బస్సు కిందపడి చిన్నారి మృతి
Published Mon, Mar 6 2017 11:06 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
పెదకాకాని : మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో సోమవారం జరిగిన ఘటనలో రెండేళ్ళ చిన్నారి అక్కడికక్కడే ప్రాణం వదిలింది. గ్రామానికి చెందిన బొమ్మవరపు నాగేశ్వరరావు, ప్రియాంక దంపతులకు ఇరువురు కుమార్తెలు. పెద్ద కుమార్తె యామిని పొన్నూరులోని వేద పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంటోంది. రోజూ మాదిరిగానే స్కూల్ బస్సు యామినిని దిగబెట్టేందుకు గ్రామానికి వచ్చింది. ఆమెను ఇంటికి తీసుకురావడానికి తల్లి ప్రియాంక, చిన్న కుమార్తె బిందును తీసుకుని బస్సు వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో బిందు బస్సు కిందకు వెళ్ళడం, అదే సమయంలో డ్రైవర్ వాహనాన్ని ముందుకు నడపడంతో బిందు టైర్ కిందపడి మృతి చెందింది. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.
Advertisement
Advertisement