
తాడికొండ: వ్యభిచారం కేసులో టీడీపీ నేత, అమరావతి దళిత జేఏసీ నేత చిలకా బసవయ్యను ఆదివారం గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. రాయపూడి – మోదుగ లింగాయపాలెం గ్రామాల మధ్య ఓ రేకుల షెడ్డులో తుళ్లూరుకు చెందిన ఓ యువతితో రాసలీలలు సాగిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దళిత జేఏసీ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తూ మహిళలను లొంగదీసుకుంటున్నాడనే ఆరోపణలు బసవయ్యపై ఉన్నాయి. యువతితో రాసలీలల్లో ఉండగా వీరికి కాపలాగా ఉన్న రామచంద్రవర్మ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.