Hayathnagar police station
-
హైదరాబాద్ : మరో ఇద్దరు మహిళల దారుణహత్య
సాక్షి, హైదరాబాద్ : వరుస హత్యాకాండలతో రాజధాని నగరం ఎరుపెక్కింది. వేర్వేరు ఘటనల్లో మంగళవారం ఒక్కరోజే ఇద్దరు యువతుల హత్యోదంతాలు వెలుగులోకి వచ్చాయి. కోండాపూర్ వద్ద గోనె సంచిలో యువతి మృతదేహాన్ని గుర్తించిన కొద్దిసేపటికే.. హయత్ నగర్లో ఓ విద్యార్థిని హత్యకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. సోమవారం చందానగర్‌లో మూడు హత్యల వ్యవహారం కలకలంరేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ.. : హయత్ నగర్లో హత్యకు గురైన యువతిని అనూషగా గుర్తించారు. బండరాయితో తలపై బలంగా మోది ఆమెను హత్యచేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన అనూష.. కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లు పోలీసులు చెప్పారు. మోహన్ అనే యువకుడితో కొన్ని రోజుల కిందటే నిశ్చితార్థమైందని, హత్యలో అతని ప్రమేయం కూడా ఉండొచ్చని మృతురాలి కుటుంబీకులు అనుమానిస్తున్నారు. నిశ్చితార్థం తర్వాత నుంచి మోహన్ వేధిస్తున్నాడని, ఘటన జరిగిన రోజు నుంచి అతని మొబైల్ స్విచాఫ్ చేసి ఉందని అనూష సోదరులు మీడియాతో అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముక్కలుగా నరికి గోనె సంచిలో కుక్కి.. : మంగళవారమే వెలుగుచూసిన మరో ఘటన ఇది. కొండాపూర్‌లోని శ్రీరాంనగర్ కాలనీ బొటానికల్ గార్డెన్ సమీపంలో స్థానికులు ఒక మూటను గుర్తించి పోలీసులను సమాచారం అందించారు. తెరిచి చూడగా.. ముక్కలుగా నరికిన మృతదేహం కనిపించింది. ఆనవాళ్లను బట్టి హత్యకు గురైంది ఓ మహిళ అని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఎవరు, చంపిపారేసిన దుండగులెవరో కనిపెట్టేందుకు యత్నిస్తున్నారు. చందానగర్‌లో మూడు హత్యల కలకలం : రంగారెడ్డి జిల్లా చందానగర్‌లో శనివారం జరిగిన ఈ మూడు హత్యల ఉదంతం సోమవారం ఉదయం వెలుగు చూసింది. అపర్ణ అనే మహిళతో సహజీవనం చేస్తున్న మధు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అపర్ణ, ఆమె కూతురు కార్తికేయ(5), తల్లి జయమ్మ(50)లను మధు దారుణంగా హతమార్చాడు. -
పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన సినీ నిర్మాత
సాక్షి, హైదరాబాద్ : సినిమాల్లో అవకాశం కల్పిస్తారా సార్.. అని ఓ యువతి వచ్చి అడిగిందే తడువు.. ‘ఓ తప్పకుండా’ అన్నాడా నిర్మాత. ఏకంగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ మూవీలోనే చాన్స్ ఇప్పిస్తాననీ మాటిచ్చాడు! అంతే.. కలల లోకంలో విహరించిందా యువతి. ఇదే అవకాశంగా తీసుకున్న అతడు హైదరాబాద్‌కు పిలిపించుకొని పలుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అతనెవరో సాదాసీదా నిర్మాతేమీ కాదు.. షారుక్ ఖాన్‌తో చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్వాలే వంటి చిత్రాలు తీసిన బాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ కరీం మొరానీ. ముంబైకి చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు కరీం మొరానీపై నిర్భయ కేసును నమోదు చేశారు. జూలై 2015న షారుక్ ఖాన్, కాజోల్ నటించిన దిల్వాలే సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరిగింది. ఆ సినిమాకు కరీం మొరానీ సహ నిర్మాత. ఆ సమయంలో ముంబైకి చెందిన ఓ యువతి సినిమాలో అవకాశం కల్పించాలని కరీం మొరానీని కలిసింది. అవకాశం ఇస్తానంటూ అతడు ఆశచూపాడు. హైదరాబాద్‌కు పిలిపించుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతేకాదు బాధితురాలి నగ్న చిత్రాలను సెల్ఫోన్లో తీసి బెదిరించినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళితే ముంబై పోలీసులు తమ పరిధిలోకి రాదని చెప్పడంతో ఆమె ఈ నెల 10న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవతను కలిసింది. సీపీ ఆదేశంతో నిర్మాత కరీం మొరానీపై ఐపీసీ 417, 376, 342, 506, 354 నిర్ఛయ యాక్ట్ కింద హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించి, తిరిగి హయత్ నగర్ పీఎస్‌కు తరలించారు కాగా కరీం మొరానీ 2జీ స్పెక్ట్రం కేసులో కూడా నిందితుడు. బాధితురాలు నిర్మాత కూతురుకు స్నేహితురాలని, ఆ సమయంలోనే వీరికి పరిచయం ఏర్పడిందని తెలిసింది. ఏడాదిన్నరగా చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. చెన్నై ఎక్స్‌ప్రెస్, దమ్, యోధా చిత్రాలకు నిర్మాతగా, దిల్వాలే, హ్యాపీ న్యూఇయర్, రావణ్, చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. -
సంతోషంగా ఉన్నట్లు నటించలేకపోతున్నా!
హైదరాబాద్: ‘నేను సంతోషంగా ఉన్నట్లు నటించలేకపోతున్నా. నా బాధలను మీకు చెప్పుకోవాలనుకున్నా కానీ, మీరు అర్థం చేసుకోలేక పోయారు. మీ నుంచి దూరంగా ఉండాలని, నేను చావాలని నిర్ణయించుకున్నా. నాకోసం ఎక్కడా వెతకవద్దు. మీరు నాకు కావలసినవన్నీ ఇచ్చారు. కానీ మీ ఆశలను నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి’.. అంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి పెట్టి ఓ యవతి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన బుధవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మునుగనూరుకు చెందిన బుక్యా శ్రీనివాస్ కుమార్తె నవ్యశ్రీ(18) బుధవారం మధ్యాహ్నం ఇంట్లోనుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. ఇంట్లో ఆమె లెటర్ దొరకడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యువతిపై అత్యాచారం.. నిర్మాతపై నిర్భయ కేసు
హైదరాబాద్: టాప్‌హీరో షారూఖ్‌ఖాన్ హీరోగా నటించిన 'దిల్వాలే', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'రా.వన్' సినిమాలను రూపొందించి, బాలీవుడ్లో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్న కరీమ్ మురానీనిపై హైదరాబాద్ పోలీసులు నిర్భయ కేసు నమోదుచేశారు. నిర్మాత కరీం.. ముంబై, హైదరాబాద్‌లో పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు నాలుగు సెక్షన్ల కింద బుధవారం కేసు నమోదుచేశారు. సంచలనాత్మక 2జీ కుంభకుణంలోనూ కరీం మొరానీ నిందితుడిగా ఉన్నాడు. స్రెక్ట్రం స్కాం అనుబంధకేసుల్లో అరెస్టైన ఇతను, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. బాధిత యువతి ముంబైకి చెందిన విద్యార్థినిఅని, సినిమాల్లో అవకాశాలకోసం ప్రయత్నిస్తున్న క్రమంలో నిర్మాత కరీం పరిచయం అయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. 'దిల్వాలే'లో ఆమె జూనియర్ ఆర్టిస్టుగానూ పనిచేసినట్లు సమాచారం. హయత్‌నగర్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన బాధితురాలు జనవరి10న హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నిర్మాత కరీమ్ మురానీపై ఫిర్యాదుచేసింది. 'దిల్వాలే' షూటింగ్ సమయంలో హైదరాబాద్‌లోని హయత్‌నగర్ సమీపంలో కరీం పలుమార్లు తనపై అత్యాచారం జరిపాడని యువతి పేర్కొంది. సదరు నిర్మాత 2015 నుంచే తనకు పరిచయం ఉందని బాధితురాలు తెలిపింది. ముంబైలో(2015లో) కరీం మత్తు మందు ఇచ్చి తనను రేప్ చేశాడని, ఆ సమయంలోనే న్యూడ్ ఫొటోలుతీసి, బ్లాక్‌మెయిల్‌చేస్తూ పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు చెప్పింది. తనకు మాఫీయాతో సంబంధాలున్నాయని, విషయం బయటికి చెబితే చంపేస్తానని కరీం మొరానీ బెదిరించేవాడని బాధిత యువతి తెలిపింది. చివరికి వేధింపులు భరించలేని స్థితిలో పోలీసులకు ఫిర్యాదుచేస్తున్నట్లు చెప్పింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం హయత్నగర్పోలీసులు నిర్మాత కరీం మొరానీపై నిర్భయ చట్టం, మరో మూడు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 'దిల్వాలే', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'రా.వన్' సినిమాలకు కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన కరీంకు 'సినీయుగ్' అనే సొంత నిర్మాణ, ఈవెంట్మేనేజర్ సంస్థకూడా ఉంది. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
భార్యాభర్తల అదృశ్యం.. కేసు నమోదు
హైదరాబాద్: భార్యాభర్తలు అదృశ్యమైన సంఘటనకు సంబంధించి శుక్రవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. సురేష్ కుమార్(36), సూర్య భారతి(34) అనే భార్యాభర్తలు నిన్న(గురువారం) హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరుకు వ్యక్తిగత పనిపై వెళ్లారు. వెళ్లేటప్పుడు ఈ విషయం కుమార్తెకు చెప్పారు. కానీ వారు గమ్యస్థానానికి చేరలేదు. వాళ్ల మొబైల్ నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ అని వస్తోంది. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.