో ఒక శిశువును దత్తత ఇచ్చేయడం జరిగింది. మరో శిశువుకు డీఎన్ఏ పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. నిజానిజాలు పోలీసు దర్యాప్తులో మాత్రమే తేలతాయని, ఒకవేళ దత్తత ఇచ్చిన శిశువే అనుపమ బిడ్డ అయితే ఆ బిడ్డను తిరిగి అనుపమ దంపతులకు ఇవ్వడం చట్టరీత్యా చాలా కష్టమని చెప్పింది సునంద. -
చిన్నారిపై అత్యాచారం.. దోషులకు 20 ఏళ్ల జైలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని గాంధీనగర్‌లో 2013లో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఇటీవల దోషులుగా తేల్చిన కోర్టు.. గురువారం వారికి శిక్ష ఖరారు చేసింది. దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బాధిత బాలికకు నష్ట పరిహారంగా రూ.11 లక్షలు చెల్లించాలని అదనపు సెషన్స్ జడ్జి నరేశ్ కుమార్ మల్హోత్రా ఆదేశించారు. గాంధీనగర్‌లో ఐదేళ్ల చిన్నారిని 2013 ఏప్రిల్ 15న మనోజ్ షా, ప్రదీప్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని అత్యంత క్రూరంగా హింసించారు. అనంతరం బాలిక చనిపోయిందనుకుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఘటన జరిగిన 40 గంటల తర్వాత బాలికను గుర్తించిన పోలీసులు.. ఆమెకు ఆస్పత్రికి తరలించారు. దీంతో బాలిక ప్రాణాలతో బయటపడింది. దోషులకు జీవిత ఖైదు విధించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని బాధితురాలి తరఫు లాయర్ చెప్పారు. -
చిన్నారిని బలికి టీచర్ యత్నం
ఉడాల్గురి(అస్సాం): ఒక ఉపాధ్యాయుడు, ఆయన కుటుంబం కలిసి తమ మూడేళ్ల చిన్నారిని బలి ఇచ్చేందుకు చేసిన యత్నాన్ని గ్రామస్తులు, పోలీసులు కలిసి అడ్డుకున్నారు. ఈ ఘటన అస్సాంలోని ఉడాల్గురి జిల్లా గనక్పారలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి ఇంట్లోంచి శనివారం ఉదయం దట్టమైన పొగ రావడం గ్రామస్తులు గమనించి, అప్రమత్తమయ్యారు. వారు వెళ్లి లోనికి చూడగా మహిళలు సహా ఇంట్లోని వారంతా నగ్నంగా కూర్చుని పెద్దగా మంత్రాలు చదువుతున్నారు. మధ్యలో మూడేళ్ల చిన్నారిని కూర్చోబెట్టారు. ఆమె మెడ నరికేందుకు ఓ మంత్రగాడు పెద్దకత్తిని పట్టుకుని ఉన్నాడు. విషయం తెల్సి పోలీసులురాగానే రాళ్లు, ఇతర వస్తువులను ఇంట్లోనివాళ్లు విసిరారు. పోలీసులు గాలిలోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి, అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల్లో టీచర్‌తోపాటు అతని కొడుకు గాయపడ్డారు. బలి ఇవ్వడానికి సిద్ధం చేసిన బాలిక సదరు ఉపాధ్యాయుడి మరదలి కూతురనీ, ఆమె తల్లీ ఆ పూజల్లో పాల్గొందని సమాచారం. -
పదేళ్ల బాలుడిపై లైంగిక దాడి
గుడ్లూరు(కందుకూరు): పది సంవత్సరాల బాలుడిపై ముగ్గురు మైనర్ బాలురు లైంగిక దాడికి పాల్పడిన వైనమిది. ఈ ఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. మండలంలోని గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం గ్రామంలో ఎస్టీ కాలనీకి చెందిన పదేళ్ల వయసు బాలుడిని అదే కాలనీకి చెందిన 14 ఏళ్ల వయసు గల ముగ్గురు బాలురు గత శనివారం ఊరి చివర ఉన్న అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియోలు తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తామని బాలుడిని బెదిరించడంతో భయపడి అతను ఎవరికి చెప్పలేదు. ముగ్గురిలో ఒక బాలుడు ఆ వీడియో దృశ్యాలను గ్రామానికే చెందిన హైదరాబాద్‌లో ఉన్న తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపాడు. అక్కడి వారు ఆ వీడియోలు చూసి నిర్ఘాంతపోయారు. గురువారం రాత్రి బాధిత బాలుడి తల్లిదండ్రులకు వారు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు తమ కుమారుడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కందుకూరు సీఐ నరశింహారావు, ఎస్సై వేమనలు గ్రామానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. డీఎస్పీ ప్రకాశరావు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాధిత బాలుడి నుంచి వివరాలను సేకరించారు. లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు బాలురును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ బిడ్డది ఏ దేశం!
సాక్షి, బెంగళూరు: ఆయనది భారత్.. ఆమెది పాకిస్తాన్. ఆమె అక్రమంగా భారత్‌లోకి చొరబడింది. వారికి ఈ మధ్యే ఓ అమ్మాయి పుట్టింది. ఆ బిడ్డ జాతీయతను నిర్ధారించడం బెంగళూరు పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. కేరళకు చెందిన మహ్మద్ శిహాబ్ 2010లో దుబాయ్‌కి వెళ్లి ఓ నిర్మాణ కంపెనీలో కార్మికుడిగా చేరాడు. పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి వచ్చిన సమీరా అబ్దుల్ రెహమాన్ అనే యువతితో అతడు అక్కడ ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. ఇందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వారు మరో ఇద్దరు పాకిస్తాన్‌కే చెందిన దంపతులతో కలసి నేపాల్ మీదుగా కోల్‌కతాకు అక్కడి నుంచి బెంగళూరు చేరుకున్నారు. వీరంతా కుమారస్వామి లేఔట్లో అద్దె ఇంట్లో కలిసే ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. మిగిలిన ముగ్గురుకి మహ్మద్ శిహాబ్ నకిలీ ఆధార్ కార్డులను సంపాదించి పెట్టాడు. ఈ సంగతి తెలియడంతో మే నెలలో పోలీసులు నలుగురినీ అరెస్టుచేశారు. అరెస్టు సమయంలో గర్భిణిగా ఉన్న రెహమాన్ సెప్టెంబర్ 19న ఇక్కడి వాణి విలాస్ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మినిచ్చింది. తల్లీబిడ్డ ఆస్పత్రిలోనే ఉన్నారు. నిబంధనలు ఏమంటున్నాయి? ద సిటిజన్‌షిప్ యాక్ట్ 1955 ప్రకారం 2004 డిసెంబర్ 3 తర్వాత భారత్‌లో పుట్టే శిశువు భారతీయుడు లేదా భారతీయురాలే. శిశువు తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు భారతీయుడై ఉండాలి. మరొకరు అక్రమ వలసదారు కాకూడదు. ఈ సందర్భంలో తల్లి అక్రమంగా వలసొచ్చిందికాబట్టి శిశువు జాతీయత ఏమిటనేది తేల్చలేకపోతున్నారు. నకిలీ ఆధార్ కార్డు కలిగి ఉండటం, అక్రమంగా భారత్‌లో నివసిస్తుండటంలాంటి 9 కేసులను సమీరాతో పాటు మిగిలిన ఇద్దరిపై నమోదుచేశారు. విదేశీ వ్యక్తి ఏదేని కేసులో ఇరుక్కుంటే విచారణ పూర్తయ్యేంత వరకూ అతను లేదా ఆమె దేశం దాటి వెళ్లడానికి లేదు. ప్రస్తుతానికి సమీరా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. బిడ్డను కొద్ది నెలల పాటు తల్లితోనే ఉంచాక∙శిశు సంక్షేమ శాఖకు అప్పగించాలా లేక తండ్రికా అనే విషయంపై పోలీసులు న్యాయనిపుణుల సలహాలు తీసుకునే అవకాశముంది. -
బస్సు కిందపడి చిన్నారి మృతి
పెదకాకాని : మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో సోమవారం జరిగిన ఘటనలో రెండేళ్ళ చిన్నారి అక్కడికక్కడే ప్రాణం వదిలింది. గ్రామానికి చెందిన బొమ్మవరపు నాగేశ్వరరావు, ప్రియాంక దంపతులకు ఇరువురు కుమార్తెలు. పెద్ద కుమార్తె యామిని పొన్నూరులోని వేద పబ్లిక్ స్కూల్లో చదువుకుంటోంది. రోజూ మాదిరిగానే స్కూల్ బస్సు యామినిని దిగబెట్టేందుకు గ్రామానికి వచ్చింది. ఆమెను ఇంటికి తీసుకురావడానికి తల్లి ప్రియాంక, చిన్న కుమార్తె బిందును తీసుకుని బస్సు వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో బిందు బస్సు కిందకు వెళ్ళడం, అదే సమయంలో డ్రైవర్ వాహనాన్ని ముందుకు నడపడంతో బిందు టైర్ కిందపడి మృతి చెందింది. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. -
తిరుమలలో కిడ్నాప్.. మిడ్జిల్‌లో ప్రత్యక్షం
జడ్చర్ల(మహబూబ్‌నగర్ జిల్లా): తిరుమలలో కిడ్నాపైన నవ్వ(5) అనే చిన్నారి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో ప్రత్యక్షమైంది. వివరాలు..అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తూంచర్లకు చెందిన మహాత్మ, వరలక్ష్మిల కుమార్తె నవ్యశ్రీ(5), కుమారుడు హర్షవర్ధన్(3)తో కలసి శనివారం తిరుమల వచ్చారు. గదులు లభించకపోవడంతో మాధవం యాత్రి సదన్‌లోని ఐదో నంబర్ హాలులో లాకర్ తీసుకున్నారు. రాత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లి ఆదివారం ఉదయం 6 గంటలకు తిరిగి యాత్రి సదన్‌కు చేరుకున్నారు. కుటుంబమంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి నిద్రిస్తున్న నవ్వశ్రీపై దుప్పటితో ముసుగేసి కిడ్నాప్ చేశాడు. ఉదయం 8 గంటల తర్వాత నిద్రలేచిన తల్లిదండ్రులకు బిడ్డ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. యాత్రిసదన్ లోపల, వెలుపల గాలించినా చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ మునిరామయ్య, సీఐ వెంకటరవి ఘటనాస్థలానికి చేరుకుని యాత్రిసదన్-2లోని సీసీ కెమెరా రికార్డులను పరిశీలించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులకు మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో చిన్నారి ఆచూకీ లభించింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన బాలాస్వామిగా గుర్తించారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించాలి
ఎన్సీఎల్పీ జిల్లా డైరెక్టర్ వెంకటేశ్వర్లు గుంటూరు వెస్ట్ : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో వలంటీరు ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు(ఎన్సీఎల్పీ) జిల్లా డైరెక్టర్ ఐ.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని బాలకార్మిక ప్రత్యేక కేంద్రాలలో పనిచేసే వలంటీరు ఉపాధ్యాయులకు రెండురోజులపాటు నిర్వహించనున్న శిక్షణ తరగతులు కలెక్టర్ బంగ్లారోడ్డులోని మహిళా ప్రాంగణ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాలు ఉండగా అందులో 1150 మంది బాలలకు తగిన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సక్రమంగా వినియోగించి బాల కార్మికులను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శిక్షణ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న వలంటీరు ఉపాధ్యాయులు ఆధునిక పద్ధతులను అనుసరించి విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఆర్.కే.విశ్వనాథం మాట్లాడుతూ బాలకార్మికులను గుర్తించడం, గుర్తించిన వారిని కేంద్రాలకు తరలించి తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రధాన జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా చూడాలని చెప్పారు. మహిళా ప్రాంగణం మేనేజర్ బీ.స్వరూపరాణి మాట్లాడుతూ బెగ్గింగ్ వ్యవస్థలోకి పిల్లలు రాకుండా నిరోధించాల్సిన బాధ్యత బాలకార్మిక కేంద్రాలలో విధులు నిర్వహించే సిబ్బందిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ విద్యా మిషన్ సీఎంఓ ఎం.లక్ష్మీనారాయణ, ఆల్టర్నేటివ్ స్కూల్సు కోఆర్డినేటర్(ఏఎల్‌ఎస్‌సీ) అనంతయ్య, జీ.రామకష్ణ, రీసోర్సుపర్సన్లు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల విషయంలో అప్రమత్తత అవసరం
పట్నంబజారు (గుంటూరు) : ఇటీవల కాలంలో చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు కనిపించకుండా పోవడం అధికమవుతోందని, దీనిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులు కనబడకుండాపోవడం కలవరపాటుకు గురిచేసే అంశమన్నారు. అయితే చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు నివాసం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందన్నారు. విద్యార్థుల పట్ల కుటుంబ సభ్యులతోపాటు, ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో బయటకు వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. విద్యార్థులకు ఇష్టం లేని కోర్సుల్లో చేర్పించడం, నిర్బంధంగా హాస్టల్లో చేర్పించడం వంటివి సరికాదన్నారు. వారి అభిరుచులకు తగ్గట్టుగా ఆయా కోర్సుల్లో చేర్పించడం ఉత్తమమని తెలిపారు. కుటుంబ కలహాలు, ఆస్తుల విషయాల్లో ఏర్పడే వివాదాలు చిన్నారులు, విద్యార్థులకు తెలియకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. -
చిన్నారుల విషయంలో అప్రమత్తత అవసరం
పట్నంబజారు (గుంటూరు) : ఇటీవల కాలంలో చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు కనిపించకుండా పోవడం అధికమవుతోందని, దీనిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులు కనబడకుండాపోవడం కలవరపాటుకు గురిచేసే అంశమన్నారు. అయితే చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు నివాసం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందన్నారు. విద్యార్థుల పట్ల కుటుంబ సభ్యులతోపాటు, ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో బయటకు వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. విద్యార్థులకు ఇష్టం లేని కోర్సుల్లో చేర్పించడం, నిర్బంధంగా హాస్టల్లో చేర్పించడం వంటివి సరికాదన్నారు. వారి అభిరుచులకు తగ్గట్టుగా ఆయా కోర్సుల్లో చేర్పించడం ఉత్తమమని తెలిపారు. కుటుంబ కలహాలు, ఆస్తుల విషయాల్లో ఏర్పడే వివాదాలు చిన్నారులు, విద్యార్థులకు తెలియకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. -
అమ్మ రానేలేదు.. పాపా ఏడుపాపలేదు...
ఏమైందీ కమ్యూనిస్టులకి? తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపింది ఈ కమ్యూనిస్టులేనా? స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు వచ్చాయని చెప్పుకుం టున్న భరత భూమిలో అదీ తెలంగాణ పోరు గడ్డపై కాంట్రాక్టర్ దాష్టీకానికి పసి పిల్ల పాలకోసం ఏడ్చి ఏడ్చి కన్నుమూయడమా? ఇంతటి దారుణం హైటెక్ నగరంగా చెప్పుకునే హైదరాబాద్‌కు పట్టు మని వంద కిలోమీటర్ల దూరం కూడా లేని మెదక్ జిల్లాలో జరిగింది. ఆనాడు ముసునూరు దేశ్ము ఖ్‌ను తలపించిన ఇప్పటి నయా కాంట్రాక్టర్ ఘాతుకం పట్ల కమ్యూనిస్టులు స్పందించాల్సిన తీరు ఇదేనా? ‘అమ్మనూ రమ్మని, పాలిచ్చి పొమ్మని.. కాకితోనే కబురంపాను.. కబురు అందలేదో, కామందు పంపలేదో.. అమ్మ రానేలేదు.. పాపా ఏడుపాపలేదు.. ’ అంటూ ఓ యధార్ధ సంఘటనతో జనాన్ని చైతన్య పరిచి ఓ చేత్తో వడిశెల, మరో చేత్తో తుపాకీ పట్టించిన ఎర్రదళాలు నేడు ఏమయ్యాయి. మెదక్ జిల్లా హత్నూరు మండలం తుర్కలఖాన్ పూర్లో ఇటీవల ఆర్నెల్ల పసిగుడ్డు పాలకి ఏడ్చిఏడ్చి చచ్చిపోతే నాగరిక సమాజం, పౌర సమాజం నుంచి వచ్చిన స్పందన నామమాత్రం. అన్యాయాన్ని ఎది రించే గొంతుకలు సైతం ఎందుకు పూడుకుపోయాయి? నాడు నైజాం పాలనకు ఏమాత్రం తీసి పోని ఇంతటి ఘాతుకం స్వతంత్ర తెలంగాణలో జరిగితే ఇంతవరకు ఆ కాంట్రాక్టర్‌ను అరెస్ట్ చేయమని ప్రశ్నించిన పార్టీ నేతలు లేకపోవడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు. అన్యాయాన్ని ఎదిరించేందుకు అన్నలొస్తారని, ఉపరితల కమ్యూనిస్టులు ఊతమిస్తారని గర్భశోకంతో ఉన్న ఆ మాతృమూర్తి ఎదురుచూడకపోయినా నా లాంటి వాళ్లు చాలా మంది ఆతృత పడ్డారు. ముసునూరు దేశ్‌ముఖ్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన కమ్యూనిస్టులు ఇంతటి అన్యాయాన్ని చూస్తూ ఊరకుండరని ఆశించా. అన్యాయాన్ని వేనోళ్ల తెగనాడుతున్న నేటి తరం నేతలు నిలదీ స్తారని ఎదురుచూశా. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఎవ్వరూ అడక్కుండానే స్వచ్ఛందంగా కేసులు నమోదు చేసి నివేదికలు పంపమని కోరే మానవ హక్కులు ఏమయ్యాయో, కూలీల బాగో గులు చూసే కార్మిక శాఖ ఎక్కడ కళ్లు మూసు కుందో, లేనిపోని వ్యవహారాలపై నానా హంగామా చేసే బాలల సంఘాలు ఎందుకు మౌనం దాల్చా యో అర్ధం కావడం లేదు. బిడ్డ చచ్చిపోయిన వెం టనే హడావిడిగా పూడ్చివేయించి ఆ కూలీల జం టను స్వస్థలమైన మహబూబ్‌నగర్‌కు పంపిన ఆ కాంట్రాక్టర్ క్రూరత్వాన్ని ఇంతవరకు పాలకులు కనీ సం ఖండించకపోవడం దురదృష్టకరం. ఆ కాం ట్రాక్టర్‌తో పని చేయిస్తున్న ఆ ఫార్మా కంపెనీ ఇంత వరకు ఆ ఘటనపై స్పందించకపోవడం వెనుక ఏ మతలబు దాగి ఉంది? జిల్లా రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటుంటే వాళ్లను నిలదీయాల్సిన పెద్దలు ఇంతవరకు నోరు మెదపకపోవడం, ఆ ఘటనపై నిజనిర్ధారణకు పూనుకోకపోవడం దేనికి సంకేతం. అందువల్ల ముఖ్యమంత్రిగారూ, కమ్యూనిస్టుల కొడవళ్లు మొద్దుబారిపోయాయి. ఆనాటి పోరాట పటిమ కలికానికి కూడా కానరాకుండా పోయింది. ముఖ స్తుతి పోరాటాలకు అలవాటు పడిన వీరిని వదిలేసి కనీసం మీరైనా స్పందించండి. ఆ కాంట్రాక్టర్ ధర్మ రాజు అధర్మంగా, అన్యాయంగా, అమానుషంగా ప్రవర్తించారని ప్రకటించండి. నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించిన ఆ కాం ట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించి మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపించండి. ఎ.ప్రదీప్ హైదరాబాద్