పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన సినీ నిర్మాత | Bollywood film producer surrendered in Hayath nagar PS | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన సినీ నిర్మాత

Published Sat, Sep 23 2017 10:19 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

Bollywood film producer surrendered in Hayath nagar PS - Sakshi

ఫైల్ ఫొటో

సాక్షి, హైదరాబాద్‌ :
సినిమాల్లో అవకాశం కల్పిస్తారా సార్‌.. అని ఓ యువతి వచ్చి అడిగిందే తడువు.. ‘ఓ తప్పకుండా’ అన్నాడా నిర్మాత. ఏకంగా బాలీవుడ్‌ బాద్షా షారూక్‌ ఖాన్‌ మూవీలోనే చాన్స్‌ ఇప్పిస్తాననీ మాటిచ్చాడు! అంతే.. కలల లోకంలో విహరించిందా యువతి. ఇదే అవకాశంగా తీసుకున్న అతడు హైదరాబాద్‌కు పిలిపించుకొని పలుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అతనెవరో సాదాసీదా నిర్మాతేమీ కాదు.. షారుక్‌ ఖాన్‌తో చెన్నై ఎక్స్‌ప్రెస్‌, దిల్‌వాలే వంటి చిత్రాలు తీసిన బాలీవుడ్‌ ఫేమస్‌ ప్రొడ్యూసర్‌ కరీం మొరానీ.

ముంబైకి చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు హయత్‌నగర్‌ పోలీసులు కరీం మొరానీపై నిర్భయ కేసును నమోదు చేశారు. జూలై 2015న షారుక్‌ ఖాన్‌, కాజోల్‌ నటించిన దిల్‌వాలే సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరిగింది. ఆ సినిమాకు కరీం మొరానీ సహ నిర్మాత.
 
ఆ సమయంలో ముంబైకి చెందిన ఓ యువతి సినిమాలో అవకాశం కల్పించాలని కరీం మొరానీని కలిసింది. అవకాశం ఇస్తానంటూ అతడు ఆశచూపాడు. హైదరాబాద్‌కు పిలిపించుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతేకాదు బాధితురాలి నగ్న చిత్రాలను సెల్‌ఫోన్‌లో తీసి బెదిరించినట్లు తెలిసింది.

ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళితే ముంబై పోలీసులు తమ పరిధిలోకి రాదని చెప్పడంతో ఆమె ఈ నెల 10న రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవతను కలిసింది. సీపీ ఆదేశంతో నిర్మాత కరీం మొరానీపై ఐపీసీ 417, 376, 342, 506, 354 నిర్ఛయ యాక్ట్‌ కింద హయత్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించి, తిరిగి హయత్‌ నగర్‌ పీఎస్‌కు తరలించారు

కాగా కరీం మొరానీ 2జీ స్పెక్ట్రం కేసులో కూడా నిందితుడు. బాధితురాలు నిర్మాత కూతురుకు స్నేహితురాలని, ఆ సమయంలోనే వీరికి పరిచయం ఏర్పడిందని తెలిసింది. ఏడాదిన్నరగా చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. చెన్నై ఎక్స్‌ప్రెస్‌, దమ్‌, యోధా చిత్రాలకు నిర్మాతగా, దిల్‌వాలే, హ్యాపీ న్యూఇయర్‌, రావణ్‌, చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement