navya sri
-
అద్దమైన ప్రకృతి
పూలు తాజాగా ఒక పూట లేదంటే ఒక రోజు ఉంటాయి. ఆ తర్వాత వాడి నేలరాలిపోతాయి. పూలను ఫొటోలుగా తీసి దాచుకుంటారు కొందరు. కానీ వాటిని ఆభరణాలుగా మార్చి, అలంకరించుకోవచ్చు అంటోంది హైదరాబాద్‌కి చెందిన నవ్యశ్రీ మండవ. పూలను అద్దాలలో పొందుపరిచి ఆభరణంగా రూపుకడుతోంది. గ్లాస్ లిక్విడ్ గులాబీ, మల్లె, చామంతి, బంతి.. తాజా పువ్వులను, ఆకులను ఒక ప్రత్యేక పద్ధతిలో 2–3 వారాల పాటు ఎండబెడతారు. గ్లాస్ లిక్విడ్‌ని మౌల్డ్‌లో పోసి ఎండిన పువ్వులను అందులో పొందిగ్గా అమర్చి మరికొన్ని రోజులు ఉంచుతారు. దీంతో పువ్వుతో పాటు గట్టిపడిన గాజు అందాన్ని ఆభరణంగా మార్చుతారు. ‘అమెరికాలో ఈ ఆభరణాల తయారీ ఎప్పటి నుంచో ఉంది. ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఈ ఆర్ట్‌ని నేర్చుకొని వీటిని సొంతంగా తయారుచేస్తున్నాను’ అని చెబుతోంది నవ్యశ్రీ. కాదేదీ అద్దానికి అనర్హం పువ్వులు ఆకులే కాదు డ్రై ఫ్రూట్స్, కాఫీ గింజలు, టీ పొడి, కలప, పేపర్స్.. ఇలాంటి వేటినైనా ప్రకృతిలో ఉన్న ప్రతి అందాన్ని అద్దంలో బంధించవచ్చు. పెండెంట్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్, బ్రాస్లెట్, చోకర్స్ కూడా గాజుతో అందంగా తయారుచేయవచ్చు. పదిలంగా జ్ఞాపకాలని భద్రపరుచుకోవచ్చు. ఆత్మీయులకు వీటిని ప్రేమ కానుకలుగా ఇవ్వచ్చు. వందల నుంచి వేల రూపాయల వరకు డిజైన్, పరిమాణం బట్టి ధరలు ఉన్నాయి. www.instagram.com/srushti_collections_official -
సంతోషంగా ఉన్నట్లు నటించలేకపోతున్నా!
హైదరాబాద్: ‘నేను సంతోషంగా ఉన్నట్లు నటించలేకపోతున్నా. నా బాధలను మీకు చెప్పుకోవాలనుకున్నా కానీ, మీరు అర్థం చేసుకోలేక పోయారు. మీ నుంచి దూరంగా ఉండాలని, నేను చావాలని నిర్ణయించుకున్నా. నాకోసం ఎక్కడా వెతకవద్దు. మీరు నాకు కావలసినవన్నీ ఇచ్చారు. కానీ మీ ఆశలను నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి’.. అంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి పెట్టి ఓ యవతి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన బుధవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మునుగనూరుకు చెందిన బుక్యా శ్రీనివాస్ కుమార్తె నవ్యశ్రీ(18) బుధవారం మధ్యాహ్నం ఇంట్లోనుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. ఇంట్లో ఆమె లెటర్ దొరకడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మ ఒడికి చేరిన నవ్యశ్రీ
–పాప ఆచూకీ తెలిపిన యాదయ్యకు డీజీపీతో సత్కరిస్తాం – తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి తిరుపతి క్రైం : తిరుమలలో కిడ్నాపైన నవ్యశ్రీ (5)ని తల్లిదండ్రుల వద్దకు తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి సురక్షితంగా చేర్చారు. మంగళవారం రాత్రి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అర్బన్ ఎస్పీ మాట్లాడారు. జనవరి 29న అనంతపురం జిల్లా కనగానిపల్లె మండలం తూమచర్ల గ్రామానికి చెందిన మహాత్మ, వరలక్ష్మీ దంపతులు వారి ఇద్దరి పిల్లలతో తిరుమలకు వచ్చారు. పీఏసీ–2లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి నవ్యశ్రీని అపహరించాడు. అనంతరం మహబూబ్‌నగర్ వెళ్తున్న బస్సులో నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన యాదయ్య.. అపరిచుతుడితో ఉన్న పాపతో మాట్లాడి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకుని మిడ్జిల పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా పాపను తిరుమల నుంచి కిడ్నాప్ చేశానని, తనది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లె మండలం అంతరం గ్రామానికి చెందిన బాలస్వామి అని నిందితుడు పేర్కొన్నాడు. దీంతో అక్కడ పోలీసులు తిరుమల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పాపను సురక్షితంగా తీసుకొచ్చారు. యాదయ్యను విజయవాడకు పిలిపించి ఏపీ డీజీపీ సాంబశివరావుతో ఘనంగా సత్కరించి పోలీసు రివార్డు ఇస్తామని అర్బన్ ఎస్పీ ప్రకటించారు. సమావేశంలో తిరుమల సీఐ వెంకటరవి, ఎస్ఐ తులసీరాం పాల్గొన్నారు. -
తిరుమలలో కిడ్నాప్.. మిడ్జిల్‌లో ప్రత్యక్షం
జడ్చర్ల(మహబూబ్‌నగర్ జిల్లా): తిరుమలలో కిడ్నాపైన నవ్వ(5) అనే చిన్నారి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో ప్రత్యక్షమైంది. వివరాలు..అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తూంచర్లకు చెందిన మహాత్మ, వరలక్ష్మిల కుమార్తె నవ్యశ్రీ(5), కుమారుడు హర్షవర్ధన్(3)తో కలసి శనివారం తిరుమల వచ్చారు. గదులు లభించకపోవడంతో మాధవం యాత్రి సదన్‌లోని ఐదో నంబర్ హాలులో లాకర్ తీసుకున్నారు. రాత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లి ఆదివారం ఉదయం 6 గంటలకు తిరిగి యాత్రి సదన్‌కు చేరుకున్నారు. కుటుంబమంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి నిద్రిస్తున్న నవ్వశ్రీపై దుప్పటితో ముసుగేసి కిడ్నాప్ చేశాడు. ఉదయం 8 గంటల తర్వాత నిద్రలేచిన తల్లిదండ్రులకు బిడ్డ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. యాత్రిసదన్ లోపల, వెలుపల గాలించినా చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ మునిరామయ్య, సీఐ వెంకటరవి ఘటనాస్థలానికి చేరుకుని యాత్రిసదన్-2లోని సీసీ కెమెరా రికార్డులను పరిశీలించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులకు మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో చిన్నారి ఆచూకీ లభించింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన బాలాస్వామిగా గుర్తించారు.