సంతోషంగా ఉన్నట్లు నటించలేకపోతున్నా! | 18 years girl missing in Hyderabad | Sakshi
Sakshi News home page

సంతోషంగా ఉన్నట్లు నటించలేకపోతున్నా!

Published Thu, Mar 9 2017 4:54 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

సంతోషంగా ఉన్నట్లు నటించలేకపోతున్నా!

సంతోషంగా ఉన్నట్లు నటించలేకపోతున్నా!

హైదరాబాద్‌: ‘నేను సంతోషంగా ఉన్నట్లు నటించలేకపోతున్నా. నా బాధలను మీకు చెప్పుకోవాలనుకున్నా కానీ, మీరు అర్థం చేసుకోలేక పోయారు. మీ నుంచి దూరంగా ఉండాలని, నేను చావాలని నిర్ణయించుకున్నా. నాకోసం ఎక్కడా వెతకవద్దు. మీరు నాకు కావలసినవన్నీ ఇచ్చారు. కానీ మీ ఆశలను నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి’.. అంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి పెట్టి ఓ యవతి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన బుధవారం హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం... మునుగనూరుకు చెందిన బుక్యా శ్రీనివాస్‌ కుమార్తె నవ్యశ్రీ(18) బుధవారం మధ్యాహ్నం ఇంట్లోనుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. ఇంట్లో ఆమె లెటర్‌ దొరకడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement