
ఢాకా: వలసవాద కాలానికి చెందిన అధికారిక గోప్యతా చట్టం (1923) కింద బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ ప్రముఖ మహిళా జర్నలిస్టు రోజినా ఇస్లాంను అరెస్టు చేయడంపై అక్కడి జర్నలిస్టు సంఘాలు, హక్కుల సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వానికి చెందిన కొన్ని ఫైల్స్‌ను ఆమె అనుమతి లేకుండా ఫొటోలు తీశారని, అందువల్ల అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. పోలీసులు ఐదురోజుల కస్టడీ కోరగా కోర్టు నిరాకరించి జైలుకు పంపింది. అరెస్టయిన మహిళా జర్నలిస్టు రోజినా ఇస్లాం ఆ దేశంలోని ప్రోతోమ్ అలో అనే వార్తా పత్రికకు పని చేస్తున్నారు. అది దేశంలోనే అతి పెద్ద వార్తా పత్రిక కావడం గమనార్హం.
చదవండి: బైడెన్ దంపతుల ఆదాయమెంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment