
టీడీపీ నేత లోకేష్‌తో హరికృష్ణ (ఫైల్)
సాక్షి, చిత్తూరు: కారులో గంజాయి తరలిస్తున్న చిత్తూరు జిల్లా పుత్తూరు తెలుగుయువత అధ్యక్షుడు బి.ఎస్.హరికృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం నుంచి 28 కిలోల గంజాయిని తరలిస్తుండగా ఆయన్ని సోమవారం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో పోలీసులు పట్టుకున్నారు. ఆయన తెలుగుదేశం నగరి నియోజకవర్గ ఇన్‌చార్జి గాలి భానుప్రకాష్‌కి ప్రధాన అనుచరుడు. హరికృష్ణ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు.
చదవండి: రఘరామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు
పుత్తూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారంవిలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి.జయప్రకాష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై రోజూ నిందారోపణలు చేసే టీడీపీ నాయకుడు గాలి భానుప్రకాష్ తన ప్రధాన అనుచరుడు హరికృష్ణ అరెస్టుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఇసుక, లిక్కర్ స్మగ్లింగ్ మాత్రమే చేసేవారని, నేడు గంజాయి వరకు వ్యాపారాన్ని పెంచారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment