
గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన సీఐ రఘు, ఎస్సై చంద్రశేఖర్
సాక్షి, నల్లజర్ల(పశ్చిమ గోదావరి) : ఒక కారులో గట్టుచప్పుడు కాకుండా నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను నల్లజర్ల పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే. విచారణ అనంతరం గురువారం రాత్రి ముఠా సభ్యులను తాడేపల్లిగూడెం పట్టణ సీఐ ఆకుల రఘు, తహసీల్దార్ కనకదుర్గ నిందితుల్ని అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టుకు హాజరుపర్చినట్టు ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కాట్రోడ్డు నవీన్, వడిపే సంజీవ్, విశాఖపట్టణానికి చెందిన వెంకటలక్ష్మి బృందంగా ఏర్పడి కమిషన్‌పై గంజాయి రవాణా చేస్తుంటారు. ఇలా అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారివద్ద నుంచి 80 ప్యాకెట్లలో ఉన్న 160 కిలోల గంజాయి, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment