హైదరాబాద్ : మరో ఇద్దరు మహిళల దారుణహత్య | Hyderabad : two young women killed in separate accidents | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ : మరో ఇద్దరు మహిళల దారుణహత్య

Published Tue, Jan 30 2018 12:13 PM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

Hyderabad : two young women killed in separate accidents - Sakshi

1.మాదాపూర్‌: గోనె సంచిలో మహిళ మృతదేహం. 2.హయత్‌ నగర్‌లో హత్యకు గురైన అనూష ఫైల్‌ ఫొటో

సాక్షి, హైదరాబాద్‌ : వరుస హత్యాకాండలతో రాజధాని నగరం ఎరుపెక్కింది. వేర్వేరు ఘటనల్లో మంగళవారం ఒక్కరోజే ఇద్దరు యువతుల హత్యోదంతాలు వెలుగులోకి వచ్చాయి. కోండాపూర్‌ వద్ద గోనె సంచిలో యువతి మృతదేహాన్ని గుర్తించిన కొద్దిసేపటికే.. హయత్‌ నగర్‌లో ఓ విద్యార్థిని హత్యకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. సోమవారం చందానగర్‌లో మూడు హత్యల వ్యవహారం కలకలంరేపిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతూ.. : హయత్‌ నగర్‌లో హత్యకు గురైన యువతిని అనూషగా గుర్తించారు. బండరాయితో తలపై బలంగా మోది ఆమెను హత్యచేశారు.  నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన అనూష.. కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్నట్లు పోలీసులు చెప్పారు. మోహన్‌ అనే యువకుడితో కొన్ని రోజుల కిందటే నిశ్చితార్థమైందని, హత్యలో అతని ప్రమేయం కూడా ఉండొచ్చని మృతురాలి కుటుంబీకులు అనుమానిస్తున్నారు. నిశ్చితార్థం తర్వాత నుంచి మోహన్‌ వేధిస్తున్నాడని, ఘటన జరిగిన రోజు నుంచి అతని మొబైల్‌ స్విచాఫ్‌ చేసి ఉందని అనూష సోదరులు మీడియాతో అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ముక్కలుగా నరికి గోనె సంచిలో కుక్కి.. : మంగళవారమే వెలుగుచూసిన మరో ఘటన ఇది. కొండాపూర్‌లోని శ్రీరాంనగర్‌ కాలనీ బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో స్థానికులు ఒక మూటను గుర్తించి పోలీసులను సమాచారం అందించారు. తెరిచి చూడగా.. ముక్కలుగా నరికిన మృతదేహం కనిపించింది. ఆనవాళ్లను బట్టి హత్యకు గురైంది ఓ మహిళ అని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఎవరు, చంపిపారేసిన దుండగులెవరో కనిపెట్టేందుకు యత్నిస్తున్నారు.

చందానగర్‌లో మూడు హత్యల కలకలం : రంగారెడ్డి జిల్లా చందానగర్‌లో శనివారం జరిగిన ఈ మూడు హత్యల ఉదంతం సోమవారం ఉదయం వెలుగు చూసింది. అపర్ణ అనే మహిళతో సహజీవనం చేస్తున్న మధు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అపర్ణ, ఆమె కూతురు కార్తికేయ(5), తల్లి జయమ్మ(50)లను మధు దారుణంగా హతమార్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement