యువతిపై అత్యాచారం.. నిర్మాతపై నిర్భయ కేసు
హైదరాబాద్: టాప్‌హీరో షారూఖ్‌ఖాన్ హీరోగా నటించిన 'దిల్‌వాలే', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'రా.వన్' సినిమాలను రూపొందించి, బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్న కరీమ్ మురానీనిపై హైదరాబాద్ పోలీసులు నిర్భయ కేసు నమోదుచేశారు. నిర్మాత కరీం.. ముంబై, హైదరాబాద్‌లో పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు నాలుగు సెక్షన్ల కింద బుధవారం కేసు నమోదుచేశారు. సంచలనాత్మక 2జీ కుంభకుణంలోనూ కరీం మొరానీ నిందితుడిగా ఉన్నాడు. స్రెక్ట్రం స్కాం అనుబంధకేసుల్లో అరెస్టైన ఇతను, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.
బాధిత యువతి ముంబైకి చెందిన విద్యార్థినిఅని, సినిమాల్లో అవకాశాలకోసం ప్రయత్నిస్తున్న క్రమంలో నిర్మాత కరీం పరిచయం అయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. 'దిల్‌వాలే'లో ఆమె జూనియర్ ఆర్టిస్టుగానూ పనిచేసినట్లు సమాచారం. హయత్‌నగర్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
ముంబైకి చెందిన బాధితురాలు జనవరి10న హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నిర్మాత కరీమ్ మురానీపై ఫిర్యాదుచేసింది. 'దిల్‌వాలే' షూటింగ్ సమయంలో హైదరాబాద్‌లోని హయత్‌నగర్ సమీపంలో కరీం పలుమార్లు తనపై అత్యాచారం జరిపాడని యువతి పేర్కొంది. సదరు నిర్మాత 2015 నుంచే తనకు పరిచయం ఉందని బాధితురాలు తెలిపింది. ముంబైలో(2015లో) కరీం మత్తు మందు ఇచ్చి తనను రేప్ చేశాడని, ఆ సమయంలోనే న్యూడ్ ఫొటోలుతీసి, బ్లాక్‌మెయిల్‌చేస్తూ పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు చెప్పింది.
తనకు మాఫీయాతో సంబంధాలున్నాయని, విషయం బయటికి చెబితే చంపేస్తానని కరీం మొరానీ బెదిరించేవాడని బాధిత యువతి తెలిపింది. చివరికి వేధింపులు భరించలేని స్థితిలో పోలీసులకు ఫిర్యాదుచేస్తున్నట్లు చెప్పింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం హయత్‌నగర్‌పోలీసులు నిర్మాత కరీం మొరానీపై నిర్భయ చట్టం, మరో మూడు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 'దిల్‌వాలే', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'రా.వన్' సినిమాలకు కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన కరీంకు 'సినీయుగ్' అనే సొంత నిర్మాణ, ఈవెంట్‌మేనేజర్ సంస్థకూడా ఉంది. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.