తిరుమలలో కిడ్నాప్‌.. మిడ్జిల్‌లో ప్రత్యక్షం | Police find kidnapped child in Tirupati | Sakshi
Sakshi News home page

తిరుమలలో కిడ్నాప్‌.. మిడ్జిల్‌లో ప్రత్యక్షం

Published Mon, Jan 30 2017 10:05 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

తిరుమలలో కిడ్నాప్‌.. మిడ్జిల్‌లో ప్రత్యక్షం

తిరుమలలో కిడ్నాప్‌.. మిడ్జిల్‌లో ప్రత్యక్షం

జడ్చర్ల(మహబూబ్‌నగర్‌ జిల్లా): తిరుమలలో కిడ్నాపైన నవ్వ(5) అనే చిన్నారి మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌లో ప్రత్యక్షమైంది. వివరాలు..అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తూంచర్లకు చెందిన మహాత్మ, వరలక్ష్మిల కుమార్తె నవ్యశ్రీ(5), కుమారుడు హర్షవర్ధన్‌(3)తో కలసి శనివారం తిరుమల వచ్చారు. గదులు లభించకపోవడంతో మాధవం యాత్రి సదన్‌లోని ఐదో నంబర్‌ హాలులో లాకర్‌ తీసుకున్నారు.

రాత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లి ఆదివారం ఉదయం 6 గంటలకు తిరిగి యాత్రి సదన్‌కు చేరుకున్నారు. కుటుంబమంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి నిద్రిస్తున్న నవ్వశ్రీపై దుప్పటితో ముసుగేసి కిడ్నాప్‌ చేశాడు. ఉదయం 8 గంటల తర్వాత నిద్రలేచిన తల్లిదండ్రులకు బిడ్డ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. యాత్రిసదన్‌ లోపల, వెలుపల గాలించినా చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ మునిరామయ్య, సీఐ వెంకటరవి ఘటనాస్థలానికి చేరుకుని యాత్రిసదన్‌-2లోని సీసీ కెమెరా రికార్డులను పరిశీలించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులకు మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలంలో చిన్నారి ఆచూకీ లభించింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన బాలాస్వామిగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement