గువాహటి/హైలకండి: తాలిబన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గానూ అస్సాం పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. వీరిలో అస్సాంకు చెందిన పోలీస్ కానిస్టేబుల్, ఒక ఉపాధ్యాయుడు, ముగ్గురు మౌలానాలు, ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వీరిని అరెస్టు చేసినట్లు స్పెషల్ డీజీపీ జీపీ సింగ్ శనివారం ట్వీట్ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, ఐటీ చట్టం, సీఆర్‌పీసీ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తాలిబన్లకు సంబంధించి పోస్టులను లైక్ చేయడం, ట్వీట్ చేయడం, రీట్వీట్ చేయడం వంటి చర్యలను మానుకోవాలని జీపీ సింగ్ హెచ్చరించారు. అలా చేస్తే వారిపై క్రిమినల్ విచారణ జరుపుతున్నామని డిప్యూటీ ఐజీ వయొలెట్ బారువా తెలిపారు. అలాంటి కేసులు ఏవైనా కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment