టెహ్రాన్: ఉక్రెయిన్ విమానాన్ని ఇరాన్ కూల్చివేసిన ఘటనలో 30 మందిని అరెస్ట్ చేసినట్లు ఇరాన్ న్యాయ విభాగ అధికార ప్రతినిధి గులాం హుస్సేన్ ఇస్మాయిలీ తెలిపారు. మంగళవారం జరిగిన లోతైన విచారణ అనంతరం బాధ్యులైన వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించిన కాసేపటికి గులం హుస్సేన్ అరెస్టు గురించి చెప్పారు. అమెరికా చర్యల వల్లనే ఈ ఘటన జరిగినప్పటికీ.. ప్రమాదాన్ని తాము సమర్థించడంలేదని రౌహానీ చెప్పారు. గతవారం టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కుప్పకూలగా 176 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ పొరబాటుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment