తిరుపతి : ఇంట్లో తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారిని గుర్తుతెలియని ఆగంతకుడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన శనివారం తిరుపతి నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నగరం రూరల్ పరిధిలోని విద్యానగర్ కాలనీలో సంతోష్, భక్తు దంపతులు నివాసం ఉంటున్నారు. సంతోష్ స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగి. కాగా శనివారం మధ్యాహ్నం భక్తు తన కుమారుడు ఉత్తమ్(27 రోజులు)తో ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని ఆగంతకుడు లోపలికి ప్రవేశించి శిశువును ఎత్తుకుపోయాడు.
వెళ్తూ వెళ్తూ బయటి నుంచి తలుపు గడియపెట్టాడు. నిద్ర మేల్కొని చూసుకున్న భక్తు చిన్నారి కనిపించకపోయేసరికి తలుపు తీసేందుకు ప్రయత్నించింది. ఎవరైనా సాయం చేస్తారని గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోయేసరికి నిస్సహాయంగా ఉండిపోయింది. సాయంత్రం 5 గంటలకు డ్యూటీ నుంచి ఇంటికి చేరుకున్న సంతోష్ విషయం తెలుసుకుని ఎమ్మార్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
27 రోజుల పసికందు అపహరణ
Published Sat, Sep 5 2015 6:26 PM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement
Advertisement