
గుడ్లూరు(కందుకూరు): పది సంవత్సరాల బాలుడిపై ముగ్గురు మైనర్ బాలురు లైంగిక దాడికి పాల్పడిన వైనమిది. ఈ ఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. మండలంలోని గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం గ్రామంలో ఎస్టీ కాలనీకి చెందిన పదేళ్ల వయసు బాలుడిని అదే కాలనీకి చెందిన 14 ఏళ్ల వయసు గల ముగ్గురు బాలురు గత శనివారం ఊరి చివర ఉన్న అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తామని బాలుడిని బెదిరించడంతో భయపడి అతను ఎవరికి చెప్పలేదు. ముగ్గురిలో ఒక బాలుడు ఆ వీడియో దృశ్యాలను గ్రామానికే చెందిన హైదరాబాద్‌లో ఉన్న తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపాడు.
అక్కడి వారు ఆ వీడియోలు చూసి నిర్ఘాంతపోయారు. గురువారం రాత్రి బాధిత బాలుడి తల్లిదండ్రులకు వారు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు తమ కుమారుడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కందుకూరు సీఐ నరశింహారావు, ఎస్సై వేమనలు గ్రామానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. డీఎస్పీ ప్రకాశరావు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాధిత బాలుడి నుంచి వివరాలను సేకరించారు. లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు బాలురును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment